అరక్కోణం తమిళనాడు రాష్ట్రంలోని ఒక పట్టణం. ఇది ఒక రైల్వే జంక్షను. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 78,395 మంది జనాభా కలిగిన ఈ పట్టణం కొత్తగా ఏర్పడిన రాణీపేట్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం జిల్లా కేంద్రం రాణీపేట్‌కు 54 కి.మీ. దూరంలోనూ, రాజధాని చెన్నైకు 69 కి.మీ.ల దూరంలోనూ ఉంది. చెన్నై పట్టణ శివారు ప్రాంతమైన అరక్కోణం వేసవిలో 43 °C (110 °F) వరకు ఉష్ణోగ్రతను కలిగివుంటుంది.

అరక్కోణం
రైల్వే పట్టణం
అరక్కోణం is located in Tamil Nadu
అరక్కోణం
అరక్కోణం
Coordinates: 13°04′40″N 79°40′00″E / 13.07778°N 79.66667°E / 13.07778; 79.66667
దేశం India
రాష్ట్రంతమిళనాడు
జిల్లారాణీపేట్ జిల్లా
Government
 • Typeమొదటి గ్రేడ్ మునిసిపాలిటీ
 • Bodyఅరక్కోణం మునిసిపాలిటీ
జనాభా
 (2011)
 • Total78,395
భాషలు
 • అధికారికతమిళం
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
631001 నుండి 631006 వరకు
Vehicle registrationTN-73

చరిత్ర

మార్చు

ఈ పట్టణం పేరు అరక్కోణం ప్రాచీన నామం "అరంతమిళ్ కుంద్రమ్‌". ఇది ఆరు కోణమ్‌ అనే తమిళ పదం నుండి పుట్టింది. ఈ పదానికి అర్థం ఆరు కోణాలు లేదా షడ్భుజి. ఈ పట్టణానికి ఆరువైపులా కాంచీపురం, తక్కోలం, మనావూర్, తిరువలంగాడు, తిరుత్తణి, పొన్నై, షోలింగర్ అనే ఆరు ముఖ్యమైన ప్రదేశాలు ఉండటం వల్ల ఈ పట్టణానికి ఈ పేరు వచ్చింది.

అరక్కోణం రైల్వే జంక్షను [1] దేశంలోని పురాతన రైల్వేజంక్షన్లలో ఒకటి. ఇక్కడి నుండి బెంగళూరు, ముంబయి, గోవా, విజయవాడ, హైదరాబాద్, కోయంబత్తూరు, తిరుపతి, మంగళూరు, కొచ్చి, తిరువనంతపురం వంటి నగరాలకు రైలు సదుపాయం ఉంది.

మునిసిపాలిటీ

మార్చు

అరక్కోణం మునిసిపాలిటీ 1958 అక్టోబరు 1న మూడవ గ్రేడు మునిసిపాలిటీగా అవతరించింది. 1974 మేనెలలో ఇది రెండవ గ్రేడు స్థాయికి, 1984 ఏప్రిల్‌లో మొదటి గ్రేడు మునిసిపాలిటీ స్థాయికి ఎదిగింది. ఈ మునిసిపాలిటీ 9.06 కి.మీ2 (3.50 చ. మై.) విస్తీర్ణాన్ని కలిగి ఉంది. అరక్కోణం అదే పేరుతో ఉన్న శాసన సభ, పార్లమెంటరీ నియోజకవర్గాలకు కేంద్రంగా ఉంది. ఈ మునిసిపాలిటీలో 36 వార్డులున్నాయి.

నగర సదుపాయాలు

మార్చు
 
అరక్కోణం రైల్వేస్టేషన్

అరక్కోణం జంక్షన్ రైల్వే స్టేషన్ రాణీపేట్ జిల్లాలో అతిపెద్ద రైల్వే జంక్షన్. ఇది చెన్నై- బెంగళూరు, గుంతకల్ - చెన్నై రైల్వే మార్గాలను కలుపుతుంది. ఈ పట్టణంలో దక్షిణ రైల్వేకి చెందిన ఇంజనీరింగ్ వర్క్‌షాప్ (EWS), ఎలెక్ట్రిక్ లోకో షెడ్ (ELS) వంటి పెద్ద పెద్ద వర్కుషాపులు నెలకొని వున్నాయి[2] ఇక్కడి నుండి చెన్నైకి సబర్బన్ ఎలెక్ట్రిక్ రైలు సదుపాయం కూడా ఉంది. భారత ఆహార సంస్థ (FCI) కి చెందిన రెండవ అతిపెద్ద గిడ్డంగి ఈ పట్టణంలో ఉంది. ఇక్కడ అన్ని రకాల ఆహార ధాన్యాలను ఎక్కువ కాలం నిలువవుంచుతారు. అన్ని ముఖ్యమైన నగరాలకు, పట్టణాలకు ఇక్కడి నుండి రవాణా సదుపాయం ఉంది.

