అర్వపల్లి సుబ్బారావు
అర్వపల్లి సుబ్బారావు ప్రముఖ హాస్యనటుడు. తన అభినయంతో హాస్యరసాన్ని ప్రేక్షకలోకానికి పంచి పెట్టిన అద్వితీయ నటుడు. చింతామణి నాటకానికి జాతీయసాయిలో గుర్తింపును తెచ్చిన హాస్య నటశేఖరుడు అర్వపల్లి సుబ్బారావు.[1]
అర్వపల్లి సుబ్బారావు | |
---|---|
జననం | డిసెంబర్ 20, 1916 కారుమంచి, వినుకొండ |
ఇతర పేర్లు | అర్వపల్లి సుబ్బారావు |
ప్రసిద్ధి | రంగస్థల హాస్యనటుడు |
తండ్రి | వెంకటప్పయ్య |
తల్లి | చెంచమ్మ |
జీవిత విశేషాలు
మార్చువినుకొండకు సమీపంలోని కారుమంచిలో 1916, డిసెంబరు 20న వెంకటప్పయ్య, చెంచమ్మ దంపతులకు జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం
మార్చుచిన్నతనంలోనే తల్లిదండ్రు లను కోల్పోయిన సుబ్బారావు బెల్లంకొండ సుబ్బారావు ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం నాటకాన్ని చూసి నటన వైపు ఆకర్షితులయ్యారు. కారుమంచిలో చిన పిల్లలతో బాలసంఘాన్ని స్థాపించి పాదుకా పట్టాభిషేకం నాటకాన్ని పదర్శించారు. ఈ నాటకంలో అర్వపల్లి భరతుడి పాత్రను పోషించారు. శ్రీకృష్ణ రాయబారంలో నారద పాత్ర అర్వపల్లికి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపె టైంది. నటనతోపాటు హార్మోనియంలో ప్రత్యేక శిక్షణ పొందిన అర్వపల్లి పలు నాటకాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించారు. చింతామణి నాటకంలో ఆపద్ధరంగా నటించిన సుబ్బికెట్టి పాత్ర అర్వపల్లి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. సుబ్బిళెట్టి పాత్ర ద్వారా అర్వపల్లి సంధించిన చెణుకులు సంచలనాన్ని సృష్టించాయి. చింతామణి నాటకానికి విశేష ఖ్యాతి కలిగించ డంలో అర్వపల్లి పాత్ర ఎంత గణనీయమైనదో మరొక కోణంలో ఇతివృ త్తాన్ని మింగివేసే చెణుకులతో నాటక ఔచిత్యం దెబ్బతిన్నదనే తీవ్ర విమర్శ కూడా చెలరేగింది బెంగళూరులో నెల రోజులు వరుసగా ఒక ధియేటర్లో చింతామణి నాటకాన్ని ప్రదర్శించి అర్వపల్లి రికారు సృష్టించారు. కన్నడ నాటక ప్రముఖుడు గుబ్బీ వీరన్న చింతామణి నాటకాన్ని చూసి అర్వపల్లిని వేనోళ్ల కొనియాడారు. తులాభారం నాటకంలో వసంతకునిగా, ప్రేమలీలలో గపార్ూన్గా సానిసంసారిలో రమేష్గా నటించారు. 1952లో హెచ్ఎంవీ సంస్థ అర్వపల్లితో చింతామణి నాటకాన్ని రికారుగా విడుదల చేశారు.
బహుమతులు - పురస్కారాలు
మార్చుగుంటూరులో జరిగిన అఖిలాంధ్ర, రంగూన్ రౌడీ నాటక పోటీలలో గంగా రామ్ శేర్ పాత్రకు ఉత్తమ హాస్యనటునిగా పురస్కారాన్ని పొందారు. 1962లో నరసరావుపేట పట్టణంలో అర్వపల్లికి ఘనంగా పౌరసన్మానాన్ని చేశారు. 1969లో నరసరావుపేట కళాశాలలో జరిగిన సన్మాన సభలో అర్వపల్లికి హాస్యరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సభలో పాల్గొన్న కరుణశ్రీ అర్వపల్లిని హాస్యరస కల్పవల్లి అని ప్రశంసించారు. చింతామణి నాటకాన్ని అర్వపల్లి వేలాది ప్రదర్శనలిచ్చారు[2][3]