కోల్‌కాతా

భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని నగరం
(కొల్కతా నుండి దారిమార్పు చెందింది)
  ?కోల్‌కాతా (కలకత్తా)
పశ్చిమ బెంగాల్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 22°34′22″N 88°21′50″E / 22.5726723°N 88.3638815°E / 22.5726723; 88.3638815Coordinates: 22°34′22″N 88°21′50″E / 22.5726723°N 88.3638815°E / 22.5726723; 88.3638815
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 9 మీ (30 అడుగులు)
జిల్లా (లు) కలకత్తా జిల్లా
జనాభా
Metro
45,80,544
• 1,46,81,589
మేయర్ బికాస్ రంజన్ భట్టాచార్య
వెబ్‌సైటు: www.kolkatamycity.com
 కలకత్తా మహానగర ప్రాంతంలో ఉత్తర 24 పరణాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కూడా కలిసిపోయినవి.


కోల్‌కాతా (Bengali: কলকাতা) భారత దేశములోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని. ఇది తూర్పు భారత దేశములోని హుగ్లీ నదికి తూర్పు తీరాన ఉంది. 2011 జనాభా గణాంకాలను అనుసరించి ప్రధాన నగరంలో జనాభా 50 లక్షలు ఉండగా, చుట్టుపక్కల మహానగర పరిసర ప్రాంతాలను కలుపుకొని 1.4 కోట్ల జనాభా ఉంది. జనసాంద్రత ప్రకారం భారతీయ నగరాలలో ఈ నగరం మూడవ స్థానంలో ఉంది. 2008 గణాంకాలను అనుసరించి ఈ నగరం కుటీర పరిశ్రమల ద్వారా పొందుతున్న ఆదాయం దక్షిణాసియా దేశాలలో మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో ముంబయ్, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. ఈ నగరం తూర్పు భారతదేశానికి సాంస్కృతిక, వాణిజ్య, విద్యా కేంద్రంగా విలసిల్లుతోంది. భారతీయ రేవుపట్టణాలలో ఇది పురాతనమైనది. అలాగే అధికంగా ఆదాయాన్ని అందిస్తున్న రేవులలో ఇది ప్రధానమైనది. అభివృద్ధి చెందుతున్న దేశంలోని అభివృద్ధి చేందుతున్న నగరంగా కోల్‌కాతా నగరం, శివారుప్రాంతంలో జనాభా పెరుగుదల, వాహన రద్దీ, పేదరికం, అధిక జనసాంద్రత, ఇతర చట్టపరమైన సాంఘిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.

17వ శతాబ్దపు చివరి సమయంలో మొగలు సామ్రాజ్య బెంగాల్ రాజ్యప్రతినిధి పాలనా కాలంలో, ప్రస్తుతం కోల్‌కాతా ఉన్న ప్రదేశంలో మూడు గ్రామాలు ఉండేవి. 1690లో బెంగాల్ నవాబు ఈస్టిండియా కంపెనీకి వ్యాపార అనుమతి ఇచ్చిన తరువాత, కంపెనీ ఈ ప్రదేశాన్ని బలమైన రేవుపట్టణంగా అభివృద్ధి పరచింది. 1756లో కోల్‌కాతా నగరాన్ని నవాబు సిరాజ్ ఉద్ దౌలా ఆక్రమించాడు. తరువాతి సంవత్సరమే ఈస్టిండియా కంపెనీ ఈ నగరాన్ని తిరిగి స్వాధీనపరచుకుని 1772 నాటికి పూర్తి సామ్రాజ్యాధిపత్యం కూడా సాధించింది. మొదట ఈస్టిండియా కంపెనీ పాలన లోను, తరువాత బ్రిటిష్ సామ్రాజ్యపాలనలోనూ కోల్‌కాతా 1911 వరకు భారతదేశ రాజధానిగా ఉంటూ వచ్చింది. ఈ నగర భౌగోళిక పరమైన అసౌకర్యాలు, బెంగాలులో సమైగ్ర స్వతంత్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడం వంటి పరిణామాల కారణంగా రాజధానిని కొత్త ఢిల్లీకి మార్చారు. ఈ నగరం స్వాతంత్ర్యోద్యమంలో కేంద్రబిందువైంది. ఆ సమయంలో ఈ నగర రాజకీయాలు ఉదిక్తంగా ఉండేవి. 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆధునిక భారతదేశంలో కోల్‌కాతా విద్య, విజ్ఞానం, సంస్కృతి, రాజకీయలలో పలు దశాబ్ధాల కాలం ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందింది. 2000 నుండి ఈ నగరం వేగవంతంగా ఆర్థిక ప్రగతిని సాధించింది.

భారతదేశంలో 19-20 శతాబ్దాల మధ్యకాలంలో శిల్పశైలి, మతవిశ్వాసం సాంప్రదాయకంగా విభిన్నమైన సంస్కృతికి బెంగాల్ కేంద్రస్థానం అయింది. కోల్‌కాతాలో ప్రాంతీయ సంప్రదాయరీతులను నాటకాలు, కళ, చలనచిత్రాలు, సాహిత్యం రూపాలలో ప్రదర్శించే ఏర్పాట్లు జరగడం వలన అత్యధికమైన అభిమానులను సంపాదించుకుంది. భారతదేశంలో నోబెల్ బహుమతి అందుకున్న వారిలో పలువురు కోల్‌కాతాలో జన్మించిన వారే. వీరు కళారంగంలోనూ, విజ్ఞానరంగంలోనూ, ఇతర రంగాలలోనూ నోబుల్ బహుమతి అందుకున్నారు. కోల్‌కాతాలో తయారవుతున్న చలనచిత్రాలకు జాతీయస్థాయి గుర్తింపు ఉంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అకాడమీ ఆప్ ఫైన్ ఆర్ట్స్, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, క్రికెట్ గ్రౌండ్స్ వంటివి కోల్‌కాతాలో ఉన్నాయి. మిగిలిన భారతీయ నగరాలకంటే విభిన్నంగా కోల్‌కాతా, ఫుట్ బాల్ క్రీడకు ప్రాధాన్యత ఇస్తుంది.

పేరు చరిత్రసవరించు

కోల్‌కాతా అనే పేరు కొలికత (తెలుగులో కాళిక) అనే బెంగాలి పదం నుండి ఉత్పన్నమైంది. బ్రిటిషువారు భారతదేశంలో అడుగుపెట్టే ముందు ఈ ప్రదేశంలో ఉన్న మూడు గ్రామాలలో ఒక గ్రామం పేరుతో ఈ నగరం స్థాపించబడింది. మిగిలిన రెండు గ్రామాల పేర్లు సుతనుతి, గోవిందపూరు. కొలికత అనే పేరును కాలిఖేత్రో అని కూడా అంటారు. ఈ బెంగాలీ పదానికి కాళీక్షేత్రం అని అర్ధం. బెంగాలీ పదం కిల్ కిలా నుండి కూడా ఈ పేరు వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కిల్ కిలా అంటే బెంగాలీలో పీఠభూమి అని అర్ధం. కత అనే రాజు చేత నిర్మించబడిన కాల్ (కాలువ) ఈ ప్రదేశం నుండి ప్రవహిస్తుంది కనుక ఈ పేరు వచ్చిందని మరి కొందరి అభిప్రాయం. ఇక్కడ కోలి చన్ (సున్నపురాయి) చాలా అధికంగా ఉత్పత్తి అవుతుంది కనుక ఈ పేరు వచ్చిందన్నది మరి కొందరి అభిప్రాయం. ఈ నగరం కోల్‌కాతా, కలికత అని పిలువబడుతూ వచ్చింది. ఈ పేరును ఆంగ్లేయులు కలకత్తా అని పిలుస్తూ వచ్చారు. 2001లో నగరం పేరును అధికారికంగా కోల్‌కాతాగా మార్చారు.

చరిత్రసవరించు

పరిశోధకులు కోల్‌కాతా నగరానికి ఉత్తరంలో 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రకేతుఘర్ వద్ద జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ ప్రదేశంలో 2000 సంవత్సరాల క్రితమే మానవులు నివసించినట్లు భావిస్తున్నారు. ఆధారపూరితంగా నమోదైన కోల్‌కాతా చారిత్రకాధారాలు 1690 నుండి లభ్య మౌతున్నాయి. బెంగాలులో 1690లో ఆంగ్లేయులు భారతదేశంలో దేశంలో ప్రవేశించి తమ వాణిజ్యం ఇక్కడ కేంద్రీకృతం చేసింది. ఈస్టిండియా కంపెనీకి చెందిన నిర్వాహకుడు జాబ్ చర్నాక్ ను ఈ నగర స్థాపకుడుగా భావిస్తున్నారు. ఈ నగరానికి సంస్థాకుడంటూ ఎవరూ లేరని 2003 లో కోల్‌కాతా హైకోర్టు తీర్మానించింది. కాలికత, సూతనుతి, గోవిందపూరు అనే మూడు గ్రామాల చుట్టూ క్రమంగా నగరం విస్తరించిందని భావిస్తున్నారు. కాలికత జాలరి పల్లెగా ఉండేది, సూతనుతి నదీతీర సాలెవారి పల్లె. ఈ పల్లెల మీద పన్ను విధించే హక్కు సబరన రాయ్ అనే భూస్వామ్య లేక జమిందార్ల కుటుంబానికి ఉంటూ వచ్చింది. 1698 ఈ హక్కులు ఈస్టిండియా కంపెనీకి బదిలీ అయ్యాయి.

