ఆకాశరామన్న (2010 సినిమా)
ఆకాశ రామన్న 2010 లో జి. ఆశోక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇది రివర్స్ చిత్రానువాదం తరహాలో రూపొందించబడిన వినూత్న ప్రయోగం.ఈ సినిమాకు సంగీతాన్ని చక్రి అందించాడు. ఛాయాగ్రహణంని సాయి శ్రీరామ్ నిర్వహించాడు. ఈ చిత్రానికి సంభాషణలు చంద్రశేఖర్ గుండెమెడ రాయగా జి.అశోక్ స్క్రీన్ ప్లె చేసాడు. జి. అశోక్ దర్శకుడిగా ఇది రెండవ చిత్రం. కూర్పు ప్రవీణ్ పూడికి తొలి చిత్రం. ఈ చిత్రం 2010 మార్చి 12 న విడుదలైంది. ఫ్లాష్ న్యూస్ చిత్రంతో పరిచయమైన దర్శకుడు అశోక్ డైరక్షన్ లో వచ్చిన ఈ చిత్రం 11:14 అనే హాలీవుడ్ ధ్రిల్లర్ ని కాపీ చేస్తూ తయారైంది.[1]
ఆకాశరామన్న (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి. అశోక్ |
---|---|
కథ | జి. అశోక్ |
చిత్రానువాదం | జి. అశోక్ |
తారాగణం | అల్లరి నరేష్ రాజీవ్ కనకాల శివాజీ మీరా జాస్మిన్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
నిర్మాణ సంస్థ | మన్యం ఎంటర్ టైన్ మెంట్స్ |
విడుదల తేదీ | 12 మార్చి 2010 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చుపనీపాట లేకుండా తేజ ( రాజీవ్ కనకాల) పబ్‌లో తాగుతూ చిందులేస్తుంటాడు. అక్కడ పబ్‌లో ఓ స్వామీజీ ( రఘు బాబు) తన శిష్యులతో వచ్చి చిందులేస్తుంటాడు. తనకొచ్చిన అనుమానాల స్వామీజీతో చెప్పి తేజ నివృత్తి చేసుకుంటాడు. తప్పు చేస్తే తగిన శిక్ష దేవుడు విధిస్తాడని చెపుతాడు స్వామీజీ. కానీ తాము అందుకు అతీతులమని స్వామీజి చెప్పిన మరుక్షణంలో కారు యాక్సిడెంట్లో చనిపోతాడు. దాంతో కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని చివరి మాట చెపుతాడు స్వామీజీ. కథాగమనం ఎలా సాగుతుందో ప్రారంభ సన్నివేశంలో తెలిసిపోతుంది. అంటే ఇంకా ఇటువంటి తప్పులు చేసేవారు కొందరున్నారు. వారు ఎన్ని తప్పులు చేశారు. వాటికి తగిన శిక్ష ఎలా పడింది అనేది సినిమా. కాకపోతే ఈ పాయింట్ చెప్పడానికి దర్శకుడు ఎన్నుకున్న కొత్త మార్గం రివర్స్ చిత్రానువాదం.[2]
తారాగణం
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- కెమేరా: శ్రీరామ్
- కథానువాదం
- కథ: అశోక్
- నిర్మాణం: మన్యం ఎంటర్ టైన్మెంట్
- బ్యాక్ గ్రౌండ్, సంగీతం: చక్రి,
- నిర్మాత: మన్యం రమేష్.
మూలాలు
మార్చు- ↑ Srikanya (2010-03-14). "అల్లరి నరేష్ 'ఆకాశ రామన్న' చిత్రం ఏమైంది?". filmibeat. Retrieved 2020-08-13.
- ↑ NIFT, వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC. "Akasa Ramanna Cinema Review, Rajeev Kanakala | Allari Naresh | Meera Jasmine | Gowri Pandit | ఆకాశ రామన్న.. బుర్రకు భలే పదును..!!". telugu.webdunia.com. Retrieved 2020-08-13.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link)