అహ్మదాబాద్ జిల్లా

గుజరాత్ లోని జిల్లా

గుజరాత్ రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం అయిన అహ్మదాబాద్ నగరాన్ని సుల్తాన్ అహ్మద్ షా, సబర్మతి నది ఒడ్డున నిర్మించారు. 1411 ఫిబ్రవరి 26 తేదీన సూఫీ సన్యాసుల సమక్షంలో ఈ నాడు ఎలిస్ బ్రిడ్జ్ అని పిలవబడే ప్రదేశంలో సబర్మతి నది ఒడ్డున శంకుస్థాపన చేశాడు. ఈ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ చూడచ్చు ఈ ప్రదేశాన్ని మానెక్ బుర్జ్ అంటారు. అయితే ఈ శంకుస్థాపన తేది గురించి అనేక వివాదాలున్నాయి. చరిత్రకారులు ఎక్కువగా విశ్వసించే తేది మాత్రం ఇదే. దీనికి ఆధారం రత్నమణి భీమ్‌రావ్ జోట్ 1928లో వ్రాసిన "గుజరాత్‌ను పట్నాగర్ అమ్దావాద్", అనేక ఇతర చారిత్రాత్మక పుస్తకాలు. అహ్మదాబాద్ గెజిటీర్ ప్రకారం ఈ పట్టణానికి పునాది రాళ్ళు 1411 మార్చి 4న పడ్డాయి "మాంచెస్టర్ ఆప్ ఇండియా" అని యూరోపియన్లతో శతాబ్దాల క్రితం కొనియాడిన, ఈ నగరంలో ఎన్నో సుందరమైన పురాతన కట్టడాలను ఈ నాటికీ పాత పట్టణం (ఓల్డ్ సిటీ) లో చూడొచ్చు. ప్రహరీ కలిగిన ఈ పాత పట్టణంలో అనేక సుందరమైన రాతి తలుపులు (దర్వాజాలు) మనసుని మైమరిపిస్తాయి. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.

Ahmedabad District
District
ఢిల్లీ దర్వాజా, పాత నగరానికి గేట్లలో ఒకటి
ఢిల్లీ దర్వాజా, పాత నగరానికి గేట్లలో ఒకటి
Ahmedabad location in Gujarat
Ahmedabad location in Gujarat
Government
 • District CollectorVijay Nehra
జనాభా
 (2011)
 • Total72,08,200
 • Summer (DST)IST (UTC+05:30)
Vehicle registrationGJ-1,GJ-27

చరిత్ర

మార్చు

భౌగోళికం

మార్చు

అహమ్మదాబాదు జిల్లా ఉత్తర సరిహద్దులో మెహసనా జిల్లా, తూర్పు సరిహద్దులో ఖేడా, ఆనంద్ జిల్లాలు, దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ కంబాత్, బోటాద్ జిల్లా, భావనగర్ జిల్లా ఉన్నాయి. అహ్మదాబాద్ నగరం జిల్లా కేంద్రంగా ఉంది.

వాతావరణం

మార్చు
శీతోష్ణస్థితి డేటా - అహ్మదాబాద్
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 0
(32)
0
(32)
41
(106)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
94
(201)
76
(169)
0
(32)
0.4
(32.7)
సగటు అధిక °C (°F) 0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
సగటు అల్ప °C (°F) 0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
15
(59)
అత్యల్ప రికార్డు °C (°F) 0
(32)
0
(32)
0
(32)
0
(32)
0
(32)
2
(36)
2
(36)
2
(36)
0
(32)
0
(32)
0
(32)
5
(41)
5
(41)
సగటు వర్షపాతం mm (inches) 0
(0)
0
(0)
0
(0)
0
(0)
0
(0)
0
(0)
0
(0)
0
(0)
0
(0)
0
(0)
0
(0)
0
(0)
−57
(−2)
సగటు వర్షపాతపు రోజులు (≥ 0 mm) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు 0 0 0 0 6 0 0.2 0 0 0.4 0 0.3 0
Source: HKO[1]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 7, 045, 314,
ఇది దాదాపు. హాంగ్ కాంగ్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. వాషింటన్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 8 వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 983 .
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.31%.
స్త్రీ పురుష నిష్పత్తి. 903:1000
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 86.65%.
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

2001లో జిల్లా జనసంఖ్య 5, 816, 519. అక్షరాస్యత 80.18%. 2011 నాటికి అక్షరాస్యత 86% అభివృద్ధి చెందింది.[4]అహ్మదాబాద్ ప్రజలలో అధికంగా గుజరాతీ భాషవాడుకలో ఉంది. అంతేకాక హిందీ కూడా అత్యధిక వాడుకలో ఉంది.