1712 లో బ్రిటిష్ ప్రభుత్వం హుగ్లీ నది తూర్పుతీరంలో ఫోర్ట్ విలియం నిర్మాణాన్ని పూర్తి చేసింది. 1756లో ఫ్రెంచ్ సైన్యాలతో నిరంతర పోరాటాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం తమ కోటలను బలోపేతం చేయడం ఆరంభించారు. బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్ దౌలా దాన్ని వ్యతిరేకించాడు. నవాబు హెచ్చరికను బ్రిటిషు వారు పట్టించుకోలేదు. దాంతో బెంగాల్ నవాబు, ఫోర్ట్ విలియాన్ని స్వాధీనపరచుకుని, కోల్‌కాతా బ్లాక్ హోల్ వద్ద భీకరమైన బ్రిటిష్ యుద్ధఖైదీల హత్యలను ప్రోత్సహించాడు. తరువాతి సంవత్సరం రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో నగరం బ్రిటిష్ సైనికుల వశమైంది. కోల్‌కాతాను ప్రెసిడెన్సీ నగరంగా ప్రకటించారు. 1772లో ఈస్టిండియా కంపెనీ స్వాధీనంలోని ప్రదేశాలకు కలకత్తాను రాజధానిగా చేసారు. 1864 ప్రారంభంలో సిమ్లా వేసవికాల నిర్వహణా నగరంగా చేసారు. 19వ శతాబ్దపు ప్రారంభంలో నగరాన్ని చుట్టి ఉన్న చిత్తడి నేలలు ఎండిపోయాయి. ప్రభుత్వ ప్రదేశం హుగ్లీనదీతీరం వెంట నిర్మించబడి ఉన్నాయి. 1797, 1805 ల మధ్య గవర్నర్ జనరల్ గా ఉన్న రిచర్డ్ వెలస్లీ ఈ నగరం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి గట్టి కృషి చేసాడు. 18 శతాబ్దపు చివరి నుండి 19వ శతాబ్దం అంతా ఈ నగరం ఈస్టిండియా కంపెనీ ఓపీయం వాణిజ్యానికి కేంద్రంగా ఉంది.

1850 నాటికి కోల్‌కాతాలో ప్రధానంగా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఒకటి వైట్ టౌన్ (శ్వేతనగరం) రెండవది బ్లాక్ టౌన్ (నల్లవారి నగరం). చౌరింఘీని కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ ప్రజలు నివాసాలు అభివృద్ధి చేసుకున్నారు. ఉత్తర కోల్‌కాతాలో భారతీయులు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 1850 నాటికి నగరం శీఘ్రగతిలో పారిశ్రామిక అభివృద్ధి సాధించింది. ప్రత్యేకంగా వస్త్ర తయారీ, జనుము తయారీలో గుర్తించతగినంత ప్రగతి సాధించింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి పోత్సాహం కలిగించిన కారణంగా నగరాభివృద్ధి మీద పెట్టుబడులు అధికం చేయసాగారు. ప్రత్యేకంగా టెలిగ్రాఫ్ కనెక్షన్లు, హౌరా రైల్వే స్టేషను నిర్మాణం కొనసాగింది. బ్రిటిష్, భారతీయుల కలయిక కారణంగా కొత్తగా భారతీయుల ఉన్నత కుటుంబాలలో బాబు సంస్కృతి పుట్టుకొచ్చింది. వీరిలో ప్రత్యేకంగా అధికారులు, ఉన్నత వృత్తిలో ఉన్న వారూ వార్తా పత్రికలు చదివే వారు. వీరు ఆంగ్లేయులను అనుకరించేవారు. సాధారణంగా వీరంతా కులీనులైన హిందూకుటుంబాలకు చెందినవారే. 19వ శతాబ్దం నాటికి నగరంలో ఆడంబరమైన నిర్మాణశైలి తలెత్తింది. 1883లో కోల్‌కాతా ఇండియన్ నేషనల్ అసోసేషన్ నేషనల్ కాన్ఫరెన్స్ కు ఆతిధ్యం ఇచ్చింది. ఇది మొట్టమొదటి భారతీయ సంస్థ. క్రమంగా కోల్‌కాతా, స్వాతంత్ర్యోద్యమ తిరుగుబాటుదార్ల సంస్థకు కేంద్రబిందువుగా మారింది. 1905 నాటికి మతపరమైన కదలికలు ప్రజలలో విస్తరించి, స్వదేశీ ఉద్యమం రూపుదిద్దుకుని, బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడానికి దారితీసింది. తూర్పు తీరాలలో చెలరేగిన ఈ ఉద్యమాల వలన కలిగిన నిర్వహణా అసౌకర్యం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం తమ రాజధానిని 1911లో కలకత్తా నుండి కొత్త ఢిల్లీకి మార్చుకుంది.

రెండవ ప్రపంచయుద్ధం సమయంలో 1942, 1944 మధ్య కాలంలో నగరంలోని రేవు మీద అనేకసార్లు జపాన్ సైన్యాలు పలుమార్లు బాంబులు వేసారు. ఈ యుద్ధ ఫలితంగా సైన్యం, నిర్వహణ, జాతీయ సంభవాల కారణంగా 1943 లో తలెత్తిన కరువు కారణంగా లక్షలాది ప్రజలు ఆకలి మరణానికి గురి అయ్యారు. 1946లో ప్రత్యేక ముస్లిం రాష్ట్ర ఏర్పుటు కోరుతు తలెత్తిన ఉద్యమం మతపరమైన కలహాలకు దారితీసాయి. ఈ కలహాల కారణంగా 4,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిం హిందూ దేశాల వారిగా విభజన తరువాత తలెత్తిన మరి కొన్ని సంఘర్షణలు అనేక ముస్లింలు తూర్పుపాకిస్థాన్ కు తరలి వెళ్ళారు. అలాగే వందలాది హిందువులు నగరానికి తరలి వచ్చారు. 1960s, 1970 మధ్య కాలంలో విద్యుత్ కోతలు, సమ్మెలు, హింసాత్మకమైన మార్కిస్ట్–మావోయిస్ట్ ఉద్యమాలు నక్సలైట్ బృందాలు నగరంలోని ప్రజా నిర్మాణాలు విధ్వంసం చేసిన కారణంగా ఆర్థిక మాంధ్యం తలెత్తింది. 1971 లో బంగ్లాదేశ్ విమోచనోద్యమం నగరంలోకి ప్రవేశించిన శరణార్ధుల ప్రవాహం అనేక నిరుపేదలతో కోల్‌కాతా నగరం నిండిపోయింది. 1980లో నాటికి ముంబాయి జనసాంద్రతలో కోల్‌కాతాాను అధిగమించింది. 1977–2011 వరకు కోల్‌కాతా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర స్థానం అయింది. 1990 తరువాత నగరం ఆర్థికంగా కోలుకోసాగింది. 2000 లో దేశంలో జరిగిన ఆర్థిక సంస్కరణల తరువాత నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం బాగా అభివృద్ధి సాధించి ఆర్థికంగా బలపడడం మొదలైంది.

భౌగోళికంసవరించు

కోల్‌కాతా తూర్పుభారతదేశంలో దిగువ గంగా డెల్టాలో హుగ్లీ నది తూర్పున ఉత్తర దక్షిణంగా విస్తరిండి ఉంది. కెల్ కత నగరం సముద్రమట్టానికి 1.5–9 మీటర్ల (5–30 అడుగులు) ఎత్తులో ఉంది. నగరంలో చాలాభాగం చిత్తడి నేలలుగానే ఉన్నా ప్రస్తుతం కొన్ని దశాబ్ధాల కాలంగా పెరుగుతూనే ఉన్న జనాభాకు నివాస ప్రదేశాలుగా మారాయి. అభివృద్ధి చెందని మిగిలిన భూములు మాత్రం తూర్పు కోల్‌కాతా చిత్తడి నేలలుగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న మట్టి, నీరు ప్రధానంగా గంగానది ప్రవాహం చేత తీసుకురాబడినది . నగరం లోని భూములు బంకమట్టి, బురద, నీరు, పలురకాల గులకరాళ్ళు కలిగి ఉన్నాయి. నగరం లోపలి భూభాగం అవశేషాలు రెండు బంకమట్టి పలకల మధ్య బంధించబడి ఉన్నాయి. లోపలి భాగం 250–650 (30–130 అడుగులు) మీటర్ల లోతులో ఉంటుంది. పైభాగం 10–40 (30–130అడుగులు) మీటర్ల లోతులో ఉంటుంది . భారతదాశ పరిమాణం అనుసరించి రిక్టర్ స్కేల్ 1-5 వరకు భూకంపాలు రావడానికి అవకాశం ఉన్నట్లు అంచనా. ఐకత్యరాజ్యసమితి అభివృద్ధి ప్రణాళిక నివేదనలను అనుసరించి గాలులతో కూడిన తుఫానులు అత్ధికంగా నష్టం కలిగించగలిగిన ప్రాంతంగా గుర్తించబడింది.

