అమలాపురం పురపాలక సంఘం
అమలాపురం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లాకు చెందిన అమలాపురం పట్టణ స్ధానిక స్వపరిపాలన సంస్థ. ఇది అమలాపురం లోకసభ నియోజకవర్గంలోని, అమలాపురం శాసనసభ నియోజకవర్గం పరిధిలోనిది.
అమలాపురం | |
![]() | |
స్థాపన | 1940 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | అమలాపురం |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర సవరించు
రాష్ట్ర రాజధానికి 201 కి.మీ లో ఉంది. అమలాపురం పురపాలక సంఘం 1940లో మున్సిపాలిటీగా స్థాపించబడింది. ఈ పురపాలక సంఘంలో 30 వార్డులు ఉన్నాయి.[1] కొబ్బరి ,వరి పంటలను పండిస్తారు. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల తరువాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇది మూడవ అతిపెద్ద పట్టణం.[2]
జనాభా గణాంకాలు సవరించు
అమలాపురం పురపాలక సంఘం లో 30 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2001 లో జనాభా 51444 ఉన్న జనాభా 2011 లో 53231 కు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం అమలాపురం మునిసిపాలిటీలో 53,231 జనాభా ఉండగా అందులో పురుషులు 26,485,మహిళలు 26,746 మంది ఉన్నారు.అమలాపురం మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 14,639 ఇండ్లు కలిగిఉన్నాయి. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4635 ఉన్నారు.అక్షరాస్యత రేటు 76%, పురుష జనాభాలో 79% ఉండగా, స్త్రీ జనాభాలో 73% అక్షరాస్యులు ఉన్నారు.[3][4]
పౌర పరిపాలన సవరించు
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 30 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2021 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం రెడ్డి సత్య నాగేంద్రమణి చైర్‌పర్సన్‌గా,టిక్కి రెడ్డి వెంకటేశ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
2021ఎన్నిక ఫలితాలు సవరించు
అమలాపురం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు- 2021 |
![]() |
నోట్:ఇతరులు 1 వై.కా.పా జనసేన
తెలుగుదేశం
|
ఇతర వివరాలు సవరించు
ఈ పురపాలక సంఘంలో 14120 గృహాలు ఉన్నాయి.ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.33 మురికివాడలు ఉన్నాయి, ఈ మురికివాడలో 15298 జనాభా ఉన్నారు.5 ఇ-సేవా కేంద్రాలు,2 ఉన్నత పాఠశాలలు,23 ప్రాథమిక పాఠశాలలు,ఒక మార్కెట్టు ఉన్నాయి.[5]
మూలాలు సవరించు
- ↑ https://web.archive.org/web/20160128175528/http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf
- ↑ https://amalapuram.cdma.ap.gov.in/en/amalapuram-municipality[permanent dead link]
- ↑ https://www.census2011.co.in/data/town/802958-amalapuram-andhra-pradesh.html 2011 జనాభా లెక్కలు
- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-18. Retrieved 2020-06-17.