ఆది
ఆది అనగా తెలుగు భాషలో మొదట అని అర్ధం. ఆదితో మొదలయ్యే వ్యాసాలు.
- ఆది దంపతులు - అనగా సృష్టిలో మొదటి దంపతులు. హిందూ సాంప్రదాయంలో శివపార్వతులు.
- ఆది కవి - అనగా మొదటి కవి. తెలుగులో నన్నయను ఆది కవిగా భావిస్తారు
- ఆది పర్వము - అనగా మొదటి పర్వము. మహాభారతములో మొదటి పర్వము.
- ఆది పరాశక్తి - హిందూ సాంప్రదాయంలో సృష్టికి మూలశక్తి యైన అమ్మవారు
- ఆదిబుద్ధుడు - బౌద్ధ సాంప్రదాయ భావన
- ఆది శంకరాచార్యులు - ఆధునిక హిందూ సాంప్రదాయాన్ని ప్రభావితం చేసిన గురువు.
- ఆది గ్రంథ్ - మొదటి గ్రంథము. సిక్కు మతస్తులకు చాలా పవిత్రమైనది.
- సంవత్సరాది - కొత్త సంవత్సరంలో మొదటి రోజు.
- ఆది తాళం - కర్ణాటక సంగీతంలోని ప్రాచుర్యం పొందిన తాళం.
- పి.ఆదినారాయణరావు - ప్రముఖ సంగీత దర్శకుడు, నిర్మాత.
- ఆదిభట్ల నారాయణదాసు - ప్రముఖ హరికథా కళాకారుడు.
- ఆది (సినిమా) - జూనియర్ ఎంటీఆర్ కథానాయకునిగా విజయవంతమైన సినిమా.
- ఆది (నటుడు) - వర్ధమాన తెలుగు సినిమా నటుడు. సాయి కుమార్ కుమారుడు.
- ఆది పినిశెట్టి - వర్ధమాన తెలుగు, తమిళ సినిమా నటుడు. రవిరాజా పినిశెట్టి కుమారుడు.