నగర నిర్మాణంసవరించు

కోల్‌కాతా మహా నగర వైశాల్యం 1,886.67 చదరపు కిలోమీటర్లు. 2011లో గణాంకాలను అనుసరించి కోల్‌కాతా మునిసిపల్ కార్పొరేషన్ తో కలిసి మూడు మునిసిపల్ కార్పొరేషన్ లు, 39 ప్రాంతీయ మునిసిపాలిటీలు, 24 పంచాయితీ సమితులు ఉన్నాయి. కొలో కత నగరం 185 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కోల్‌కాతా మునిసిపల్ న్యాయవ్వవస్థ ఆథీనంలో ఉంది. ఈ నగరం హుగ్లీ నదికి తూర్పు పడమరగా నగస్తరించి ఉంది. అలాగా ఉత్తర దక్షిణాలుగా కోల్‌కాతా మూడు భాగాలుగా విస్తరించబడి ఉంది. ఉత్తర కోల్‌కాతా, మధ్య కోల్‌కాతా, దక్షిణ కోల్‌కాతాగా విభజింపబడి ఉంది.

ఉత్తర కోల్‌కాతా లోని పురాతన నగరం. ఇక్కడ 19వ శతాబ్దపు నిర్మాణశైలి ఇరుకైన వీధులు ఉంటాయి. పురాతన నగరంలో శ్యాంబజార్, షోభాబజార్, చిత్ పుర్, కోసీపోర్, బారానగర్, సిన్తీ, డమ్ డమ్ ప్రాంతాలు ఉన్నాయి. మధ్య కోల్‌కాతా వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. మధ్య కోల్‌కాతాలో బి.బి.డి బాఘ్ ఇది పూర్వం డాల్ హౌస్ స్క్వేర్ అని పిలువబడుతుండేది దీనికి తూర్పున ఎస్ప్లాండే పడమరలో స్ట్రాండ్ రోడ్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ సచివాలయం, జనరల్ పోస్ట్ ఆఫీస్, రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా, హైకోర్ట్, లాల్ బజార్ పోలిస్ హెడ్ క్వార్టర్స, పలు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి. మరొక వ్పార కూడలి పార్క్ స్ట్రీట్. ఇందులో జవహర్ లాల్ రోడ్డు, కామేక్ స్ట్రీట్, వుడ్ స్ట్రీట్, లండన్ స్ట్రీట్, షేక్స్ఫియర్ సరానీ, ఎ.జె.సి బోస్ రోడ్ ఉన్నాయి. కోల్‌కాతా కేంద్ర స్థానంలో ఉన్న మైదాన్ అనే విశాలమైన బహిరంగ ప్రదేశాన్ని కోల్‌కాతా ఊపిరి తిత్తులుగా అభివర్ణాస్తారు. ఇక్కడ క్రీడలు మరాయు బహిరంగ సభలు జరుగుతుంటాయి. మైదాన్ చివరగా దక్షిణంలో విక్టోరియా మెమోరియల్, కోల్‌కాతా రేస్ కోర్స్ ఉన్నాయి. హుగ్లీ నదీ తీరంలో ఉన్న ఇతర ఉద్యానవనాలలో బిధానగర్ లో ఉన్న సెంట్రల్ పార్క్, స్ట్రాండ్ రోడ్డులో ఉన్న మిలేనియం పార్క్ ప్రధానమైనవి.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దక్షిణ కోల్‌కాతా అభివృద్ధి చెందింది. ఇక్కడ పైతరగతి ప్రజల నివాసాలు అధికంగా ఉన్నాయి. ఇందులో బాలీగంజ్, అలిపోర్, న్యూ అలిపోర్, లాన్స్ డౌన్, భవానీపూరు, టాలీ గంజ్, జాధ్ పూరు పార్క్, లేక్ గార్డెన్స్, గోల్ఫ్ గ్రీన్, జాదవ్ పూర్, కసాబా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. నైరుతి నుండి ఆగ్నేయం వరకు గార్డెన్ రీచ్, బెహాలా, థాకూర్ పుకూర్, ఖుద్ ఘాట్, రాణికుతి, బాన్స్ ద్రోణి, బఘజతిన్, రారియా ప్రాంతాలు ఉన్నాయి. కోల్‌కాతా మహానగరంలో వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయబడిన రెండు టౌన్ షిప్స్ బిదానగర్ తూర్పున ఉన్నాయి. 2000లో బిదానగర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్ కంపెనీల కారణంగా బాగా అభివృద్ధి చెందింది. బిదానగర్, న్యూటౌన్ కోల్‌కాతా కార్పొరేషన్ సరిహద్దులకు వెలుపల తమ స్వంత మునిసిపాలిటీలుగా ఉన్నాయి. ఫోర్ట్ విలియం నగరానికి పశ్చిమ తీరంలో ఉన్నాయి. భారతీయ తూర్పుతీర సైనిక ప్రధాన కార్యాలయం, నివాసాలు ఉన్నాయి. ఇవి సైనిక న్యాయస్థాన ఆధీనంలో ఉన్నాయి.

వాతావరణంసవరించు

కోల్‌కాతా వాతావరణం ఉష్ణమండల వాతావరణంలా తడి, పొడి కలగలుపులతో ఉంటుంది. సంవత్సర సరాసరి వాతావరణం 26.8 °సెంటీ గ్రేడ్ (80.2 °ఫారెన్ హీట్) ఉంటుంది. మార్చి – జూన్ వరకు ఉండే వేసవి కాల వాతావరణం వేడి, తేమ కలగలుపులతో 30 °సెంటీ గ్రేడ్ కనిష్ఠ ఉష్నోగ్రత తరచుగా మే, జూన్ మాసాలలో 40 °సెంటీ గ్రేడ్ గరిష్ఠ ఉష్ణోగ్రత ఉంటుంది. శీతాకాలం 2.5 మాసాల కాలం ఉంటుంది. డిసెంబరు, జనవరి మాసాలలో శీతాకాల ఉష్ణోగ్రతలు 9–11 °సెంటీ గ్రేడ్ డిగ్రీల (48–52 °ఫారెన్ హీట్ డిగ్రీల) కనిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. దినసరి 27–37 °సెంటీ గ్రేడ్ (81–99 °ఫారెన్ హీట్) ఉష్ణోగ్రతలతో మే మాసం అత్యంత వేడిగానూ దినసరి 12–23 ° సెంటీ గ్రేడ్ (54–73 °ఫారెన్ హీట్) ఉష్ణోగ్రతలతో జూన్ మాసం అత్యంత చలిగానూ ఉంటుంది. అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రత 43.9 °సెంటీ గ్రేడ్ (111.0 °ఫారెన్ హీట్) ఉంటుంది. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత 5°సెంటీ గ్రేడ్ (41 °ఫారెన్ హీట్) ఉంటుంది. తరచుగా ఏప్రిల్ – జూన్ మాసాలలో నగరం భారీ వర్షపాతంతో, దుమ్ముతో కూడిన ఝడివానలతో, ఉరుములతో కూడిన వానలతో, వడగండ్ల వానలతో వేసవి తాపాన్ని కొంత తగ్గిస్తుంది. ప్రకృతితో సంబంధం ఉన్న ఉరుములతో కూడిన వానలను నగరవాసులు కాల్ బైసాకి అని ఆంగ్లంలో నార్ వెస్టర్స అని అంటారు.

కోల్‌కాతా లగరంలో జూన్ నుండి సెప్టెంబరు వరకు బే ఆఫ్ బంగాల్ నుండి నైరుతీ ఋతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయి. ఈ ఋతుపవనాలు నగరానికి సరిపడినంత వర్షంలో అధిక భాగం అండిస్తాయి. ఈ ఋతుపవనాలు 1,582 మి మి (62 అం) వర్షాన్ని అందిస్తాయి. ఆగస్టు మాసంలో అత్యధికంగా 306 మి మి (12అం) వర్షపాతం ఉంటుంది. నగరంలో 2,528 గంటలపాటు సూర్యరస్మి అందుతుంది. మార్చి మాసంలో అత్యధిక సూర్యరస్మి లభిస్తుంది. కోల్‌కాతా పలు తుఫానులను ఎదుర్కొంటున్నది. 1737 – 1864 మధ్య కాలంలో సంభవించిన కారణంగా వేలాది మంది మరణించారు.

కోల్‌కాతా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వాతావరణకాలుష్యం. గాలిలో సల్ఫర్ డైయాక్సాడ్, నైట్రోజల్ డైయాక్సాడ్ పరిమితులు ఐదు సంవత్సరాలకాలం కొనసాగిన కారణంగా పొగమంచు ఏర్పడింది. ఈ కారణంగా వాయుకాలుష్యం అధికమై శ్వాససంబంధిత వ్యాధులు అధికమైయ్యాయి. ఊపిరి తిత్తుల కేన్సర్ కూడా దీనిలో ఒకటి.

