రమణ తేజ
రమణ తేజ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. ఆయన 2020లో విడుదలైన అశ్వథ్థామ సినిమా ద్వారా దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.[1]
రమణ తేజ | |
---|---|
జననం | 21 అక్టోబరు 1994 |
వృత్తి | తెలుగు సినిమా దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2020–ప్రస్తుతం |
జననం, విద్యాభాస్యం
మార్చురమణ తేజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, మదనపల్లిలో 1991 అక్టోబరు 21లో జన్మించాడు. ఆయన తమిళనాడులో బీటెక్ పూర్తి చేశాడు.[2]
సినీ జీవితం
మార్చురమణతేజ బీటెక్ చివరి సంవత్సరంలో ఉండగా ఒక షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించాడు. ఆయన సినిమాలపై ఇష్టంతో హైదరాబాద్ వచ్చి గడ్డం గ్యాంగ్ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఆ సినిమా అనంతరం ఆయన ‘దుష్టశిక్షణ’ అనే షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించి యుట్యూబ్‌లో విడుదల చేయగా అక్కడ వచ్చిన కామెంట్స్ చదివి స్క్రీన్‌ప్లేలో మెళుకువలు నేర్చుకోవడానికి అమెరికా లోని బోస్టన్‌లో స్క్రీన్‌ప్లే రైటింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేసి కొన్ని హాలీవుడ్ ఇండిపెండెంట్ చిత్రాలకు పనిచేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు.
రమణ తేజ స్వదేశం తిరిగి వచ్చాక ‘ఛలో’ ప్రమోషన్స్ టైమ్‌లో నటుడు నాగశౌర్యతో పరిచయం ఏర్పడింది.నాగశౌర్య రాసిన కథ ‘అశ్వథ్థామ’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నాడు.[3]
మూలాలు
మార్చు- ↑ BookMyShow (2020). "Ramana Teja - Movies, Biography". Archived from the original on 12 October 2021. Retrieved 12 October 2021.
- ↑ Andrajyothy (2019). "ఆ కామెంట్స్ చదివి అమెరికా వెళ్లా!". Archived from the original on 13 అక్టోబరు 2021. Retrieved 13 October 2021.
- ↑ "నాగశౌర్య సొంత అన్నయ్యలా ప్రోత్సహించారు". 29 January 2020. Archived from the original on 13 అక్టోబరు 2021. Retrieved 13 October 2021.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రమణ తేజ పేజీ