ఆత్మకూరు (నంద్యాల జిల్లా)

ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా పట్టణం
(ఆత్మకూరు, కర్నూలు జిల్లా నుండి దారిమార్పు చెందింది)

ఆత్మకూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండల పట్టణం, మండల కేంద్రం.

పట్టణం
పటం
Coordinates: 15°52′40″N 78°35′18″E / 15.8779°N 78.5884°E / 15.8779; 78.5884
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండలంఆత్మకూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం43.72 km2 (16.88 sq mi)
జనాభా
 (2011)[1]
 • మొత్తం39,794
 • జనసాంద్రత910/km2 (2,400/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి935
ప్రాంతపు కోడ్+91 ( 08513 Edit this on Wikidata )
పిన్(PIN)518422 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

చరిత్ర

మార్చు

19వ శతాబ్దికి చెందిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో అప్పటి ఆత్మకూరు వివరాలు నమోదుచేశాడు. 1830లో ఆయన కాశీయాత్రకు వెళ్తూ ఆత్మకూరులో మజిలీ చేశాడు. అప్పట్లో గ్రామం కందనూరు నవాబు పరిపాలనలో ఉండేది. నవాబు తాలూకా ఉద్యోగస్థులుండే కసుబాస్థలమని వ్రాశారు. ఆ నవాబు తాలూకాను నాలుగు మేటీలుగా విభజించి ఒక్కొక్క మేటీ (పరిపాలన విభాగం)కి ఒక్కొక్క అములుదారుని ఏర్పరిచారని వ్రాశారు. తన వద్ద ఉన్న నౌకర్లకు జీతానికి బదులుగా జాగీర్లను కూడా ఇచ్చారని వ్రాశారు. ఆత్మకూరును గురించి దూరానికి గొప్పగ్రామమని, పేటస్థలమని, సంతలో సకలపదార్థాలూ దొరికేవని ప్రశస్తి వినిపించేదని, తీరా వచ్చి చూస్తే దానికి వ్యతిరేకంగా ఉండేదని వ్రాసుకున్నాడు. అప్పట్లో అక్కడ ఆదివారం పూట సంత జరిగేది కాని, యాత్రికులకు పనికివచ్చే ఒక్క వస్తువూ దొరికేది కాదట. శ్రీశైలం అటవీప్రాంతం కావడంతో శ్రీశైల అర్చకులు, శ్రీశైల యాత్రికుల నుంచి పన్నులు తీసుకునే నవాబు ముసద్దీలు ఆత్మకూరులోనే నివసించేవారు.[2]

భౌగోళికం

మార్చు

ఇది సమీప నగరమైన కర్నూలు నుండి 70 కి. మీ. దూరం లోను, జిల్లా కేంద్రమైన నంద్యాల నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది.

జనగణన వివరాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఇది 10859 ఇళ్లతో, 45,703 జనాభాతో 4372 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 23344, ఆడవారి సంఖ్య 22359. [3]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 39,794. ఇందులో పురుషుల సంఖ్య 20,568, మహిళల సంఖ్య 19,226, గ్రామంలో నివాస గృహాలు 8,076 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4,372 హెక్టారులు.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 15, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 11, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 11, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు 8 ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 4 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, అనియత విద్యా కేంద్రం నంద్యాలలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల వెలుగోడు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కర్నూలు లోనూ ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

మార్చు

కర్నూలు - దోర్నాల జాతీయ రహదారి మార్గం 340C పై ఈ పట్టణం వుంది. సమీప రైల్వే స్టేషన్ నంద్యాల

భూమి వినియోగం

మార్చు

2011 జనగణన ప్రకారం భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • అడవి: 504 హెక్టార్లు
 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 390 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 2 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 3474 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 3170 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 304 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

ఆత్మకూరు సమీపంలో రెండు నీటి పధకాలు ఉన్నాయి. ఒక దాని పేరు వరదరాజస్వామిప్రాజెక్ట్ (వి ఆర్ ఎస్ పి). ఇది ఆత్మకూరుకు 10 కిలోమీటర్ల దూరంలో కొట్టాలచెరువు గ్రామంలో ఉంది. రెండవది వెలుగోడు నీటి పధకం.ఇది ఆత్మకూరు నుండి 18 కిలోమీటర్ల దూరంలో వెలుగోడు సమీపాన ఉంది.

సిద్దపురం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 10 పల్లెలకి, ఆత్మకూరు టౌన్ అన్నీటికీ వ్యవసాయం నీటిపారుదల, తాగునీరు అందుబాటులో ఉంది బావులు/బోరు బావులు: 304 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

వరి, జొన్నలు, వేరుశనగ

పర్యాటక ఆకర్షణలు

మార్చు
 • కొలను భారతి
 • శ్రీశైలం: ఆత్మకూరు నుండి శ్రీశైలానికి 110 కిలోమీటర్ల దూరం ఉంది. కర్నూలు,నంద్యాల నుండి శ్రీశైలం వేళ్ళాలనుకునేవారు వయా ఆత్మకూరు మీదుగా వెళ్ళాలి. ఇక్కడ నుండి కాలినడకన వెళ్ళే యాత్రికులు 7 కిలోమీటర్ల వరకు రహదారి గుండా నడిచి తరువాత అటవీ మార్గం గుండా ప్రయాణిస్తారు.
 • వై ఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతివనం: ఈ ఊరికి 7కిలో మీటర్ల దూరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్ధం ప్రభుత్వం ఒక వనాన్ని నిర్మించింది. ఈ స్మృతి వనంలో రాజశేఖర్ రెడ్డి భారివిగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఈ వనం ఆత్మకూరు వెలుగోడు రహదారి మధ్యలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్మించబడింది.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 Error: Unable to display the reference properly. See the documentation for details.
 2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
 3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు