ఆకాశదేవర గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారు ప్రదర్శిస్తున్న సాంఘిక నాటకం. నగ్నముని రాసిన ఆకాశదేవర అనే విలోమ రచనను పాటిబండ్ల ఆనందరావు నాటకీకరించగా, గుమ్మళ్ల బలరామయ్య దర్శకత్వం వహించారు.[1][2][3]

ఆకాశదేవర
రచయితనగ్నముని (మూలకథ), పాటిబండ్ల ఆనందరావు (నాటకకీకరణ)
దర్శకుడుగుమ్మళ్ల బలరామయ్య
తారాగణంప్రయోక్త - పాటిబండ్ల ఆనందరావు,
శూన్యస్వామి - గుమ్మళ్ల బలరామయ్య,
షణ్ముఖానంద స్వామి - రజితమూర్తి. సిహెచ్,
కారష్ - వెంకట్ గోవాడ
ఒరిజినల్ భాషతెలుగు
విషయంసాంఘిక నాటకం
నిర్వహణగోవాడ క్రియేషన్స్, హైదరాబాద్

కథ మార్చు

ఒక దట్టమైన కారడవిలో శతాబ్దాల కింద కట్టబడి జీర్ణావస్థలోకి మారిన ఒక ఆలయం పునర్నిర్మాణం, దాని చుట్టూ పెరుకోనిపోయిన వేలకోట్ల సంపదను కైంకర్యం చేస్తున్న మిస్టర్ కారష్ మాయాజాలం ఇతివృత్తంగా అల్లబడిన మరొక విలోమ కథ ఆకాశదేవర. ప్రచారంతో అబద్దాన్ని నిజం చేయడం, ఒకప్పుడు ఉనికిలో ఉన్న నిజాన్ని అబద్దంగా ప్రచారం చేయడం. ఒక అబద్దాన్ని స్వతంత్రంగా సృష్టించి వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నేర్పరి, కేవలం మూడుపదుల వయసు కూడా నిండని ఒక ‘సుప్రాటెక్నో నెట్‌వర్క్‌’ సృష్టించిన కారష్ అనే టెక్నోక్రాట్ చీకటి వ్యాపారి చరిత్ర. ఆయన నడుపుతున్న వ్యాపారానికి ముడిసరుకు ‘అబద్దం’, ఆయన అబద్దాలు అమ్ముతూ చరిత్ర గతిని నిర్దేషించ గలిగిన వ్యాపార డైనోసార్. కారష్ సృష్టించిన అబద్దాలు ప్రజలుచే నిజమని బ్రమింపజేసి, వాళ్ళ మనుస్సులో స్థిరపడేలా చేసి, బానిసలను చేసి దానినే చరిత్రగా, జ్ఞానంగా, విజ్ఞానంగా మార్చి ఒక కాల్పనిక కలలో భాగంచేసి నిర్మించిన దేవళం ‘ఆకాశదేవర’. నిజానికి అదొక మార్మిక కళ. ఆ కళద్వారా ప్రజల బలహీనతలను పెట్టుబడిగా మార్చుకున్న వైనాలు మన కళ్ళముందే వందలు వేలు ఉన్నాయి. ఆధునిక సంక్షోభాలు సృష్టించిన వికృత రూపం కారష్. ఆధునిక మాధ్యమాలు ఒక మిధ్యాలోకాన్ని సృష్టిస్థాయి. దాని చుట్టూ మనల్ని తిప్పుతారు, మన ప్రమేయం లోకుండానే అందులో భాగం అవుతాం. మన మేధో దారిద్రాన్ని సంపదగా మార్చుకున్న కారష్ లాంటి వ్యక్తులు సృష్టించిన శూన్యం వలయంలో కొట్టు మిట్టాడుతున్న నేటి సంక్షోభాల గుట్టూ, దానిని రాజకీయంగా ఎదుర్కొనే పనిముట్టూ ‘ఆకాశదేవర’.[4]

నటవర్గం మార్చు

 
శూన్యస్వామి పాత్రలో బలరామయ్య

ఈ నాటకంలోని పాత్రలు-పాత్రధారులు[5]

సాంకేతికవర్గం మార్చు

  • ఆహార్యం: హరిశ్చంద్ర రాయల
  • రంగొద్దీపనం - సురభి శంకర్
  • రంగలంకరణ - పాటిబండ్ల ఆనందరావు, సురభి శంకర్
  • సంగీతం - నాగరాజు
  • తబలా - ఎస్.వి. ఈశ్వర స్వరూప్
  • మేనేజర్: సిహెచ్. హనుమాన్

మూలాలు మార్చు

  1. నవతెలంగాణ. "25 నుంచి రసరంజని నాటకోత్సవాలు". Archived from the original on 18 సెప్టెంబర్ 2021. Retrieved 24 July 2017. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  2. ఈనాడు. "నేడు 'ఆకాశ దేవర' నాటకం ప్రదర్శన". Retrieved 24 July 2017.[permanent dead link]
  3. ఆంధ్రప్రభ. "కర్నూలు: నేడు 'ఆకాశ దేవర' నాటకం ప్రదర్శన". Retrieved 24 July 2017.[permanent dead link]
  4. ఆంధ్రభూమి, విశాఖపట్టణం (7 August 2017). "ఆకాశదేవర నాటక సమీక్ష (నాటక సమీక్ష)". www.andhrabhoomi.net. శ్రీమతి కోవిల. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.
  5. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు. "ప్రతి జిల్లాకు ఆడిటోరియం: రిటైర్డ్‌ ఐఏఎస్‌ బలరామయ్య". lit.andhrajyothy.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆకాశదేవర&oldid=3908916" నుండి వెలికితీశారు