ఆర్ధిక రంగంసవరించు

తూర్పు, ఈశాన్య భారతదేశంలో కోల్‌కాతా ప్రముఖ వాణిజ్య, ఆర్థిక కేంద్రంగా విలసిల్లుతుంది. అలాగే కోల్‌కాతా స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన స్థావరంగా ఉంది. కోల్‌కాతా హార్బర్ వాణిజ్య, సైనిక ప్రయోజనాలకు హపయోగపడుతుంగి. అలాగే తూర్పు భారతదేశంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ఒకేఒక నగరం కోల్‌కాతా. ఒకప్పుడు భారతదేశంలో ప్రధాన నగరంగా అగ్రస్థానంలో ఉన్న కోల్‌కాతా తరువాతి కాలంలో కొన్ని దశాబ్ధాల ఆర్థిక పతనం చవిచూసింది. భారతదేశ స్వాతంత్ర్యం తరువాత కూడా భారీ జనసాంద్రత, వాణిజ్య సంఘాల తీవ్రవాదం కారణంగా ఇది కొనసాగింది. వామపక్షాల పక్కబలంతో నడుపబడుతున్న సమ్మెలు ఇందుకు ఒక కారణం. 1960 నుండి 1990 చివరి వరకు పలు పరిశ్రమలు మూతపడ్డాయి. వాణిజ్యం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళింది. పెట్టుబడులు, వనరుల కొరత కారణంగా తలెత్తిన ఆర్థిక పరమైన వత్తిడి నగరానికి అవాంఛితమైన " మరణిస్తున్న నగరం " పేరును తూసుకు వచ్చింది. 1990లో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రేశపెట్టిన తరువాత నగర ఆర్థిక రంగంలో తిరిగి అభివృద్ధి మొదలైంది.

కోల్‌కాతా నగరం లోని 40% శ్రామిక శక్తిని దారి పక్కన ఉండే వ్యాపారుల వంటి చిన్న తరహా వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. 2005లో వీరి వలన 8,772 కోట్ల వ్యాపారం జరుగింది. 2001న దాదాపు 0.81% శ్రామిక శక్తిని వ్యవసాయ, ఆటవిక, గనులలో వాడుకున్నాయి. 15.49% శ్రామిక శక్తిని పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలు వాడుకున్నాయి. 83.69% శ్రామిక శక్తిని సేవా రంగం వాడుకున్నది. 2003 గణాంకాలు మురికి వాడలలో ప్రజలు అధిక సంఖ్యలో వైవిధ్యమైన రంగాలలో ఉపాధిని పొందారు. 36.5% శ్రామిక శక్తిని మధ్య తరగతి గృహాలలో వివిధ పనులను ఉపాధిగా పొందారు. 22.2% దినభత్యం రూపంలో ఉపాధి పొందుతున్నారు. 34% శ్రామికులకు ఉపాధి లభించక బాధపడేవారు. మిగిలిన భారతదేశంలో సాగిన సమాచార రంగ అభివృద్ధి కోల్‌కాతాలో నిదానంగా 1990లో మొదలైంది. నగరంలోని ఐటి రంగం సంవత్సరానికి 70% అభివృద్ధిని సాధిస్తంది. ఇది జాతీయ సరాసరి కంటే రెండు రెట్లు అధికం. 2000 నుడి నిర్మాణ రంగం, నగరాభినృద్ధి, చిల్లర వర్తకం, సేవా రమగంలో నూతన పెట్టుబడుల వెల్లువ మొదలైంది. పలు బృహత్తర షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు నగరంలో స్థాపించారు.

ప్రభుత్వం చేత నడుపబడుతున్న అలాగే ప్రైవేట్ యాజమాన్యం చేత నడుపబడుతున్న అనేక బృహత్తర వాణిజ్య సంస్థలకు కోల్‌కాతా నగరం పుట్టినిల్లు. స్టీల్, హెవీ ఇంజనీరింగ్, గనులు, ఖనిజాలు, సిమెంట్, ఔషధాలు, ఆహార తయారీలు, వ్యవసాయం, వగద్యుత్ పరికరాలు, వస్త్రాలు, జనుము వంటివి వీటిలో ప్రధానమైనవి. ఐటిసి లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, బ్రిటానియా పరిశ్రమలు వాటిలో ప్రథమ శ్రేణిలో ఉన్నాయి. వాటి ప్రధాన కార్యాలయాలు నగరంలోనే ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులైన అలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయాలు కూడా నగరంలో ఉన్నాయి. భవిష్యత్ దర్శన్ పేరుతో దత్తు తీసుకున్న ప్రభుత్వ విధానం కారణంగా భారత్ చైనా సర్ హద్దులలో తెరవబడిన సిక్కిమ్స్ నాధూ లా మౌంటెన్ పాస్ ద్వైపాక్షిక అంతర్జాతీయ వాణిజ్యం అనుకూలించడమే కాక అలాగే దక్షిణాసియా దేశాలు భారతీయ వ్యాపార రంగ ప్రవేశానికి కుతుహలం ప్రదర్శించడం కోల్‌కాతా నగరానికి ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి.

జనాభా వివరణసవరించు

2011లోని జాతీయ గణాంకాలను అనుసరించి కోల్‌కాతా వైశాల్యం 185 చదరపు కిలోమీటర్లు. కోల్‌కాతా జనసంఖ్య 4,486,679. జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 24,252. గత శతాబ్ద (2001–11) జనసాంద్రత కంటే ఇది 1.88% తక్కువ. ప్రతి శ్రీ పురుష నిష్పత్తి 899:1000 . పశ్చిమబెంగాల్ వెలుపలి ప్రాంతాల నుండి పురుషులు పనుల కొరకు వరదలా తరలి రావడమే ఇందుకు కారణం. ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిషా నుండి వస్తుంటారు. వీరంతా కుటుంబాలను వదిలి వస్తుటారు. కోల్‌కాతా నగర అక్షరాస్యత 87.14%. అఖిల భారత అక్షరాస్యత అయిన 74% కంటే ఇది అధికం. ఇది జాతీయ సరాసరి కంటే తక్కువ. 2011లో మహానగర జనాభా 14,112,536.

కోల్‌కాతా నగర అత్యధిక జనాభా బెంగాలీయులే. అల్పసంఖ్యాకులలో అధికులు మార్వారీలు, బీహారీలు. కోల్‌కాతా నగర అత్యల్ప జనాభాలో చైనీయులు, తమిళియన్లు, నేపాలీయులు, ఒరియాయీలు, కొంకణీయులు, మళయాయీలు, ఆంధ్రులు, అస్సామీయులు, గుజరాతీయులు, ఆంగ్లో ఇండియన్లు, ఆర్మేనియన్లు, గ్రీకులు, టిబెటియన్లు, మహారాష్టరీయులు, పంజాబీలు, పర్షియన్లు ఉన్నారు. ఆర్మేనియన్లు, గ్రీకులు, జ్యూలు, విదేశీ పూర్వీకంగా కలిగిన సమూహాలు 20వ శతాబ్దం నుండి క్షీణిస్తున్నాయి. 1948లో ఇజ్రేల్ స్థాపన జరిగిన తరువాత జ్యూయిష్ ప్రజలు కోల్‌కాతా నుండి తరలి వెళ్ళారు. ఒకప్పుడు 20,000 చైనీయులు ఉండే కోల్‌కాతాలో చైనాటౌన్ లో ప్రస్తుతం 2,000 క్షీణిండింది. చైనీయులు చర్మశుద్ధి కర్మాగారంలో పనిచేసి చైనీస్ రెస్టారెంటులకు భోజనాలకు వెళుతుంటారు.

కోల్‌కాతాలో బెంగాలీ భాష మిగిలిన భాషలలో ఆధిక్యత కలిగి ఉంది. వైట్ కాలర్ ఉద్యోగులు ఒకప్పుడు ఆంగ్ల భాష మాట్లాడే వారు. చెప్పుకోతగినంత జనాభా హిందీ, ఉర్దూ మాట్లాడుతుంటారు. 2001 జనాంకాలను అనుసరించి 77.68% హిందువులు, 20.27% ముస్లిములు, 0.88% క్రైస్తవులు, 0.46% జైనులు ఉన్నారు. మిగిలిన వారిలో సిక్కులు, బౌద్ధులు, ఇతర మతాల వారు ఉన్నారు. 0.19% జనాభా ఏమతానికి చెందని వారు.

