అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

అమలాపురం
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లాతూర్పు గోదావరి
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలుఅమలాపురం
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1962
ప్రస్తుత పార్టీవై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులుచింతా అనురాధ
మొదటి సభ్యులుబయ్యా సూర్యనారాయణ మూర్తి

చరిత్రసవరించు

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. అదే సమయంలో ఈ నియోజకవర్గం పలు మార్పులకు గురైనది. పునర్విభజనకు పూర్వం ఈ లోక్‌సభ నియోజకవర్గంలో తాళ్ళరేవు, ముమ్మిడివరం, అల్లవరం, అమలాపురం, నగరం, రాజోలు, కొత్తపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన గన్నవరంతో పాటు రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న రామచంద్రాపురం సెగ్మెంట్లు ఇందులో చేర్చబడింది.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలుసవరించు

 1. అమలాపురం
 2. కొత్తపేట
 3. పి. గన్నవరం
 4. ముమ్మిడివరం (SC) (పాక్షికం) మిగిలిన భాగం కాకినాడ జిల్లాలో వుంది.
 5. మండపేట
 6. రాజోలు
 7. రామచంద్రపురం

నియోజకవర్గపు గణాంకాలుసవరించు

 • 2001 లెక్కల ప్రకారం జనాభా: 18, 32, 830 [1]
 • ఓటర్ల సంఖ్య:12, 38, 690
 • ఎస్సీ, ఎస్టీల శాతం: 23.65%, 0.66%.

నియోజకవర్గపు ప్రత్యేకతలుసవరించు

 • దేశంలోనే ఎస్సీలు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో ఇది ఒకటి.
 • ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దివంగత జి.ఎం.సి.బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశాడు.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులుసవరించు

లోక్‌సభపదవీకాలంసభ్యుని పేరుఎన్నికైన పార్టీ
మూడవ1962-67బయ్యా సూర్యనారాయణ మూర్తిభారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ1967-71బయ్యా సూర్యనారాయణ మూర్తిభారత జాతీయ కాంగ్రెసు
ఐదవ1971-77బయ్యా సూర్యనారాయణ మూర్తిభారత జాతీయ కాంగ్రెసు
ఆరవ1977-80కుసుమ కృష్ణమూర్తిభారత జాతీయ కాంగ్రెసు
ఏడవ1980-84పి.వి.జి.రాజుభారత జాతీయ కాంగ్రెసు
ఎనిమదవ1984-89ఎ.జె.వెంకట బుచ్చిమహేశ్వరరావుతెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ1989-91కుసుమ కృష్ణమూర్తిభారత జాతీయ కాంగ్రెసు
పదవ1991-96గంటి మోహనచంద్ర బాలయోగితెలుగుదేశం పార్టీ
పదకొండవ1996-98కె.ఎస్.ఆర్.మూర్తిభారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ1998-99గంటి మోహనచంద్ర బాలయోగితెలుగుదేశం పార్టీ
పదమూడవ1999-04గంటి మోహనచంద్ర బాలయోగితెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ2004-2009జి.వి.హర్షకుమార్భారత జాతీయ కాంగ్రెసు
15వ2009-2014జి.వి.హర్షకుమార్భారత జాతీయ కాంగ్రెసు
16వ2014-ప్రస్తుతంపండుల రవీంద్రబాబుతెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలుసవరించు

2004 ఎన్నికల ఫలితాలను చూపే పై చిత్రము

  దున్న జనార్థనరావు (43.86%)
  భూపతి మహేశ్వరరావు (3.79%)
  యాగంటి రమేష్ (1.36%)
  డి మురళీకృష్ణ (1.25%)
సాధారణ ఎన్నికలు,2004:అమలాపురం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ జి.వి.హర్షకుమార్ 350,346 49.75 +12.12
తె.దే.పా దున్న జనార్థనరావు 308,861 43.86 -11.70
ఇండిపెండెంట్ భూపతి మునీశ్వరరావు 26,699 3.79
ఇండిపెండెంట్ రమేశ్ యాలంగి 9,550 1.36
బసపా డి.మురళీకృష్ణ 8,768 1.25
మెజారిటీ 41,485 5.89 +23.82
మొత్తం పోలైన ఓట్లు 704,224 74.59 -0.85
కాంగ్రెస్ గెలుపు మార్పు +12.12

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున జి.వి.హర్షకుమార్ పోటీ చేశారు.[2] ఈయన సమీప ప్రత్యర్థి అయిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పోతుల ప్రమీలా దేవిపై విజయం సాధించారు.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2009 24 అమలాపురం (SC) జి.వి.హర్షకుమార్ పు కాంగ్రెస్ 368501 పోతుల ప్రమీలాదేవి స్త్రీ ప్ర.రా.పా 328496

2014 ఎన్నికల ఫలితాలుసవరించు

2014 ఎన్నికల ఫలితాలు

  పి.విశ్వరూప్ (42.28%)
  ఇతరులు (4.68%)
సార్వత్రిక ఎన్నికలు, 2014: అమలాపురం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తె.దే.పా పండుల రవీంద్రబాబు 594,547 53.04 +27.20
వై.కా.పా పినిపె విశ్వరూప్ 473,971 42.28 N/A
కాంగ్రెస్ ఐతాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు 12,182 1.09 -34.90
జై సమైక్యాంధ్ర పార్టీ జి.వి.హర్షకుమార్ 9,931 0.89 N/A
బసపా గెడ్డం సంతాదరావు 7,219 0.64 N/A
NOTA None of the Above 6,141 0.55 N/A
మెజారిటీ 120,576 10.76 +6.86
మొత్తం పోలైన ఓట్లు 1,120,927 82.55 +2.27
కాంగ్రెస్ పై తె.దే.పా విజయం సాధించింది ఓట్ల తేడా +9.75

2019 ఎన్నికల ఫలితాలుసవరించు

2019 ఎన్నికల ఫలితాలు [3]

  గంటి హరీష్ (36.18%)
  డి.ఎం.ఆర్.శేఖర్ (20.7%)
  ఇతరులు (3.69%)
సార్వత్రిక ఎన్నికలు, 2019: అమలాపురం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
వై.కా.పా చింతా అనూరాధ 485313 39.43 -2.85
తె.దే.పా గంటి హరీష్ మాథుర్ 445347 36.18 -16.86
జనసేన డి.ఎం.ఆర్.శేఖర్ 254848 20.7 N/A
కాంగ్రెస్ జంగా గౌతమ్ 7878 1.09 0.64 -0.45
భాజపా మానేపల్లి అయ్యజీవేమ 11516 0.94 +0.3
NOTA నోటా 16449 1.34 +0.79
మెజారిటీ 39966 +3.25 -3.61
మొత్తం పోలైన ఓట్లు 1230903 82.55 +2.27
తె.దే.పా పై వై.కా.పా విజయం సాధించింది ఓట్ల తేడా

మూలాలుసవరించు

 1. సాక్షి దినపత్రిక
 2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
 3. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2019".