అహ్మద్ భాయ్ మొహమ్మద్ భాయ్ పటేల్ (21 ఆగష్టు 1949 – 25 నవంబర్ 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన లోక్‌సభకి మూడుసార్లు (1977-1989), రాజ్యసభలో ఐదుసార్లు (1993 నుండి 2022) ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు. అహ్మద్ పటేల్ సోనియా గాంధీకి వ్యక్తిగత సలహాదారుగా పని చేశాడు.[2]

అహ్మద్ పటేల్
అహ్మద్​ పటేల్


కోశాధికారి [[కాంగ్రెస్]]
పదవీ కాలం
2018 – 25 నవంబర్ 2020
ముందు మోతిలాల్ ఓరా
తరువాత పవన్ కుమార్ బన్సాల్ (తాత్కాలిక)

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
19 ఆగష్టు 1993 – 25 నవంబర్ 2020
తరువాత దినేష్ చంద్ర అనావాడియా
నియోజకవర్గం గుజరాత్

పదవీ కాలం
1977 – 1989
ముందు మాన్ సింహాజి రానా
తరువాత చందుభాయ్ దేశముఖ్[1]
నియోజకవర్గం బారుచ్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-08-21)1949 ఆగస్టు 21
పిరామల్, భరూచ్ జిల్లా, గుజరాత్, భారతదేశం
మరణం 2020 నవంబరు 25(2020-11-25) (వయసు 71)
గుర్గావ్‌, హర్యానా, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మేమూనా పటేల్ (1976)
సంతానం ఫైసల్ పటేల్‌, ముంతాజ్ పటేల్
పూర్వ విద్యార్థి సౌత్ గుజరాత్ యూనివర్సిటీ

రాజకీయ జీవితం

మార్చు

అహ్మద్ పటేల్ 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై తిరిగి 1980, 1984 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత రాజీవ్ గాంధీ కి పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశాడు. అహ్మద్ పటేల్ 1995లో కేంద్ర మంత్రిగా పని చేశాడు.[3] అహ్మద్ పటేల్ 1993 నుంచి 2017 వరకు వరుసగా ఐదుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యాడు.  

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1977 - బారుచ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌స‌భ‌ సభ్యుడిగా ఎన్నిక
  • 1980 - బారుచ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండోసారి లోక్‌స‌భ‌ సభ్యుడిగా ఎన్నిక
  • 1984 - బారుచ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడోసారి లోక్‌స‌భ‌ సభ్యుడిగా ఎన్నిక
  • 1993 - తొలిసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యాడు.
  • 1999 - రెండో రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యాడు.
  • 2004 - పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా
  • 2005 - మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా
  • 2006 - మూడోసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యాడు.
  • 2011 - నాల్గొవ రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యాడు.
  • 2017 - ఐదోసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యాడు.

అహ్మద్ పటేల్‌ కరోనా బారిన పడి గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2020 నవంబర్ 25న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.[4][5]

మూలాలు

మార్చు
  1. "Biographical Sketch of Member of 12th Lok Sabha". 164.100.47.194. Retrieved 10 August 2017.
  2. The Hindu (25 November 2020). "Ahmed Patel, a leader who remained synonymous with Congress for three decades" (in Indian English). Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
  3. Eenadu (25 November 2020). "కాంగ్రెస్‌ సవ్యసాచి అహ్మద్‌ భాయ్‌". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
  4. BBC News తెలుగు (25 November 2020). "అహ్మద్ పటేల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిల్లీలో బుధవారం తెల్లవారుజామున మృతి". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
  5. 10TV Telugu (25 November 2020). "కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)