2003 గణాంకాలను అనుసరించి నగరంలోని మూడవ వంతు జనాభా 3,500 నమోదు చేయబడని ఆక్రమిత భూములలో నివసిస్తున్నారు. 2,011 మురికివాడలు నమోదు చేయబడ్డాయి. సాధికార మురికి వాడలకు పురపాలక వ్యవస్థ త్రాగు నీరు, మరుగుదొడ్లు, చెత్తలు తొలగించడం వంటి అత్యావశ్యక సేవలను అందిస్తుంది. ఈ మురికి వాడలను బస్తీల పేరుతో రెండు విభాగాలుగా విభజింప బడ్డాయి. ఇందులో యజమానుల నుడి దీర్ఘకాలిక బాడుగ ఆధారితమైనది ఒక రకం. రెండవది ప్రస్తుత బంగ్లాదేశ్ శరణార్ధులకు భారత ప్రభుత్వం చేత ఇవ్వబడిన ఒప్పంద కాలనీలు. ఇవి కాక పురపాలక వ్యవస్థ త్రాగు నీరు, మరుగుదొడ్లు, చెత్తలు తొలగించడం వంటి అత్యావశ్యక సేవలను ఆక్రమిత మురికి వాడలు. ఇవి లగరంలో ఉపాధి వెతుక్కుటూ వచ్చి నివసిస్తున్న నమోదు చేయబడని కాలువల వెంట, రహదారుల వెంట, రైల్వే లైన్ వెంట ఆక్రమిత భూములలో వెలసిన మురికి వాడలు. 2005 గణాంకాలను అనుసరించి జాతీయ కుటుంబ ఆరోగ్యసంస్థ సర్వే కోల్‌కాతాలో 14% కుటుంబాలు పేదవారని, 33% ప్రజలు మురికి వాడలలో నివసిస్తున్నారని తెలియజేసింది. అపలాగే ఈ నివేదిక నాలుగవ వంతు నగర ప్రజల కంటే మురికి వాడల ప్రజలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నారని తెలియజేసింది. మదర్ థెరిసా కోల్‌కాతాలో మిషనరీల ఆర్థిక సాయంతో సేవా సంస్థ స్థాపించి అనాథలను ఆదరించి నోబుల్ బహుమతి అందుకున్నది.

ప్రభుత్వం సేవారంగంసవరించు

ప్రభుత్వనిర్వహణసవరించు

కోల్‌కాతా పలు ప్రభుత్వ ప్రతినిధుల చేత నిర్వహించబడింది. ది కోల్‌కాతా ముంసిపల్ కార్పొరేషన్ (కె ఎం సి) నగరంలోని 15 శివార్లలోని ప్రజోపయోగనిర్మాణాల పర్యవేక్షణ, నిర్వహణా బాధ్యతలను నిర్వహిస్తుంది. కె ఎం సి కొరకు ప్రతి వార్డ్ ఒక కౌంసిలర్ ను ఎన్నుకుంటుంది. ఒక్కో శివారుకు ఒక్కో వార్డు నుండి ప్రతినిధులుగా ఎన్నుకోబడిన కౌంసిలర్ల కమిటీని కలిగి ఉంటుంది. శివారు కమిటీలు సలహా సంప్రదింపులతో కార్పొరేషన్ నగరంలోని రహదార్ల ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలు, ఆసుపత్రులు ముంసిపల్ వ్యాపార కేంద్రాలు నిర్వహణ ప్రణాళికా బద్దంగా చేస్తుంది. మేయర్-ఇన్-కౌంసిల్ మేయర్, సహ మేయర్, కె ఎం సి చేత ఎన్నుకొనబడిన 10 మంది నాయకత్వంలో మేయర్-ఇన్-కౌంసిల్ ద్వారా ఆదేశాలను జారీ చేస్తూ నగర పాలనా నిర్వహణ చేస్తుంటారు. కె ఎం సి త్రాగునీటి సరఫరా, మురుగునీటిని వెలుపలకు పంపడం, పరిసరాల పరిశుభ్రత, ఘనరూప చెత్తను తొలగించడం, వీధిదీపాలు, నిర్మాణాలను క్రమబద్ధీకరణ చేయడం వంటివి నిర్వహిస్తుంది. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన కోల్‌కాతా ఫోర్ట్ ట్రస్ట్ నగరంలోని నదీ రేవును నిర్వహిస్తుంది. 2012 నుండి కె ఎం సిని త్రినాముల్ కాంగ్రెస్ నిర్వహిస్తుంది. కోల్‌కాతా షరీఫ్ నగరంలోని ఉత్సవాలు, సమావేశాల నిర్వహిస్తుంది.

కోల్‌కాతా పాలనా సంస్థలు చట్టపరిమితికి లోబడిన ప్రదేశాలను కలిగి ఉంటాయి. అవి కొలకత్తా జిల్లా, కొలకత్తా పోలీస్ ఏరియా, కోల్‌కాతా మునిసిపల్ ఏరియా లేక కోల్‌కాతా నగరం , కోల్‌కాతా నగరంతో చేరిన సమైక్య కోల్‌కాతా మహానగర ఏరియా. కోల్‌కాతా మెట్రోపాలిటన్ కోల్‌కాతా మహానగర డెవలప్మెంట్ అధారిటీ చట్ట ప్రణాళిక, అభివృద్ధి బాధ్యతను వహిస్తుంది.

కోల్‌కాతా జిల్లా నుండి పార్లమెంట్ కొరకు ఇద్దరు ప్రతినిధులను, లోక్ సభ కొరకు 11 మంది ప్రతినిధులను ఎన్నుకుంటుంది. పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో కోల్‌కాతా పోలీస్ బాధ్యతలను నిర్వహిస్తుంది. స్టేట్ సెక్రెటరేట్ భవనంలో లేఖకుల భవనం, కోల్‌కాతా హైకోర్ట్ భవనాలు ఉన్నాయి. కోల్‌కాతా క్రింది కోర్టులు: కోర్ట్ ఆఫ్ స్మాల్ కాజెస్, సిటీ సివిల్ కోర్ట్ సివిల్ కేసుల పరిష్కారానికి పనిచేస్తుంది. ది సెషన్ కోర్ట్: క్రిమినల్ కేసుల పరిష్కారానికి పనిచేస్తుంది.

అత్యవసర సేవలుసవరించు

కోల్‌కాతా మునిసిపల్ కార్పొరేషన్ హుగ్లీ నది నుండి త్రాగునీటిని సరఫరాచేసింది. ఈ నీటిని ఉత్తర 24 పరగణా జిల్లాలో ఉన్న పాల్టా పంపింగ్ స్టేషను వద్ద శుద్ధిచేయబడుతుంది. దాదాపు 4,000 టన్నులు ఉండే 95% చెత్తను నగరానికి తూర్పుభాగంలో ఉన్న ధాపా వద్ద ఉన్న డంపింగ్ భూములలోకి తరలించబడుతుంది. అక్కడ చెత్త, మురుగు నీరు రీసైక్లింగ్ చేయబడుతుంది. చెత్తను తొలగించడం లోపం పరిసరాల పరిశుభ్రత లోపం వలన నగరంలోని కొన్ని భాగాలలో మురుగు నీరు నిలుస్తూ ఉంటుంది.

కోల్‌కాతా ఎలెక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ లేక సిఎస్ సి నగరానికి అవసరమైన విద్యుత్తును చక్కగా సరఫరాచేస్తుంది. ది వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డ్ శివారు ప్రాంతాలకు అవసరమైన విద్య్త్తును సరఫరా చేస్తుంది. 2012 నుండి రాష్ట్ర సంస్థ అయిన వెస్ట్ బెంగాల్ ఫైర్సర్వీసెస్ అగ్నిమాపక సేవలు అందిస్తుంది. నగరంలో 16 అగ్నిమాపక కార్యాలయాలు ఉన్నాయి.

భారత్ సంచార నిగం లిమిటెడ్ (బి ఎస్ ఎన్ ఎల్) రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అలాగే ప్రైవేట్ సంస్థలు అయిన ఒడాఫోన్, భారతి ఎయిర్ టెల్, రిలయంస్, ఐడియా సెల్లులర్, ఎయిర్ సెల్, టాటా డొకోమో, టాటాసర్వీసెస్, వర్జిన్ మొబైల్ ఎం టి సి ఇండియా మొదలైనవి టెలిఫోన్ సేవలను (దూరశ్రవణం) అందిస్తున్నాయి. సెల్ ఫోన్, 4 జి కనెక్టివిటీ సేవలందిస్తున్న నగరాలలో కోల్‌కాతా మొదటిది. జి ఎస్ ఎం, సి ఎం డి ఎ సెల్లులర్ విస్తారమైన సేవలు అందిస్తున్నాయి. భారతదేశంలో 2010 నుండి బ్రాండ్ బాండ్ వాడకం మొత్తం దార్ల శాతం 7%. బి ఎస్ ఎల్, వి ఎస్ ఎల్, టాటాఇండికాం, సిఫీ, ఏయిర్టెల్, రిలయంస్ మొదలైనవి వీటిలో ప్రధానమైనవి.