విభాగాలు

మార్చు

అహ్మదాబాద్ జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం 11 తాలూకాలుగా విభజించబడింది.

తాలూకాలు

మార్చు
  • అహ్మదాబాద్
  • దస్క్రొఇ (తాలూకా)
  • సనంద్
  • బవ్ల
  • ధొల్క
  • విరంగం
  • మండల (అహ్మదాబాద్)
  • రాంపురాలను (అహ్మదాబాద్)
  • దెత్రొజ్
  • ధంధుక
  • భోపాల్

అహ్మదాబాద్ నగర పరిసరాలు

మార్చు
  • బపునగర్
  • దరీపుర్ (అహ్మదాబాద్)
  • షాపూర్ (గుజరాత్)
  • ఖాన్పూర్ ( గుజరాత్)
  • కలుపుర్ - ఓల్డ్ సిటీ
  • జమల్పుర్ ( గుజరాత్)
  • బెహ్రంపుర
  • షా ఇ ఆలం షా-ఇ-ఆలం - ఓల్డ్ సిటీ
  • మిర్జాపూర్ - ఓల్డ్ సిటీ
  • బపునగర్
  • షాహీ బాగ్
  • బొదక్దెవ్
  • మనినగర్
  • వస్త్రపూర్
  • నవ వదజ్
  • అంబవది
  • ఎల్లిస్ వంతెన
  • నవ్రంగ్పుర
  • నరంపుర
  • నరోడా
  • పల్ది
  • భోపాల్లో
  • రనిప్
  • గోత్ర (గుజరాత్)
  • సర్ఖేజ్
  • వసన ( గుజరాత్ )
  • వెజల్పుర్
  • గొంతిపుర్
  • సి.జి. రోడ్
  • లా గార్డెన్
  • లాల్ దర్వాజా
  • ప్రహ్లద్నగర్
  • టీన్ దర్వాజా
  • ఉపగ్రహం
  • జివ్రజ్ పార్క్
  • గుప్తనగర్
  • నరొల్ ( గుజరాత్)
  • వత్వ
  • షహ్వది
  • మనినగర్
  • గురుకుల్
  • రాయ్పూర్
  • ఆస్తొదీ
  • మేఘాని నగర్
  • ఈసంపుర్
  • ఘొదసర్
  • చంద్ఖెద
  • జుహపుర

సంస్కృతి

మార్చు

ప్రముఖులు

మార్చు
  • ఆచార్య హేమచంద్ర - (1089 - 1172)
  • జైన్ పాలీమత్ - జన్మస్థలం ధంధుక.[5]

మరిన్ని వివరాలు.

