అసీమా ఛటర్జీ

భారతీయ రసాయన శాస్త్రవేత్త

అసీమా చటర్జీ (ఆంగ్లం : Asima Chatterjee; Bengali: অসীমা চট্টোপাধ্যায়) (సెప్టెంబరు 23, 1917 - నవంబరు 22, 2006) భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఈమె ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫైటోమెడిసిన్ రంగాలలో అమూల్యమైన కృషిచేశారు.[1] ఈమె నిర్వహించిన పరిశోధనలలో వింకా ఆల్కలాయిడ్లు, మలేరియా, ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి. ఈమె భారతదేశానికి చెందిన వైద్యసంబంధమైన మొక్కలు గురించి ఒక పుస్తకాన్ని రచించారు.

అసీమా చటర్జీ
Asima Chatterjee
అసీమా చటర్జీ
జననం(1917-09-23)1917 సెప్టెంబరు 23
కొల్కతా, బెంగాల్
మరణం22 నవంబరు 2006 (89 సంవత్సారాలు)
కొల్కతా, పశ్చిమ బెంగాల్
జాతీయతభారతీయురాలు
రంగములుఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫైటోమెడిసిన్
వృత్తిసంస్థలుకలకత్తా విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుకలకత్తా విశ్వవిద్యాలయం

జీవిత విశేషాలు

మార్చు

అసీమా చటర్జీ 1917 సెప్టెంబరు 23 తేదీన బెంగాల్లో జన్మించారు. ఆమె తండ్రి పేరు ఇంద్రనారాయణ ముఖర్జీ. కలకత్తా యూనివర్సిటీ నుండి డి.ఎస్.సి. పట్టా పొంది (1944), అమెరికా వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ విస్కన్‌సిస్ లో పరిశోధనలు (1947-48) నిర్వహించారు. పుట్టిన దగ్గరినుండి జీవితాంతం కలకత్తా లోనే గడిపారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన స్కాటిష్ చర్చి కళాశాల నుండి1936లో రసాయనశాస్త్రంలో పట్టా పొందారు.[2][3] 1938 లో ఆమె "ఆర్గానిక్ కెమిస్ట్రీ"లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఈమె కలకత్తా విశ్వవిద్యాలయంలో డాక్టరల్ వర్క్ పూర్తిచేశారు. ఈమె సంస్లేషిత కర్బన రసాయన శాస్త్రంలో వృక్ష ఉత్పత్తుల గూర్చి పరిశోధనలు చేశారు. ఈమె ప్రఫుల్ల చంద్ర రే, ప్రొఫెసర్ ఎస్.ఎన్.బోస్ గారి అధ్వర్యంలో పరిశోధనలు చేశారు. ఈమె 1940 లో కలకత్తా యూనివర్సిటీ యొక్క "లేడీ బ్రబోర్నే కాలేజి"లో చేరి రసాయన శాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నారు. 1944 లో ఇండియా విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ విజ్ఞానంలో డాక్టరేట్ పొందిన మొదటి మహిళగా నిలిచారు.[1] 1954 లో ఆసిమా చటర్జీ కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కెమిస్ట్రీ విభాగంలో చేరారు. 1962 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈమె 1982 నుండి ఆ పదవిలోనే కొనసాగుతున్నారు.[1]

పరిశోధనలు

మార్చు

ఈమె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మొదలైన సంస్థలలో పరిశోధనలు నిర్వహించారు. కలకత్తా యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా, ప్యూర్ మెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పలు పదవులు నిర్వహించారు. రాజ్యసభ సభ్యురాలుగా (1982 - 90) ఉన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా (1975) ఉన్నారు.

ప్రొఫెసర్ ఆసిమా గారు భారతీయ ఔషధ మొక్కల నుంచి ఆల్కలాయిడ్స్, పాలీ ఫినోలిక్స్, టెర్‌పెనోయిడ్స్, కౌమరిన్స్ మొదలైన సహజ ఉత్పత్తులను పరిశోధించడంలో విశేష కృషి చేశారు.. Saral Madhyamain Rasayana (3 సంపుటములు), Bharater Banushadi మొదలైన గ్రంథ రచనలు చేశారు. 240 కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. "జర్న ఆఫ్ ది ఇండియన్ కెమికల్ సొసైటీ"కి సంపాదకులుగా ఉన్నారు. అమెరికా లోని సిగ్మా XI సంస్థకు గౌరవ సలహాదారుగా ఉన్నారు.

పురస్కారాలు

మార్చు
  • కలకత్తా యూనివర్సిటీ వారి నాగార్జున ప్రైజ్, గోల్డ్ మెడల్ (1940)
  • ప్రేమ్‌చంద్ రాయల్ స్కాలర్ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ.[3]
  • యూనివర్సిటీ కలకత్తా నుండి సైన్స్ లో డాక్టరేట్ చేసిన మొదటి మహిళ (1944) [1]
  • 1948 - 49 : వాటుముల్ ఫెలోషిప్ (అమెరికా)
  • 1962-1982 మధ్య ఆమె ఖైరా ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇది యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాకు చెందిన అత్యంత గౌరవ పదవి.[1]
  • 1960: న్యూఢిల్లీ లోని ఇండియన్ నేషనల్ అకాడమీ యొక్క ఫెలోగా ఎంపిక.[1]
  • 1961 : శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (రసాయన శాస్త్రం), ఈ అవార్డును పొందిన మొదటి మహిళ.[1]
  • 1975 : పద్మభూషణ్ అవార్డు. ఈ అవార్డు అందుకొన్న మొదటి మహిళా శాస్త్రవేత్త.[1]
  • 1981 : భువన్ మోహన్ దాస్ గోల్డ్ మెడల్
  • 1985 : సర్ సి.వి.రామన్ అవార్డు
  • 1989 : సర్ అసుతోష్ ముఖర్జీ మెమోరియల్ గోల్డ్ మెడల్
  • 1954 : శిశిర్ కుమార్ మిశ్రా పురస్కారం.
  • 1982 - 1990 : రాజ్యసభ సభ్యులు.

గూగుల్ డూడుల్

మార్చు

ఆసిమా ఛటర్జీకి గూగుల్ సంస్థ అరుదైన గౌరవాన్నిచ్చింది. ఆమె 100వ జయంతి సందర్భంగా 2017 సెప్టెంబరు 23న గూగుల్ డూడుల్ (గూగుల్ వెబ్‌సైట్ హోంపేజీలో వచ్చే లోగో) గా గూగుల్ హోం పుటలో ప్రచురించింది.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 The Shaping of Indian Science. p. 1036. Indian Science Congress Association, Presidential Addresses By Indian Science Congress Association. Published by Orient Blackswan, 2003. ISBN 978-81-7371-433-7
  2. Some Alumni of Scottish Church College in 175th Year Commemoration Volume Scottish Church College, 2008, p. 584
  3. 3.0 3.1 "Chemistry alumni of Scottish Church College". Archived from the original on 2009-04-06. Retrieved 2013-08-29.
  4. Asima Chatterjee's 100th Birthday
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు.

బయటి లంకెలు

మార్చు