ప్రయాణ సదుపాయాలుసవరించు

కోల్‌కాతా ప్రభుత్వం ప్రజలకు ప్రయాణ సదుపాయాలను సబర్బ్న్ రైల్వే, ది కోల్‌కాతా మెట్రో, ట్రాములు, బస్సుల ద్వారా అందిస్తున్నది. సబర్బన్ నెట్‍వర్క్ కోల్‌కాతా నగర శివార్ల వరకు ప్రయాణసౌకర్యాలను అందిస్తుంది. 1984 నుండి కోల్‌కాతా మెట్రో నిర్వహించబడుతుంది. భూ అంతర్గత కోల్‌కాతా మెట్రో భారతదేశంలో పురాతనమైనది, మొట్టమొదటిది. కోల్‌కాతా మెట్రో ఉత్తర దక్షిణాలుగా 25 కిలోమీటర్ల పొడవున ప్రజలను అటూఇటూ చేరవేస్తున్నది. 2009 నుండి 5 మెట్రో మార్గాలు నిర్మాణదశలో ఉన్నాయి. కోల్‌కాతాలో దూరప్రాంతరైళ్ళను నడుపుతున్న మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి వరుసగా హౌరా, సీల్‍దాహ్, చిత్పూర్‍లలో ఉన్నాయి. ఇవి కోల్‌కాతా నగరాన్ని పశ్చిమ బెంగాలులోని ఇతరనగరాలతోనూ అలాగే భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలతోనూ అనుసంధానిస్తున్నాయి. కోల్‌కాతాలో దక్షిణ, తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వరంగ, ప్రైవేట్ యాజమాన్యల చేత నడుపబడుతున్న బసులు కోల్‌కాతాలో ప్రజలకు ప్రయాణ వసతులు కల్పిస్తున్నాయి. భారతదేశంలో ట్రాములు నదుపుతున్న ఒకే ఒక నగరం కోల్‌కాతా. ట్రాములను కోల్‌కాతా ట్రామ్‍వేస్‍ సంస్థ చేత నడుపబడుతున్నాయి. నగరంలోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు చాలా నిదానంగా నడిచే ట్రామ్‍ సేవలు నియంత్రించబడ్డాయి. వేసవి కాలపు వర్షాల కారణంగా మార్గాలలో నీరు నిలుస్తున్న కారణంగా ప్రయాణసదుపాయాలు అప్పుడప్పుడూ ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంది. ప్రత్యేక మార్గాలలో ఆటో రిక్షాలు, మీటర్లు కలిగిన పసుపు బాడుగ కార్లు ప్రజలను అటూ ఇటూ చేరవేస్తున్నాయి. అనేకంగా హిందూస్థాన్ సంస్థకు చెందిన పురాతన నమూనా అంబాసిడర్ కార్లతో కొత్త నమూనాలకు చెందిన సీతల సదుపాయం, రేడియో సదుపాయం కలిగిన కార్లు కూడా నగరంలోని అన్ని ప్రాంతాలకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. పురాతన తరహా సమీప దూరాలకు సైకిల్ రిక్షాలు, తోపుడు బండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

 
కోల్‌కాతా వీధుల్లో తిరుగుతున్న ట్రాం. స్వంతకృతి

వైవిధ్యం కలిగిన విస్తారమైన ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉన్న కారణంగా కోల్‌కాతాలో భారతదేశంలోని ఇతర నగలలో ఉన్నట్లు స్వంత వాహనాలు ఎక్కువగా లేవు. నగరంలో నమోదు చేయబడిన వాహల అభివృద్ధి క్రమబద్ధంగా జరుగుతుంది. 2002 గణాంకాలు గత ఏడు సంవత్సరాల కాలంలో 44% అభివృద్ధిని మాత్రమే సూచిస్తున్నది. 2004 కోల్‌కాతా నగర రహదారుల వెంట జనసాంద్రత 6% అభ్వృద్ధి చెందింది. ఢిల్లీ 23%, ముంబాయి 17% అభివృద్ధిని సూచిస్తున్నది. కోల్‌కాతా మెట్రో, కొత్తగా నిర్మించబడిన రహదారులు నగర ప్రయాణ రద్ధీని తగ్గించాయి. కోల్‌కాతా స్టేట్ ట్రాంస్పోర్ట్ కార్పొరేషన్, సౌత్ బెంగాల్ కార్పొరేషన్, నార్త్ బెంగాల్ కార్పొరేషన్ అలాగే అనేక ఇతర ప్రైవేట్ యాజమాన్య సంస్థలు దూరప్రాంత బస్సు సేవలను అందిస్తున్నారు. నగరంలో ప్రధాన బస్సు టెర్మినల్స్ ఎస్ప్లెనేడ్, కరుణామయీ బుధ్ ఘాట్ వద్ద ఉన్నాయి.

నగరానికి కేంద్రం నుండి ఈశాన్యభాగంలో 16 కిలోమీటర్ల దూరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‍పోర్ట్ ఉంది. ఇక్కడ నుండి జాతీయ, అంతర్జాతీయ విమానలు నడుపబడుతున్నాయి. 2011 నుండి అధికరించిన ప్రణీకుల రద్దీకి తగినట్లుగా అభివృద్ధి పనులు చేపట్టారు. 1870లో స్థాపించిన కోల్‌కాతా రేవు భారతదేశంలో అతి పురాతనమైనదే కాక ప్రధాన నదీ రేవుగా కూడా పనిచేస్తున్నది. ఈ రేవు నుండి అండమాన్, నికోబార్ రాజధాని పోర్ట్ బ్లైర్ కు నిరంతర ప్రయాణసేవలను అందిస్తూంది. ఈ రేవు నుండి భారతదేశం అంతటికీ, ఇతర దేశాలకూ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సరుకు రవాణా సేవలను కూడా అందిస్తుంది. పవిత్రమైన హుగ్లీ నదీ తీరాలలో విలసితమై ఉన్న కోల్‌కాతా జంటనగరమైన హౌరా కోల్‌కాతాతో ఫెర్రీ సర్వీసులతో అనుసంధానించబడి ఉంది. కోల్‌కాతా నుండి బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకా రైలు మార్గం ద్వారా అనుసంధానమై ఉంది.

ఆరోగ్య సంరక్షణసవరించు

2011 గణాంకాలను అనుసరించి కోల్‌కాతా ఆరోగ్యసంరక్షణా వ్యవస్థ 48 ప్రభుత్వ ఆసుపత్రులను కలిగి ఉంది. అవి ఎక్కువగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. కోల్‌కాతాలో 366 ప్రైవేట్ యాజమాన్య సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్సద్వారా 27,687 ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రతి 10,000 ప్రజలకు 61.7 ఆసుపత్రి పడకలు ఉన్నాయి. జాతీయ సరాసరి అయిన 10,000 ప్రజలకు 9 ఆసుపత్రి పడకల కంటే ఇది అధికం. కోల్‌కాతాలో 10 మెడికల్, దంతవైద్య కళాశాలలు ఉన్నాయి. 1835 లో స్థాపించిన కోల్‌కాతా మెడికల్ కాలేజ్ ఆధునిక వైవిధ్యలను అందించే కళాశాలలో ఆసియాలోలోనే మొదటిదిగా గుర్తింపు పొందినది. ఈ సౌకర్యాలు కూడా నగర ప్రజల వైద్య అవసరాలను తీర్చడానికి సరిపోవు. 78% కోల్‌కాతా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేట్ యాజమాన్య ఆసుపత్రులకు ముఖ్యత్వం ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటు దూరంలో లేక పోవడం, వైద్యసేవలలో నాణతాలోపం, అత్యధిక సమయం ఎదురుచూడవలసి రావడం ప్రజలను ప్రైవేట్ యాజమాన్య ఆసుపత్రులకు వెళ్ళేలా చేస్తున్నాయి.

జాతీయ కుటుంబ ఆరోగ్య సంరక్షణా సర్వేలో నగరంలోని ప్రజలలో స్వల్ప సంఖ్యలో మాత్రమే ఆరోగ్య సంరక్షణా పధకంలో సభ్యత్వం కలిగి ఉన్నారని తెలియజేస్తుంది. నగరంలో సంతానోత్పత్తి శాతం 1.4% మాత్రమే. భారతీయ 8 ప్రధాన నగరాలలో ఇది అత్యల్పం. 77 % వివాహిత స్త్రీలు సంతాన నిరోధక విధానాలు అనుసరిస్తున్నారు. నగరంలో శిశుమరణాలు 1000 మందికి 41. 5 సంవత్సరాల కంటే ముందు మరణిస్తున్న బాలల సంఖ్య 1000 మందికి 49. 2005 గణాంకాలను అనుసరించి వ్యానిరోధక మందులను వేయని నగరాలలో కోల్‌కాతా ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. అంగన్‍వాడీలు అధికంగా కలిగిన నగరాలలో కోల్‌కాతా రెండవ స్థానంలో ఉంది. పోషకాహార లోపం, రక్తహీనత, తక్కువ బరువు కలిగిన బాలలు మిగిలిన నగరాలలో కంటే కోల్‌కాతాలో తక్కువగా ఉన్నారు.

నగరంలో సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగూ,, చికెన్‍గునియా వంటి వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. నగరంలో మధ్యతరగతి వారిలో 30% స్త్రీలు, 18% పురుషులు స్థూలకాయం కలిగి ఉన్నారు. నగరంలో 55% స్త్రీలు రక్తహీనతతో బాధ పడుతున్నారు. ఇది జాతీయ సరాసరి కంటే అధికం. 20% పురుషులు రక్తహీనతతో బాధ పడుతున్నారు. మధుమేహం, ఆస్థమా, తైరాయిడ్ వ్యాధులతో అత్యధికమైన ప్రజలు బాధపడుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఎయిడ్స్ వ్యాధి బాధితులు కలిగిన నగరాలలో కోల్‌కాతా. ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయం.

