అశ్వమేధం (1992 సినిమా)

అశ్వమేధం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992 లో విడుదలైన చిత్రం. ఇందులో శోభన్ బాబు, బాలకృష్ణ, మీనా, నగ్మా, అమ్రిష్ పురి ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రానికి సత్యానంద్ కథ, మాటలు అదించగా, యండమూరి వీరేంద్రనాథ్ చిత్రానువాదం రాశాడు.

అశ్వమేధం
దర్శకత్వంకె. రాఘవేంద్రరావు
రచనసత్యానంద్ (కథ, మాటలు)
స్క్రీన్ ప్లేయండమూరి వీరేంద్రనాథ్
నిర్మాతసి. అశ్వనీదత్
తారాగణంశోభన్ బాబు,
బాలకృష్ణ,
అమ్రీష్ పురి
మీనా,
నగ్మా
ఛాయాగ్రహణంఅజయ్ విన్సెంట్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
డిసెంబరు 25, 1992 (1992-12-25)
సినిమా నిడివి
148 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

అభిమన్యు ఒక నిజాయితీగల ఐ.పి.ఎస్ అధికారి. ఒక అంతర్జాతీయ నేరగాడైన వ్యాఘ్రను పట్టుకుంటాడు. కానీ అతను జైలునుంచి తప్పించుకుని పారిపోతాడు. అభిమన్యు తమ్ముడు కిరీటి ఒక పైలట్. అతని సహాయంతో వ్యాఘ్రను మట్టుపెడతాడు అభిమన్యు. కానీ అక్కడ చనిపోయింది కవలల్లో ఒకడైన అనిల్ వ్యాఘ్ర అనీ, అతని సోదరుడు సునీల్ వ్యాఘ్ర అనిల్ మరణానికి కారకులైన అభిమన్యు, కిరీటిల మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. సునీల్ అభిమన్యుని లంచగొండి ఆఫీసరుగా చిత్రీకరించి అరెస్టు చేయిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక అభిమన్యు ఆత్మహత్య చేసుకుంటాడు. తర్వాత కిరీటి శరీరంలోకి విషం ఎక్కించి ఎడారిలో వదిలేస్తారు. అలాగే దేశమంతటా బాంబు పేలుళ్ళకు కుట్ర చేస్తారు. కిరీటం అపాయం నుంచి తప్పించుకుని జరగబోయే నేరాన్ని ఆపి నేరస్థులను ఎలా చట్టానికి పట్టించాడన్నది మిగతా కథ.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించగా[1] వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. పాటలు సూర్యా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

  • శీతాకాలం ప్రేమలు పండే కాలం, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , ఆశా భోంస్లే
  • ఓ ప్రేమా, నాలో నువ్వే ప్రేమా, నవ్వే ప్రేమా తెలుసా? గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోంస్లే
  • చెప్పనా ఉన్న పని చెయ్యనీ కాస్త పని జంటగా, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి
  • ఎం దెబ్బ తీశావురా ఓ యబ్బ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
  • గుంతలకిడి ఘుమ ఘుo అందం అరే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • జూమ్ చకు చకు చకు ఆనందాలే పొంగే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి బృందం
  • న్యాయ ధర్మాలకు కాలమే తాడులే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు
  1. "Aswamedham audio songs online | Download Ashwamedham Songs mp3 codes | Aswamedham music review | Listen to Aswamedham songs". MusicMazaa.com. Archived from the original on 2012-10-23. Retrieved 2012-09-21.

2.ghantasala galaamrutamu,kolluri bhaskarrao blog.