అర్జున్ సురవరం[1] 2019, నవంబర్ 29న టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] ఆకెళ్ళ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి ముఖ్యపాత్రల్లో నటించారు.[3] సామ్ సి.ఎస్ సంగీతం అందించాడు. ఇది 2016లో టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన కణితన్ చిత్రానికి రిమేక్.[4] తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేయబడ్డాయి.[5]

అర్జున్ సురవరం
అర్జున్ సురవరం సినిమా పోస్టర్
దర్శకత్వంటి.ఎన్. సంతోష్
రచనటి.ఎన్. సంతోష్
నిర్మాతరాజ్‌కుమార్ ఆకెళ్ళ
తారాగణంనిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి
ఛాయాగ్రహణంసూర్య మిశ్రా
కూర్పునవీన్ నూలి
సంగీతంసామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థ
మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి.
విడుదల తేదీs
29 నవంబరు, 2019
సినిమా నిడివి
149 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అర్జున్ లెనిన్ సుర‌వ‌రం (నిఖిల్‌) కుటుంబం త‌రాలుగా పాత్రికేయ వృత్తిలో ఉంటుంది. అర్జున్‌ని వాళ్ల నాన్న (నాగినీడు) ఇంజినీరింగ్ చ‌దివించి, సాఫ్ట్‌వేర్ రంగంవైపు పంపించినా అతడు మాత్రం జ‌ర్నలిస్టుగా ఒక టీవీ ఛాన‌ల్‌లో చేరి, సామాజిక బాధ్యత‌తో ప‌నిచేస్తుంటాడు. ఎప్పటికైనా బీబీసీలో ఉద్యోగం సంపాదించాల‌నేది అతడి క‌ల‌. ఆ క‌ల సాకారమ‌వుతున్న క్రమంలోనే ఎడ్యూకేష‌న్ లోన్ తీసుకొని బ్యాంకుని మోసం చేశాడ‌నే కేసులో పోలీసులు అర్జున్‌ని అరెస్టు చేస్తారు. అందుకు కార‌ణం న‌కిలీ స‌ర్టిఫికెట్ల త‌యారీ అనే విష‌యం తెలుస్తుంది. ఎలాగైనా ఆ చీక‌టి కోణాన్ని బ‌య‌ట పెట్టేందుకు న‌డుం బిగిస్తాడు. స్వత‌హాగా పాత్రికేయుడైన అర్జున్ త‌నకున్న తెలివితేట‌ల‌తో స‌ర్టిఫికెట్ల మాఫియా బండారాన్ని ఎలా బ‌య‌ట పెట్టాడ‌నేదే మిగ‌తా సినిమా.[6]

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
 • రచన, దర్శకత్వం: టి.ఎన్. సంతోష్
 • నిర్మాత: రాజ్‌కుమార్ ఆకెళ్ళ
 • సంగీతం: సామ్ సి.ఎస్
 • ఛాయాగ్రహణం: సూర్య మిశ్రా
 • కూర్పు: నవీన్ నూలి
 • నిర్మాణ సంస్థ: మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి.

పాటలు

మార్చు
అర్జున్ సురవరం
పాటలు by
సామ్ సి. ఎస్
Released2019
Recorded2019
Genreసినిమా పాటలు
Length17:09
Labelలహరి మ్యూజిక్/టి-సిరీస్
Producerసామ్ సి.ఎస్
సామ్ సి. ఎస్ chronology
100 (2019 సినిమా)
(2019)
అర్జున్ సురవరం
(2019)
అయోగ్య
(2019)

సి.ఎస్. సామ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని లహరి మ్యూజిక్/టి-సిరీస్ తెలుగు ద్వారా విడుదల అయ్యాయి.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కన్నె కన్నె (రచన: శ్రీమణి)"శ్రీమణిఅనురాగ్ కులకర్ణి, చిన్మయి04:50
2."తికమక మకతిక (రచన: వరికుప్పల యాదగిరి)"వరికుప్పల యాదగిరిబెన్ని దయాల్04:10
3."బ్యాంగ్ బ్యాంగ్ (రచన: వరికుప్పల యాదగిరి)"వరికుప్పల యాదగిరిసామ్ సి.ఎస్03:29
4."చె గువరా (రచన: వరికుప్పల యాదగిరి)"వరికుప్పల యాదగిరిశంకర్ మహదేవన్04:40
మొత్తం నిడివి:17:09

విడుదల - స్పందన

మార్చు

ఈ చిత్రం 2019, నవంబర్ 29న విడుదలయింది.[7]

రేటింగ్

మార్చు
 1. టైమ్స్ ఆఫ్ ఇండియా – 2.5/5[8]
 2. గ్రేట్ ఆంధ్ర - 2.5/5[9]
 3. ది న్యూస్ మినట్ - 2/5[10]
 4. ది హన్స్ ఇండియా - 3/5[11]
 5. ఇండియాగ్లిట్జ్ - 3/5[12]

మూలాలు

మార్చు
 1. "Arjun Suravaram". Book My Show. Retrieved 4 December 2019.
 2. "First Look of Nikhil-TN Santhosh movie gets a date". IndiaGlitz. 30 May 2018. Retrieved 4 December 2019.
 3. "Lucky to be part of Arjun Suravaram, says Lavanya". Telangana Today. 23 November 2019. Retrieved 4 December 2019.
 4. "ARJUN SURAVARAM: THE TELUGU REMAKE OF KANITHAN IS HERE". Book My Show. 28 November 2019. Retrieved 4 December 2019.
 5. ఆంధ్రజ్యోతి, సినిమా (29 November 2019). "'అర్జున్ సురవరం' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 30 నవంబరు 2019. Retrieved 30 November 2019.
 6. ఈనాడు, సినిమా (29 November 2019). "రివ్యూ: అర్జున్ సుర‌వరం". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 30 నవంబరు 2019. Retrieved 5 December 2019.
 7. "'Arjun Suravaram' finally has a release date!". Times of India. 26 October 2019. Retrieved 4 December 2019.
 8. "Arjun Suravaram Movie Review : Works in bits and pieces". Times of India. 29 November 2019. Retrieved 5 December 2019.     
 9. "Arjun Suravaram Review: Good Concept, Weak Execution". Great Andhra. 29 November 2019. Retrieved 5 December 2019.     
 10. "'Arjun Suravaram' review". The News Minute. 29 November 2019. Retrieved 5 December 2019.     
 11. "Nikhil Siddharth's Arjun Suravaram Movie Review & Rating". The Hans India. 29 November 2019. Retrieved 5 December 2019.     
 12. "Arjun Suravaram Review". IndiaGlitz. 29 November 2019. Retrieved 5 December 2019.     

ఇతర లంకెలు

మార్చు