అరక్కోణంలోని భారత నావికా దళానికి చెందిన నావల్ ఎయిర్ స్టేషన్ INS రజలి 4,500 మీటర్ల పొడవైన రన్‌వేని కలిగి ఉంది. ఈ రన్‌వే భారత ఉపఖండంలో రెండవ అతి పొడవైన రన్‌వే. ఆసియాఖండంలోకెల్లా రెండవ అతిపెద్ద నావికా శిక్షణా సంస్థ కూడా అరక్కోణంలో నెలకొల్పారు. భారత రైల్వేలకు చెందిన గణనీయ సంస్థ ఇంజనీరింగ్ వర్క్‌షాప్ (EWS) లో రైల్వేలకు సంబంధించిన అనేక లోహ పరికరాలు తయారవుతాయి. ఇక్కడ తయారైన కొన్ని యంత్రాలు 100 యేళ్ల వయసు కలిగి ఇప్పటికీ పనిచేస్తున్నాయి.

ఎం.ఆర్.ఎఫ్.టైర్స్, రామ్‌కో ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కర్మాగారాలు అరక్కోణంలో నెలకొని ఉన్నాయి. ఇక్కడ అనేక కళాశాలలు ఉన్నాయి.

బ్రిటిష్ హయాంలో ఇక్కడ అనేక కార్యాలయ భవనాలు నిర్మించబడ్డాయి. అరక్కోణం నుండి కాంచీపురానికి రైలు మార్గం క్రింద పురాతన సొరంగ మార్గం ఉంది.

జనాభా

మార్చు
మతపరమైన గణాంకాలు
మతము శాతంt(%)
హిందూ
  
81.22%
ముస్లిం
  
9.83%
క్రైస్తవ
  
7.95%
సిక్కు
  
0.04%
బౌద్ధ
  
0.03%
జైన
  
0.35%
ఇతరులు
  
0.58%
మతం లేనివారు
  
0.01%

2011 భారత జనాభా గణన ప్రకారం అరక్కోణంలో 78,395 మంది మనుషులున్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 1020మంది స్త్రీలు ఉన్నారు. ఇది జాతీయ సగటు కన్నా 929 ఎక్కువ.

[3] ఆరు సంవత్సారల లోపు పిల్లల సంఖ్య 7,727. వీరిలో 3,995 మంది బాలురు కాగా 3,732 మంది బాలికలు. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాల వారు 27.1 శాతం ఉండగా, షెడ్యూల్డ్ తెగల వారి శాతం 1.11 మాత్రమే. జాతీయ సగటు అక్షరాస్యత 72.99% ఐతే ఈ పట్టణంలో అక్షరాస్యులు మొత్తం జనాభాలో 81.81% ఉన్నారు.[3] 2011 జనాభా గణాంకాల ప్రకారం ఈ పట్టణంలో 19507 గృహాలున్నాయి. 80 మంది వ్యవసాయదారులు, 206 మంది వ్యవసాయ కూలీలు, 674 మంది గృహ పరిశ్రమలలో పనిచేసేవారు, 21,857 మంది ఇతర కార్మికులు ఈ పట్టణంలో నివసిస్తున్నారు.[4] మతాలవారీగా ఈ పట్టణంలో 81.22 శాతం హిందువులు, 9.83 శాతం ముస్లింలు, 7.95 శాతం క్రైస్తవులున్నారు. సిక్కులు, బౌద్ధులు, జైనులు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు.[5]

రాజకీయాలు

మార్చు

అరక్కోణం లోక్‌సభ నియోజకవర్గంలో అరక్కోణం శాసనసభ నియోజకవర్గం ఒక భాగం.[6] 2016 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIDMK) అభ్యర్తి ఎం.ఆర్.రవి గెలుపొందాడు. 2009లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో లోక్‌సభకు ఈ నియోజకవర్గం నుండి DMK అభ్యర్థి ఎస్. జగద్రక్షకన్ గెలుపొందాడు. 2014 లోక్ సభ ఎన్నికలలో ఎ.ఐ.ఎ.డి.ఎం.కె అభ్యర్థి ఎల్.హరికృష్ణన్ తన సమీప ప్రత్యర్థి డి.ఎం.కె.అభ్యర్థి ఎన్.ఆర్.ఎలాంగో పై 2లక్షల 40వేల ఓట్ల తేడాతో గెలిచాడు. 2014 ఉపఎన్నికలలో అరక్కోణం మునిసిపల్ ఛైర్మన్‌గా ఎ.ఐ.ఎ.డి.ఎం.కెకి చెందిన ఎస్.కణ్ణదాసన్ గెలిచాడు.[7]

మూలాలు

మార్చు
  1. AJJ
  2. http://www.sr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,304,372,456 ELS
  3. 3.0 3.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  4. "Census Info 2011 Final population totals - Arakonam". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  5. "Population By Religious Community - Tamil Nadu" (XLS). Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 13 September 2015.
  6. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2008-10-31. Retrieved 2019-12-24.
  7. AIADMK bags Arakkonam municipal chairman post - TAMIL NADU - The Hindu
"https://te.wikipedia.org/w/index.php?title=అరక్కోణం&oldid=4192602" నుండి వెలికితీశారు