ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు
వేద కాలం నుండి మధ్య యుగం వరకూ క్షత్రియ రాజ్యాలు భారత దేశంలో చాలా ప్రాంతాలను పాలించాయి. ఉత్తర భారత దేశంలో రాజస్థాన్ ను పాలించిన క్షత్రియులను రాజపుత్రులు (Rajputs) అని అన్నట్లే దక్షిణ భారత దేశంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన క్షత్రియులను ఆంధ్ర క్షత్రియులు లేదా ఆంధ్ర రాజులు అని అనడం కద్దు. ఆంధ్ర దేశాన్ని క్రీస్తు పూర్వం నుండి ఆంధ్ర క్షత్రియులు శతాబ్దాల పాటూ పాలించారు. వీరు బ్రాహ్మణులు, భట్ట రాజులు వంటి వారిని మంత్రులుగా, పూజారులుగా, ఆస్థాన కవులుగా నియమించుకొనేవారు. సైన్యంలో దూర్జయ, బోయ వంటి కులాలవారిని సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా, సామంతులుగా నియమించుకొనేవారు. స్టడీస్ ఇన్ సౌత్ ఇండియన్ జైనిజం, పార్ట్ 2: ఆంధ్ర - కర్ణాటక జైనిజం అనే పుస్తకములో ఆంధ్ర రాజులు ఆంధ్ర రాజపుత్రులుగా అభివర్ణించబడ్డారు.[1] ఫ్రెంచి, బ్రిటీషు, మహమ్మదీయుల దాడులతో క్షత్రియ సామ్రాజ్యాలు అంతమయ్యాయి. అయితే ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు ఇప్పటికీ చరిత్రకారులకు దర్శనమిస్తున్నాయి.
శిలాశాసనాలు
మార్చు- No. 1. (A. R. No. 581 of 1925) : గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా వేల్పూరులో ఉన్న రామలింగస్వామి గుడి ఆవరణలో శిథిలావస్థలో ఉన్న ఒక పాలరాతి స్తంభం మీద విష్ణుకుండినులకు చెందిన రాజు మాధవ వర్మ, ఒక కుటుంబ పేరు కనిపించినవి.
- No. 4. (A. R. No. 431 of 1915) : నరసారావుపేట తాలూకా ఏలూరులో సోమేశ్వరాలయం వద్ద నంది బొమ్మ మీద చిక్క భీమరాజు అనే పరిచ్చేదుడు సోమనాధదేవుడికి భూమిని ఇచ్చినట్లు వ్రాయబడియున్నది.
- No. 64. (A. R. No. 567 of 1925.) గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో ఉన్న రామలింగేశ్వర దేవాలయంలో గల ధ్వజ స్తంభం వద్ద పాలరాతి స్తంభం మీద కోట గోకరాజు అనేవాడు రామేశ్వర దేవాలయానికి నిరంతరం వెలిగే దీపాన్ని బహూకరించినట్లు వ్రాయబడియున్నది.
- No. 607. (A. R. No. 380 of 1904.) కమలాపురం తాలూకా కలమళ్ళ వద్ద చెన్నకేశవస్వామి దేవాలయ ఆవరణలో గల ఒక విరిగిపోయిన స్తంభం రెండువైపులా ధనుంజయుడు, రేనాడు అనే పేర్లు వ్రాయబడియున్నాయి. మిగిలిన వ్రాత పూర్తిగా శిథిలమైపోయింది.
- No. 651. (A. R. No. 99 of 1909.) విశాఖపట్నంలో శ్రీ పరవస్తు రంగాచార్యులగారి ఇంటి వద్ద ఉన్న రాయి మీద అనంత వర్మ పేరు వ్రాసి యున్నది.
- No. 675 (A. R. No. 681 of 1926.) బొబ్బిలి తాలూకా నారాయణపురం నీలకంఠేశ్వర ఆలయంలో ఒక స్తంభం మీద చోడరాజు మహాదేవి నిత్యం వెలిగే దీపాన్ని ఆ దేవాలయానికి బహూకరించినట్లుగా వ్రాయబడి ఉంది.
- No. 727. (A. R. No. 827 of 1917.) ఒడిషా గంజాము జిల్లా చత్రాపుర్ తాలూకాలోను ప్రతాపూర్ గ్రామంలో ఉన్న తుంబేశ్వర దేవాలయంలో ఉన్న ఒక రాయిమీద అనంత వర్మ అనే పేరు వ్రాయబడి ఉంది. మిగిలిన వ్రాత అసంపూర్తిగా ఉంది. సంవత్సరము తెలియరాలేదు.
- No. 732. (A. R. No. 802 of 1922.) ఇదుపులపాడు, చెన్నకేశవ దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద గరుడ స్తంభం రెండు వైపులా - వినుకొండకు ఉత్తర దిక్కున ఉన్న ఇడువులపాడు గ్రామాన్ని ప్రతాప రుద్రుడు భరద్వాజ గోత్రీకుడైన మాధవ మంత్రికి బహూకరించినట్లు వ్రాయబడింది. గజపతుల వంశావళి గురించి ఉంది.
- No. 733. (A. R. No. 375 of 1926.) పల్నాడు తాలూకా తంగేడ వద్ద ఓ శిథిలమైన రాయి మీద ప్రతాప రుద్రదేవ గజపతి పాలిస్తున్నట్లు చెప్పబడింది.
- No. 741. (A. R. No. 54 of 1912.) విశాఖపట్నం జిల్లా - వీరవల్లి తాలూకా చోడవరం వద్ద ఉన్న కేశవస్వామి ఆలయ స్తంభం మీద - గరుత్మంతుని చిత్రాన్ని బొండు మల్లయ్య అనే వాడు భూపతిరాజు వల్లభరాజు-మహాపత్ర శ్రేయస్సు కోసం సమర్పించినట్లు ఉంది.
ఇంకా చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ స్టడీస్ ఇన్ సౌత్ ఇండియన్ జైనిజం, పార్ట్ 2: ఆంధ్ర - కర్ణాటక జైనిజం, బి. శేషగిరి రావు - 1922, పేజీలు 24, 25; Printers ; Hoe & Co ,