విద్యారంగంసవరించు

కోల్‌కాతాలో ప్రభుత్వ పాఠశాలలు, మతసంస్థలకు చెందిన ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలూ ఉన్నాయి. ఈ పాఠశాలలో బెంగాలీ, ఆంగ్లము భాషలు ప్రధానంగా ఉన్నాయి. ప్రత్యేకంగా కోల్‌కాతా నగర కేంద్రంలో ఉర్ధూ, హిందీ భాషను కూడా బోధిస్తుంటారు. కోల్‌కాతా పాఠశాలలు 10+2+3 ప్రణాళికతో విద్యను బోధిస్తున్నారు. మాద్యమిక విద్యను పూర్తి చేసిన తరువాత విద్యార్థులు పైస్థాయి వెస్ట్ బెంగాల్ కౌంసిల్ ఆఫ్ హైయ్యర్ సెకండరీ ఎజ్యుకేషన్, ఐసిఎస్‍సి, సిబిఎస్‍సి. విద్యలకు అర్హత సంపాది స్తారు. తరువాత స్వతంత్రంగా ఆర్ట్స్, బిజినెస్ లేక సైన్సు వంటివి ఎంచుకుని విద్యను కొనసాగించవచ్చు. ఒకేషనల్ ప్రోగ్రాంస్ కూడా అందుబాటులో ఉంటాయి.

2010 నాటికి కోల్‌కాతా శివారు ప్రాంతాలతో కలిపి కోల్‌కాతాలో రాష్ట్రప్రభుత్వంతో నడుపబడుతున్న 14 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కళాశాల ఏదో ఒక విశ్వవిద్యాలయం లేక కోల్‌కాతా లేక దేశంలోని సంస్థలతో అనుసంధానించబడి ఉంటుంది. దక్షిణాసియాలో అతి పురాతనమైన కోల్‌కాతా విశ్వవిద్యాలయం 1857 లో స్థాపించబడింది. హౌరాలో ఉన్న బెంగాల్ ఇంజనీరింగ్ అండ్ సైన్సు యూనివర్సిటీ దేశంలో ప్రఖ్యాతి చెందిన రెండవ ఇంజనీరింగ్ సంస్థగా గుర్తింపు పొందింది. ఆర్ట్స్, సైన్సు, ఇంజనీరింగ్ విద్యలకు జాదవ్‍పూర్ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది. జోకా వద్ద 1961లో స్థాపించబడిన ది ఇండియన్ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్ మేనేజ్మెంట్ కోల్‌కాతా భారతదేశంలో మొదటి మేనేజ్మెంట్ విద్యా సంస్థగా పేరు పొందింది. ది వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్సు భాతరదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఏకైక న్యాయవిద్యా సంస్థగా పేరు పొందింది.

 
విక్టోరియా మెమోరియల్. కోల్‌కాతాా, స్వంత కౄతి

కోల్‌కాతాలో పుట్టిన, పనిచేసిన లేక విద్యాభ్యాసం చేసిన గుర్తింపు పొందిన విద్యావంతులు భౌతిక శాస్త్రవేత్తలయిన సత్యేంద్ర నాధ్ బోస్, మేఘనాధ్ సాహా, జగదీష్ చంద్రబోస్. రసాయన శాస్త్రవేత్త ప్రపుల్ల చంద్రరాయ్, గణాంక నిపుణుడు ప్రశాంత చంద్ర మహాలానోబిస్, భైతికశాస్త్రవేత్త ఉపేంద్రబ్రహ్మచారి, విద్యావేత్త అసుతోష్ ముఖర్జీ, నోబెల్ బహుమతి గ్రహీతలయిన రవీంద్రనాధ్ ఠాగూర్, సివి రామన్,, అమర్త్యాసేన్.

సంస్కృతిసవరించు

ఒకప్పుడు భారతదేశానికి రాజధానిగా ఉన్న కోల్‌కాతా నగరం సాహిత్యం, కళలు, విప్లవాలకు గుర్తింపు పొందిన నగరం. నవీన సాహిత్యానికి, కళలకు కోల్‌కాతా నగరం పుట్టిల్లు. కోల్‌కాతా నగరం " ఆవేశనగరం, సృజనాత్మక నగరం " అని పిలువబడుతుంది. అలాగే భారతీయ సాంస్కృతిక కేంద్రం గా కూడా పిలువబడుతుంది. ఇరుగు పొరుగు ప్రాంతం నుండి వచ్చి స్థిరపడిన సమూహాలు పరా అని పిలువబడుతూ అనేక మంది కోల్‌కాతాలో నివసిస్తున్నారు. వీరిలో ఒక్కో సమూహానికి వారి సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక్కో సాంస్కృతిక సంఘం ఉంటుంది. వీరి నివాసాలను ఇక్కడ అడ్డాలు అని కూడా పిలుస్తుంటారు. అడ్డాలలోని ప్రజలు తీరిక వేళలలో చెప్పుకునే ముచ్చట్లు ఒక్కోసారి ఆత్మీయమైన అనుబంధాలకు కూడా దారి తీస్తాయి. విమర్శనాత్మకమైన రాజకీయ వాతావరణానికి కూడా నగరం పేరు పొందింది. రాజకీయ వాతావరణాన్ని ఆవేశాన్ని వ్యంగ్య చిత్రాల ద్వారా ప్రచారం చేయడం నగర సంస్కృతిలో ఒక భాగమే.

నిర్మాణ సంస్కృతిసవరించు

కోల్‌కాతాలో ఇండో-ఇస్లామిక్, ఇండో-సరాసెనిక్ నిర్మాణ శైలిలో అలంకరించబడిన అనేక భవనాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలన కాలం నుండి చక్కగా నిర్వహించబడిన భవనాలు వారసత్వ నిర్మాణాలుగా (హెరిటేజ్ స్ట్రక్చర్స్) గుర్తించ బడ్డాయి. అయినప్పటికీ మిగిలినని వివిధ స్థితులలో శిథిలావస్థలో ఉన్నాయి. 1814 స్థాపించబడిన భారతదేశ పురాతన వస్తు ప్రదర్శన శాల ది ఇండియన్ మ్యూజియం హౌసెస్ లో భారతీయ సహజ చరిత్ర, కళలకు సంబంధించిన అనేక వస్తువులను సేకరించి ప్రదర్శించబడున్నాయి. కోల్‌కాతాలో నిర్మించబడిన యురేపియన్ మేన్ షన్ సంప్రదాయ ఉదాహరణగా నిలిచిన పాలరాతి భవనం (మార్బుల్ ప్యాలెస్). దేశంలోనే ముఖ్యమైన గ్రంథాలయం ది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా.

సాహిత్య, కళా సంస్కృతిసవరించు

1980 నుండి వ్యాపార సరళి దియేటర్లకు ప్రజాదరణ తగ్గుతూ వచ్చింది. 1940లో సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా గ్రూప్ దియేటర్స్ ఆఫ్ కోల్‌కాతా పాపులర్ దియేటర్స్ తో విభేదించి ధియేటర్స్ కేవలం వృత్తిపరం లేక వ్యాపార దృక్పదం కొరకే కాదు కథంశం, నిర్మాణం వంటి ప్రయోగాలు కూడా జరగాలని ప్రతిపాదించింది. గ్రూప్ దియేటర్స్ కళావేదికను సాంఘిక జీవన సంబంధిత సందేశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. బెంగాలులో సంప్రదాయ జానపద డ్రామాలకు ప్రజాదరణ ఉండేది. బెంగాలీ చలన చిత్రాలు కోల్‌కాతాలోనే నిర్మించబడుతుటాయి. టాలీగంజ్ లో టాలీవుడ్ చిత్రాలు డబ్ చేయబడుతుటాయి. ఇక్కడే రాష్ట్ర ఫిల్మ్ స్టూడియోలు అధికంగా ఉన్నాయి. దీర్ఘకాలంగా కోల్‌కాతాలో ఆర్ట్ చిత్రాల సంప్రదాయం కొనసాగింది. అంత్రజాతీయ ఖ్యాతిని అర్జించి అవార్డులు గెలిచిన డైరక్టర్ సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘతక్, మృణాల్ సేన్, తపన్ సిన్హా, అపర్ణాసేన్, బుద్ధదేబ్ దాస్ గుప్తా, ఋతుపర్ణ ఘోష్.