మార్చు
  1. అహ్మదాబాద్ 1411 ఫిబ్రవరి 26 లో నిర్మించబడినా, దానికి పఠిష్టమైన, శత్రుదుర్భేధ్యమైన ప్రహరీని సుల్తాన్ మహమ్మద్ బేగ్డా 1486 లో నిర్మించాడు. తరువాత 1857 లో ఇంకా కొన్ని ప్రదేశాలను కలుపుని అహ్మదాబాద్ విస్థీర్ణం 5.56 చదరపు కి.మీ. అయింది.
  2. 1560 లో అద్భుతమైన కార్వింగ్స్ తో, పట్టణానికే శోభనిచ్చే అందమైన డిజైన్ తో పలుచటి రాతి కిటికీలతో కూడిన సిద్ది సయ్యద్ మసీదుని నిర్మించాడు.
  3. 1636 లో భద్ర ఫోర్ట్ని ఆజామ్ ఖాన్ నిర్మించాడు. [6] ఇది ఈ నాటికీ తలెత్తుకుని ఉంది.
  4. 1708 లో మరాఠా వీరుడు బాలాజీ విశ్వనాధ్, అహ్మదాబాద్‌ని ముట్టడించాడు.
  5. 1753 లో అహ్మదాబాదు మరాఠా పాలనలోకి వచ్చింది.
  6. 1826 లో మొట్టమొదటి గుజరాతి బడి తెరవబడింది.
  7. 1831, ఏప్రిల్ 22 న అహ్మదాబాద్ పురపాలకసంఘంగా ఏర్పడింది.
  8. 1848 మొట్టమొదటి ఆంగ్ల బడి మొదలయింది.
  9. 1849 లో మొట్టమొదటి వారపత్రిక "అమ్దావాద్ వార్తామన్పత్ర" గుజరాత్ వర్నాక్యులర్ సొసైటి వారిచే ప్రారంభించబడింది.
  10. 1869-70 లో సబర్మతీ నది అద్దరి, ఇద్దరిని కలుపుతూ ఇనుముని ఉపయోగించి అందమైన డిజైన్ తో, ఎలీస్ బ్రిడ్జ్ ని రూ.5, 29, 210 ఖర్చుతో నిర్మించారు. దీనికి నార్త్ జోన్ కమీషనర్ గా ఉండిన సర్ బారో రోబర్ట్ ఎలిస్ పేరు పెట్టారు. (దీన్ని కూలగొట్టకుండా అలాగే ఉంచి. వాహనాల రాకపోకలు నిషేధించి అటు వెళ్ళటానికి, ఇటు రావటానికి రెండు వేరే బ్రిడ్జ్ లను నిర్మించి కాపాడింది అహ్మదాబాద్ మునిసిపల్ కమిషన్.)
  11. 1861 లో మొట్టమొదటి కాటన్ మిల్లుని సేఠ్ రాంచోడ్ లాల్ రానియావాలా నిర్మించాడు.
  12. 1863 లో అహ్మదాబాద్, సూరత్ ల మధ్య రైలు మార్గం ఏర్పడింది. 1884 లో కాలుపూర్ స్టేషను నిర్మించబడింది.
  13. 1885 లో మొట్టమొదటి మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. మొదటి ఎఎంసి అధ్యక్షుడు రాన్ చోడ్ లాల్ చోటాలాల్.
  14. 1894 లో సిటీ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ ఏర్పడింది.
  15. 1905 లో గుజరాత్ సాహిత్య పరిషత్ ఏర్పడింది.
  16. 1909 లో మూగ చెవిటి వారికోసం బడి తెరవబడింది.
  17. 1915 లో మహాత్మా గాంధీ మొదటి సత్యాగ్రహ ఆశ్రమాన్ని కోచ్రబ్ దగ్గర ఏర్పాటుచేసాడు. ఫారడే ఎలక్ట్రిసిటిని కనుగొన్న 83 ఏళ్ళ తరువాత ఇక్కడ మొదటి ఎలక్ట్రిక్ బల్బ్ ను "భద్ర కోట" (Bhadra Fort) పైన ఉండే టవర్ లో వెలిగించారు.
  18. 1917 లో రెండవ సత్యాగ్రహ ఆశ్రమాన్ని సబర్మతి వడ్డున ఇప్పుడున్న ప్రదేశం లోనే స్థాపించారు.
  19. 1920 లో గుజరాత్ విద్యాపీఠ్ నవంబరు 15 తేది న జాతీయతా భావాన్ని బోధించటానికి ఏర్పరచారు. అది ఇప్పటికీ విజయవంతంగా నడుపబడుతుంది

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Ahmedabad Climate Record". Archived from the original on 15 ఆగస్టు 2019. Retrieved 1 May 2012.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Hong Kong 7,122,508 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Washington 6,724,540
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-14.
  5. "Hemacandra". Jain World. Archived from the original on 2008-05-09. Retrieved 2014-11-14.
  6. https://archive.today/20130707084551/img168.imageshack.us/img168/1421/bhadrafortqd3.jpg

వెలుపలి లింకులు

మార్చు

23°02′N 72°35′E / 23.03°N 72.58°E / 23.03; 72.58

వెలుపలి లింకులు

మార్చు