అల్ ఘజాలి
(అల్-ఘజాలి నుండి దారిమార్పు చెందింది)
అబూ హామిద్ మొహమ్మద్ ఇబ్న్ మొహమ్మద్ అల్-ఘజాలీ Abu Hāmed Mohammad ibn Mohammad al-Ghazzālī (1058-1111) (పర్షియన్ : ابو حامد محمد ابن محمد الغزالی ), టర్కిష్ : İmâm-ı Muhammed Gazâlî, అల్-గాజెల్ గా కూడా ప్రసిద్ధి. పర్షియా లోని ఖోరాసాన్లో జన్మించాడు. ముస్లిం పండితుడు, ధార్మిక తత్వవేత్త.[3]
పర్షియన్ పండితుడు మధ్యకాలం (ఇస్లామీయ స్వర్ణయుగం) | |
---|---|
పేరు: | ఘజాలి |
జననం: | 1058 AD (450 ఇస్లామీయ కేలండర్) |
మరణం: | 1111 AD (505 ఇస్లామీయ కేలండర్) |
సిద్ధాంతం / సంప్రదాయం: | సూఫీ, సున్నీ ముస్లిం (షాఫయీ), అష్-హరీ |
ముఖ్య వ్యాపకాలు: | సూఫీ తత్వం, ధార్మిక శాస్త్రం (కలాం), ప్రారంభ ఇస్లామీయ తత్వము, ఇస్లామీయ మానసిక శాస్త్రము, ఇస్లామీయ తత్వములో తర్కము, ఫిఖహ్ |
ప్రభావితమైనవారు: | ఆట్రెకోర్ట్ నికోలస్, థామస్ అక్వినాస్, అబ్దుల్ ఖాదిర్ బేదిల్, రీనే డెస్కార్టిస్, మైమూనిద్‌లు,[1] Raymund Martin, Fakhruddin Razi, Shah Waliullah[2] |
కార్యాలు
మార్చుఅల్-ఘజాలి ప్రకారం ప్రభుత్వాధినేతకు కావలసిన లక్షణాలు
మార్చుఅల్-ఘజాలి "నసీహత్ అల్-ములూక్" లేదా "రాజులకు హితబోధలు" సెల్జూఘ్ ఖలీఫా కొరకు వ్రాశాడు. ఇతని ప్రకారం దశ హితబోధలు రాజుకు తనరాజ్యపరిపాలన కొరకు కనీసం వుండవలసిన సూత్రాలని సూచించాడు.
- తన భుజస్కంధాలపై ఉంచబడిన బాధ్యతల ప్రాముఖ్యాన్ని, అపాయాన్ని, రాజు గ్రహించవలెను. అధికారం ఒక వరం, ఈ అధికారాన్ని ధర్మబధ్ధంగా చెలాయిస్తే ఇటు రాజుకూ అటు ప్రజకూ అనంత సుఖఃసంతోషాలు కలుగును, లేనిచో ఇటు రాజూ అటు ప్రజలూ దుఖః పాతానికి లోనౌతారు.
- రాజు ఎల్లప్పుడూ ధార్మిక పండితులకు సంప్రదించడానికి తహతహలాడాలి, వీరి సలహాలు తీసుకొని రాజ్యాన్ని సుబిక్షంగా పాలించాలి.
- పరస్త్రీవ్యామోహాన్ని తానూ త్యజించాలి తన అధికారవర్గం త్యజించాలి. అన్యాయాన్ని తానూ తన అధికారగణం సహించకూడదు. రాజు తన స్వంత జీవనచర్యల న్యాయాన్యాయాలను విచారించాలి, అలాగే తన అధికారగణ జీవనచర్యల న్యాయాన్యాయాలను విచారించాలి, అన్యాయాలుంటే శిక్షించాలి.
- రాజు నిగర్విగాను, కోపతాపాలకు దూరంగానూ, పగ ద్వేషాలకు అతీతంగానూ ఉండాలి. కోపము జ్ఞానుల శత్రువుగా గుర్తించాలి. తనపాలనలో శాంతి, క్షమా, దయా కారుణ్యాలపట్ల తనూ తలొగ్గాలి ఇతరులనూ తలొగ్గేలా చేయాలి. క్షమాగుణాలను అలవర్చుకొనేలాచేయాలి.
- ప్రతివిషయ సన్నివేశంలో రాజు తనకు తాను ప్రజగా భావించి ప్రజలకు అధికారులుగా భావించి కార్యక్రమాలు చేయాలి. తనకొరకు ఏమికోరుకుంటాడో ఇతరులకూ అవే అందజేయాలి. ఇలా చేస్తేనే తన అధికారాలను సద్వినియోగం చేస్తున్నట్లు.
- రాజు న్యాయస్థానంలో ఫిర్యాదు దారుల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించవలెను. ఫిర్యాది యొక్క సాధక బాధకాలను తెలుసుకోవడం రాజు యొక్క విద్యుక్తధర్మం. అన్యాయానికి తావు లేకుండా చూడవలసిన బాధ్యతకూడా రాజుదే.
- రాజు అలంకారాలకు మోజులకు వ్యామోహాలకు బానిస కారాదు. అసలు వీటి జోలికే పోరాదు. హుందాగావుంటూ రాజ్యానికి మకుటంలా ఉండాలి గాని, అహంకారానికి పోయి రాజ్యానికి చీడ తేకూడదు.
- రాజు మృదువుగా మెలగడం అలవర్చుకోవాలి, క్రూరంగాను, అసభ్యంగాను, హింసించువాడు గాను ఉండకూడదు.
- రాజును ప్రజలందరూ మెచ్చుకొనేలా రాజు మసలుకోవాలి. ప్రజలను గదమాయించి తనను పొగిడేలా చేసుకొనే రాజు అత్యల్పుడు. ప్రజలలో తనపట్లగల భావాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ తన తప్పులున్నయెడల వాటిని తెలుసుకొని దిద్దుకుంటూ ప్రజలనోటిలో నాలుకలా మెలగాలి.
- అల్లాహ్ ను సంతుష్టుడిని చేసేందుకు ప్రతికార్యం సలపాలి. ఓ ప్రజ దగ్గర మెప్పు కోసం అల్లాహ్ ను వ్యతిరేకిగా చేసుకోరాదు. ఒకరిని అసంతుష్టుడిని చేసి అల్లాహ్ ను సంతుష్టుడిని చేయడం ఉత్తమం. ఒకరిని సంతుష్టుడిని చేసి అల్లాహ్ ను అసంతుష్టుడు చేయడం జరగరాదు.
ఘజాలీ ప్రభావం
మార్చురచనల జాబితా
మార్చునోట్స్
మార్చు- ↑ The Influence of Islamic Thought on Maimonides Stanford Encyclopedia of Philosophy, June 30 2005
- ↑ Muslim Philosophy, Islamic Contributions to Science & Math, netmuslims.com
- ↑ Ghazali Archived 2008-10-11 at the Wayback Machine, The Columbia Encyclopedia, Sixth Edition 2006
మూలాలు
మార్చు- {{{Last}}} ({{{Year}}})
బయటి లింకులు
మార్చు- Al-Ghazali Web Site
- Full text of Incoherence of the Philosophers, from Al-Ghazali Websites
- Public Domain documentary on al-Ghazali