అశ్వథ్థామ (2020 సినిమా)

రమణ తేజ దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

అశ్వథ్థామ 2020, జనవరి 31న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ శౌర్య, మెహ్రీన్ పిర్జాదా, జిషూసేన్‌ గుప్తా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.

అశ్వథ్థామ
Aswathama Movie Poster.jpg
అశ్వథ్థామ సినిమా పోస్టర్
దర్శకత్వంరమణ తేజ
కథా రచయితస్క్రీన్ ప్లే:
రమణ తేజ
ఫణీంద్ర బిక్కిన
పరశురాం శ్రీనివాస్‌ (మాటలు)
కథనాగ శౌర్య
నిర్మాతఉషా ముల్పూరి
శంకర్ ప్రసాద్ ముల్పూరి (సమర్పణ)
తారాగణంనాగ శౌర్య
మెహ్రీన్ పిర్జాదా
జిషూసేన్‌ గుప్తా
ఛాయాగ్రహణంమనోజ్‌ రెడ్డి
కూర్పుగ్యారీ బి.హెచ్‌
సంగీతంశ్రీ చరణ్‌ పాకాల
జిబ్రాన్ (నేపథ్య సంగీతం)
నిర్మాణ
సంస్థ
ఐరా క్రియేషన్స్‌
విడుదల తేదీ
2020 జనవరి 31 (2020-01-31)
సినిమా నిడివి
133 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశంసవరించు

గణ (నాగశౌర్య) చెల్లెలు ప్రియకు (సర్గుణ్‌ కౌర్‌) నిశ్చితార్థం జరుగి కుటుంబమంతా పెళ్లి ఏర్పాట్లలో ఉన్న సమయంలో ప్రియ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. అది చూసి గణ తన చెల్లిని కాపాడి, అందుకుగల కారణం తెలుసుకుంటాడు. తాను గర్భవతినని, అందుకు కారణం ఎవరు తనకు తెలియదని చెబుతుంది. అంతేకాకుండా విశాఖపట్నంలో చాలామంది అమ్మాయిల మిస్సింగ్‌ కేసులు నమోదు అవుతుంటాయి. వాటి గురించి గణ పరిశోధించగా అమ్మాయిలందరూ తమకు తెలియకుండానే అత్యాచారానికి గురి కాబడుతున్నారని తెలుస్తుంది. ఈ మిస్సింగ్ వ్యవహారాన్ని తెలుసుకునేందుకు గణ ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. మిస్సింగ్ మిస్టరీని గణ ఛేదించాడా, ఇదంతా చేస్తున్నది ఎవరూ అనేది మిగతా చిత్ర కథ.[2][3][4]

నటవర్గంసవరించు

నిర్మాణంసవరించు

2019 చివరి నెలల్లో చిత్రీకరణ పూర్తయింది.[5][6]

పాటలుసవరించు

Untitled

ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

పాటల జాబితా
సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "అశ్వథ్థామ టైటిల్ సాంగ్ (రచన: రామజోగయ్య శాస్త్రి)"  దివ్య కుమార్ 4:01
2. "నిన్నే నిన్నే (రచన: వి.ఎన్.వి. రమేష్ కుమార్)"  అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల 3:21
3. "మాహి (రచన: కాసర్ల శ్యామ్‌)"  పూజన్ కొహ్లీ 3:22
4. "అండగా అన్నగా (రచన: వి.ఎన్.వి. రమేష్ కుమార్)"  హేమచంద్ర 3:21
మొత్తం నిడివి:
14:05

విడుదల - స్పందనసవరించు

2020, జనవరి 31న ఈ చిత్రం విడుదలయింది.

రేటింగ్

మూలాలుసవరించు

  1. The Times of India, Entertainment (11 December 2019). "Naga Shaurya and Mehreen Pirzada's 'Aswathama' has a release date". Neeshita Nyayapati. Archived from the original on 14 డిసెంబర్ 2019. Retrieved 17 February 2020. Check date values in: |archivedate= (help)
  2. నమస్తే తెలంగాణ, సినిమా (31 January 2020). "అశ్వథ్థామ మూవీ రివ్యూ". Archived from the original on 31 జనవరి 2020. Retrieved 17 February 2020.
  3. సాక్షి, సినిమా (31 January 2020). "'అశ్వథ్థామ' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 17 ఫిబ్రవరి 2020. Retrieved 17 February 2020.
  4. ఈనాడు, సినిమా (31 January 2020). "రివ్యూ: అశ్వథ్థామ‌". Archived from the original on 1 ఫిబ్రవరి 2020. Retrieved 17 February 2020.
  5. Deccan Chronicle, entertainment (24 January 2020). "Naga Shaurya is worried!". Adivi Sashidhar. Archived from the original on 24 జనవరి 2020. Retrieved 17 February 2020.
  6. The Times of India, entertainment (4 December 2019). "Stunning Transformation! Naga Shaurya flaunts his chiselled body" (in ఇంగ్లీష్). Archived from the original on 8 డిసెంబర్ 2019. Retrieved 17 February 2020. Check date values in: |archivedate= (help)
  7. The Times of India, Entertainment (31 January 2020). "Aswathama Movie Review". Archived from the original on 31 జనవరి 2020. Retrieved 17 February 2020.

ఇతర లంకెలుసవరించు