ఆంటోనీ-లారెంట్ఆం డి లావోయిజర్ (ఆంటోనీ లావోయిజర్) (26 August 1743 – 8 May 1794;[1]) ప్రఖ్యాత ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. రసాయన శాస్త్రంలో ఈయన చేసిన కృషికి గుర్తింపుగా ఆయనను కొందరు "ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు" అని పిలుస్తారు.[2][3]. ఆయన "హిస్టరీ ఆఫ్ కెమిస్ట్రీ" మరియు "హిస్టరీ ఆఫ్ బయాలజీ" గ్రంధాల రచనతో ఎంతో గుర్తింపు పడ్డాడు.[4]

ఆంటోనీ లారెంట్ డి లావోయిజర్
Line engraving by Louis Jean Desire Delaistre, after a design by Julien Leopold Boilly
జననం(1743-08-26) 1743 ఆగస్టు 26
ప్యారిస్, ఫ్రాన్స్
మరణం1794 మే 8 (1794-05-08)(వయసు 50)
ప్యారిస్, ఫ్రాన్స్
Execution by guillotine
రంగములుbiologist, chemist
పూర్వ విద్యార్థిCollège des Quatre-Nations, University of Paris
ముఖ్యమైన విద్యార్థులుÉleuthère Irénée du Pont
ప్రసిద్ధి
ప్రభావాలుGuillaume-François Rouelle, Étienne Condillac
Signature
Antoine-Laurent Lavoisier by Jules Dalou 1866

ఆయన దహన చర్యలను గురించి అధ్యయనం చేసాడు. ఈయన పదార్థాల భౌతిక స్థితులకు సంబంధం లేకుండా క్రియాజనకాల మరియు క్రియాజన్యాల ద్రవ్యరాశులను ఖచ్చితంగా లెక్కించగలిగాడు. తన పరిశీలనల ఆధారంగా ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించాడు.

దహన క్రియలో ఆక్సిజన్ యొక్క పాత్రను ఆవిష్కరించడం ద్వారా ప్రసిద్ధుడైనాడు. ఆయన ఆక్సిజన్ కు 1778లో, హైడ్రోజన్ కు 1783 లలో నామకరణం చేసాడు. ఆయన మెట్రిక్ వ్యవస్థ నిర్మాణంలో సహాయపడ్డాడు. ఆయన మొదటిసారి విస్తృతమైన మూలకాల జాబితాలను రాసాడు. ఇది రసాయన పదార్థాల నామీకరణ విధానానికి దోహదపడింది. ఆయన సిలికాన్ మూలక ఉనికిని 1787లో అంచనా వేసాడు[5] . ఆయన సల్ఫర్ (గంధకం) ఒక మూలకమని మొదటిసారి తెలియజేసాడు.[6] ఆయన పదార్థం దాని స్థితిలోనూ మరియు ఆకారంలో మార్పు వచ్చినప్పటికీ దాని ద్రవ్యరాశిలో మార్పు ఉండదని ప్రవేశపెట్టాడు.

జీవిత విశేషాలుసవరించు

ప్రారంభ జీవితం మరియు విద్యసవరించు

ఆయన పారిస్ నగరంలో ఉన్నత వర్గానికి చెందిన సంపన్న కుటుంబంలో ఆగష్టు 26, 1743 న జన్మించాడు. ఆయన తండ్రి పారిస్ పార్లమెంటులో న్యాయవాదిగా ఉండేవాడు. ఆయనకు ఐదు సంవత్సరాల వయసులో తన తల్లిని మరణించడంతో పాటు వారసత్వంగా పెద్ద అదృష్టం లభించింది. [7] ఆయన పారిస్ విశ్వవిద్యాలయం లోని కాలేజ్ డెస్ క్వారె లో పాఠశాల తన 11వయేట 1754లో విద్యను ప్రారంభించాడు. చివరి రెండు సంవత్సరాల విద్యాభ్యాసంలో (1750-61) ఆయన రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రము, ఖగోళ శాస్త్రం మరియు గణిత శాస్త్రాలను అభ్యసించాడు. తత్వ శాస్త్రంలో ఆయన ప్రముఖ గణిత శాస్త్రవేత్త మరియు పరిశీలనా ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆబ్బె నికోలస్ డి లాకాలైట్ వద్ద శిక్షణ పొందాడు. ఆయన వాతావరణ పరిశీలనలో ఆసక్తిని కలిగించి శాస్త్రజ్ఞానంపై ఉత్సుకతను కలిగించాడు. లావోయిజర్ న్యాయ పాఠశాలలో చేరి 1763 లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు మరియు 1764 లో లైసెన్స్ పొందాడు. న్యాయ శాస్త్ర పట్టాను అందుకుని బార్ కౌన్సిల్ లో సభ్యుడయ్యాడు కానీ ఎప్పుడూ న్యాయవాద వృత్తిని ఆచరించలేదు. కానీ శాస్త్ర విద్యపై పరిశోధనలకు తన సమయాన్ని కొనసాగించాడు.


మూలాలుసవరించు

  1. మూస:Fr Lavoisier, le parcours d'un scientifique révolutionnaire CNRS (Centre National de la Recherche Scientifique)
  2. "More recently, he has been dubbed the "father of modern nutrition", as being the first to discover the metabolism that occurs inside the human body. Lavoisier, Antoine." Encyclopædia Britannica. 2007. Encyclopædia Britannica Online. 24 July 2007.
  3. Eddy, Matthew Daniel; Newman, William R.; Mauskopf, Seymour (2014). "Chemical Knowledge in the Early Modern World". Chicago: University of Chicago Press.
  4. Schwinger, Julian (1986). Einstein's Legacy. New York: Scientific American Library. p. 93. ISBN 0-7167-5011-2.
  5. In his table of the elements, Lavoisier listed five "salifiable earths" (i.e., ores that could be made to react with acids to produce salts (salis = salt, in Latin)): chaux (calcium oxide), magnésie (magnesia, magnesium oxide), baryte (barium sulfate), alumine (alumina, aluminum oxide), and silice (silica, silicon dioxide). About these "elements", Lavoisier speculates: "We are probably only acquainted as yet with a part of the metallic substances existing in nature, as all those which have a stronger affinity to oxygen than carbon possesses, are incapable, hitherto, of being reduced to a metallic state, and consequently, being only presented to our observation under the form of oxyds, are confounded with earths. It is extremely probable that barytes, which we have just now arranged with earths, is in this situation; for in many experiments it exhibits properties nearly approaching to those of metallic bodies. It is even possible that all the substances we call earths may be only metallic oxyds, irreducible by any hitherto known process." – from p. 218 of: Lavoisier with Robert Kerr, trans., Elements of Chemistry, ..., 4th ed. (Edinburgh, Scotland: William Creech, 1799). (The original passage appears in: Lavoisier, Traité Élémentaire de Chimie, ... (Paris, France: Cuchet, 1789), vol. 1, p. 174.)
  6. Hogan, C. Michael (2011). "Sulfur" Archived 28 October 2012 at the Wayback Machine. in Encyclopedia of Earth, eds. A. Jorgensen and C.J. Cleveland, National Council for Science and the environment, Washington DC
  7. మూస:Cite CE1913