 
విక్టోరియా మెమొరిఅల్, కోల్‌కాతాలో ఒక ద్వారము. స్వంత కృతి
దస్త్రం:Victoria memorial. kolkata (2).PG
విక్టోరియా మెమొరిఅల్, కోల్‌కాతాలో స్వంత కృతి

విద్యా సంస్కృతిసవరించు

19-20 శతాబ్దాలలో బెంగాలీ సాహిత్యం రచయితలైన ఈశ్వర చంద్ర విద్యాసాగర్, బకిం చంద్ర చటోపాద్యాయ, మైకేల్ మధుసూదన్ దత్, రవీంద్రనాధ్ ఠాగోర్, ఖాజీ నాజ్రుల్ ఇస్లాం,, శరత్ చంద్ర చటోపాధ్యాయ భాగస్వామ్యంతో ఆధునిక పుంతలు తొక్కింది. అలాగే సంఘ సంస్కర్తలైన రాం మోహన్ రాయ్, స్వామి వివేకానంద తదితరులు బెంగాల్ సాంఘిక జీవితంలో పెను మార్పులు సంభవించడానికి కారకులయ్యారు. 20వ శతాబ్దపు మధ్య, చివరి కాలంలో తరువాతి ఆధునికతకు సాక్ష్యంగా నిలిచింది. ప్రచురణకర్తలు అధిక సంఖ్యలో కాలేజ్ స్ట్రీట్ లో ఉన్నారు. దానికి అరమైలు దూరంలో పుస్తక విక్రయశాలలు, విఢి దారి వెంట ఉన్న చిన్న చిన్న పుస్తక విక్రయ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ కొత్త, పాత పుస్తకాలు రెంటినీ విక్రయిస్తూంటారు. 19వ శతాబ్దంలో చిత్రించబడిన కాళీఘాట్ చిత్రాలు ప్రాంతీయశైలిని ప్రతిబింబిస్తూ మతపరమైన సంఘటనలను, దైనందిక జీవితంలో జరిగే సంఘటనలనూ తెలుపుతూంటాయి. బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ బెంగాల్ ఆర్ట్స్ కాలేజీలో ఆరంభించబడింది. ది అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఇతర కళాప్రదర్శన శాలలు నిరంతరంగా కళాప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటాయి. రవీంద్రనాధ్ గీతాలకు, సంప్రదాయ సంగీతానికి నగరం గుర్తింపు పొందింది. బౌల్ జానపద బాల్లడ్స్, కీర్తనలు, బెంగాలీ పాపులర్ మ్యూజిక్, పండుగ కాలపు గజల్స్, ఆధునిక సంగీతం అలాగే బెంగాలీ భాషా ఆధునిక గీతాలకు గుర్తింపు పొందింది. 1190 నుండి కొత్త జానపద- రాక్ శైలి గాయకులు వెలుగులోకి వచ్చారు. వాస్తవాన్ని ప్రతిబింబించే మరొక కొత్త శైలి జిబాన్‍ముఖి గాన్ కూడా వెలుగులోకి వచ్చింది.

ఆహారసంస్కృతిసవరించు

కోల్‌కాతాలో మచ్చర్ జోల్ అనే వంటకం ప్రసిద్ధం. అన్నము, ఈ చేపల కూరను వడ్డిస్తారు. భోజననానంతర పదార్ధాలుగా రసగుల్లా, సందేష్, మిస్థి దోహి అనబడే తియ్యని పెరుగు వడ్డించబడుతుంది. బెంగాలీలో విరివివిగా లభించే కోల్‌కాతా వారి అభిమానపాత్రమైన ఇలిష్ చేపలతో చేసిన కూరలు ప్రజల ఆదరణను పొందింది. బెగుని వంటి వీధి ఆహారాలు (వంకాయ బజ్జీలు), కాటీ రోల్ (చికెన్, మటన్, గుడ్డు లేక కూరలతో కూరి చేయబడిన బెడ్ రోల్స్), పుచ్క (నూనెలో దేవి చింతపండు పులుసుతో అందించేవి). చైనా టౌన్‍లో ఉన్న భారతీయ చైనీయ పాకశాలలు ప్రజాదరణ పొందాయి. కోల్‌కాతా ప్రజల అభిమాన ఆహారాలలో మిఠాయీలకు ప్రత్యేక పాత్ర ఉంటుంది. ప్రత్యేకంగా వారి సామూహిక విందు వినోదాలలో మిఠాయీలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయి.

వస్త్రధారణా సంస్కృతిసవరించు

బెంగాలీ స్త్రీలు అధికంగా చీరలు ధరిస్తున్న సమయంలో యువతుల మధ్య శల్వార్ కమీజులు, పశ్చిమదేశ వస్త్రధారణ ప్రబలమయ్యాయి. పశ్చిమదేశ వస్త్రధారణ పురుషుల విశేష ఆదరణ సంతరించుకున్నప్పటికీ పండుగ సమయాలలో మాత్రం పంచ, కుర్తాలను ధరిస్తుంటారు. కోల్‌కాతా అతి ముఖ్య పండుగ అయిన దుర్గా పూజ సెప్టెంబరు-అక్టోబరు మాసాలలో జరుపుకుంటారు. దీనిని వీరు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. బెంగాలీ నూతన సంవత్సరాన్ని పాయిలా బాయిషక్ పేరుతో జరుపుకుంటారు. నగర ఇతర పండుగలలో పౌష్ పార్బన్ పేరిట జరుపుకునే పంట కోతల కాల పండుగ, జగద్దాద్రి పూజ, దీపావళి, సరస్వతి పూజ, ఈద్, హోలి, క్రిస్‍మస్,, రథయాత్ర. పుస్తకాల సంత, ది డోవర్ లేన్ మ్యూజిక్ ఫెస్టివల్,, నందికార్ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుకుంటారు.

మాధ్యమంసవరించు

కోల్‌కాతాలో అత్యధికంగా ప్రజాదరణ పొందుతున్న బెంగాలీ భాషా దిన పత్రికలలో ఆనందబజార్ పత్రిక, భారతమాన్, సంగబాద్ ప్రితి దిన్, ఆజ్కాల్, దైనిక్ స్టేట్స్ మాన్, గణశక్తి ఉన్నాయి. ప్రధాన ఆంగ్ల దినపత్రికలు ది స్టేట్స్ మాన్, ది టెలిగ్రాఫ్. కోల్‌కాతాలో ప్రచురించబడి అందజేయబడుతున్న ప్రధాన ఆంగ్ల దినపత్రికలు దేశమంతటా ప్రజాదరణ పొందిన టైంస్ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ టైంస్, ది హిందూ, ది ఇండియన్ ఎక్స్‍ప్రెస్, ఆసియన్ ఏజ్. అధికంగా అమ్ముడౌతున్న ఆర్థిక విషయాలను అందించే పత్రికలు ది ఎకనమిక్ టైంస్, ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, బిజినెస్ లైన్, బిజినెస్ స్తాండర్డ్. అల్పసంఖ్యాక ప్రజలు చదువుతున్న భాషా ప్రాతిపదిక కలిగిన పత్రికలు హిందూ, ఉర్దూ, గుజరాతీ, ఒరియా, పంజాబీ,, చైనీస్ భాషా పత్రికలు. కోల్‌కాతా నగర ప్రధాన వార, మాస, పక్ష పత్రికలు దేష్, సనంద, సప్తహిక్ భారత్‍ మాన్, ఉనిష్-కురి, ఆనందలోక్, ఆనంద మేలా. చారిత్రకంగా కోల్‌కాతా నగరం చిన్న పత్రికా ఉధ్యమానికి కేంద్రబిందువుగా గుర్తింపు పొందింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఆల్ ఇండియా రేడియో పలు ఏ ఎం రేడియో స్టేషనున్‍స్ ద్వారా ప్రసారాలను నిర్వహిస్తుంది. నగరంలో 12 ఎఫ్ ఎం స్టేషనున్‍స్ ప్రజలకు ప్రసారాలను అందజేస్తున్నది. భారతీయ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో టెలివిజన్ దూరదర్శన్ రెండు ఉచిత ప్రాంతీయ భాషా చానల్స్ నిర్వహిస్తున్నది. కేబుల్ సేవల ద్వారా బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, ఇతర ప్రాంతీయ చానల్స్ నిర్వహిస్తుంది. డైరెక్ట్ ప్రసారాలను అందిస్తున్న శాటిలైట్ సేవలు లేక ఇంటర్ నెట్ - ఆధారిత టెలివిజన్ ప్రసారాలను అందిస్తుంది. 24 బెంగాలీ వార్తా చానల్స్ వార్తలను అందిస్తున్నాయి. అవి వరుసగా స్టార్ ఆనందా, తారా న్యూజ్, కొలక్సత్తా టివి, 24 గంటా, ఎన్ ఇ బంగ్లా, న్యూస్ టైం, చానల్ 10.

డా. సి. నారాయణ రెడ్డి రచించిన విశ్వంభర అనే కావ్యానికి 1988లో భారతదేశంలో సాహిత్య అత్యున్నత పురస్కారం, జ్ఞానపీఠ్ అవార్డు బహుకరించబడినదనీ! ( విశ్వంభర వ్యాసం )

హౌరా బ్రిడ్జిసవరించు

హుగ్లీనది పై కట్టబడిన హౌరా వంతెన పలు ప్రత్యేకతలు కలిగినదిగా రికార్డులకెక్కినది. ఈ బ్రిడ్జి తీరికలేకుండా వాడబడుతున్న కాంటిలెవర్ బ్రిడ్జి. దీని పొడవు 457 మీటర్లు. ఈ బ్రిడ్జి నిర్మాణం 1943లో రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయంలో పూర్తయ్యింది.

ప్రముఖులుసవరించు

ఇవికూడా చూడండిసవరించు

వెలుపలి లింకులుసవరించు