అమరావతి (కలిదిండి)

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, కలిదిండి మండలం లోని గ్రామం

అమరావతి, కలిదిండి, కృష్ణా జిల్లా, కలిదిండి మండలానికి చెందిన గ్రామం.

అమరావతి (కలిదిండి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి గండికోట మాధురీదేవి
జనాభా (2011)
 - మొత్తం 1,463
 - పురుషులు 699
 - స్త్రీలు 764
 - గృహాల సంఖ్య 410
పిన్ కోడ్ 521344
ఎస్.టి.డి కోడ్ 08677

విశేషాలుసవరించు

  • శ్రీ గండికోట వెంకన్న గారు ఈ గ్రామ సర్పంచిగా 3 సార్లు అనగా 1970-81, 1988-95, 2001-06 లలో సేవలందించారు. తన వంతు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.

ప్రభుత్వం రు.2.5 లక్షలు కేటాయించగా, తాను అదనంగా తన స్వంత నిధులనుండి రు.2 లక్షలు విరాళంగా ఇచ్చి పంచాయతీకి నూతన భవనన్ని నిర్మించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణంలోనూ ఒక లక్ష రూపాయలు వెచ్చించారు. అమరావతిలో ఒకటి, కొత్తూరులో రెండు, ప్రాథమిక పాఠశాలల నిర్మాణం చేసారు. రహదార్లు అభివృద్ధి చేశారు. 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఈ గ్రామానికి సర్పంచిగా వీరి కుమారుని కోడలు శ్రీమతి గండికోట మాధురీదేవిని గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. [1]

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

భీమవరం, పెడన, ఏలూరు, గుడివాడ

సమీప మండలాలుసవరించు

కైకలూరు, ఆకివీడు, కల్ల, కృత్తివెన్ను

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్ ఉన్నత పాఠశాల, అమరావతి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

ఏలూరుపాడు, గురవాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 81 కి.మీ

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 1,463 - పురుషుల సంఖ్య 699 - స్త్రీల సంఖ్య 764 - గృహాల సంఖ్య 410

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1240.[2] ఇందులో పురుషుల సంఖ్య 597, స్త్రీల సంఖ్య 643, గ్రామంలో నివాసగృహాలు 345 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kalidindi/Amaravathi". Retrieved 7 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-14. Cite web requires |website= (help)

[1] ఈనాడు కృష్ణా 2013 జూలై 26. 8వ పేజీ.