ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం

ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం షహీద్ భగత్ సింగ్, రూప్‌నగర్, మొహాలీ, హోషియార్‌పూర్ జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2] లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[3]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
45 గర్‌శంకర్ జనరల్ హోషియార్‌పూర్
46 బంగా ఎస్సీ షహీద్ భగత్ సింగ్ నగర్
47 నవన్ షహర్ జనరల్ షహీద్ భగత్ సింగ్ నగర్
48 బాలాచౌర్ జనరల్ షహీద్ భగత్ సింగ్ నగర్
49 ఆనందపూర్ సాహిబ్ జనరల్ రూపనగర్
50 రూప్‌నగర్ జనరల్ రూపనగర్
51 చమ్‌కౌర్ సాహిబ్ ఎస్సీ రూపనగర్
52 ఖరార్ జనరల్ మొహాలీ
53 సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్ జనరల్ మొహాలీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
ఎన్నికల సభ్యుడు పార్టీ
2009 రవ్‌నీత్ సింగ్ బిట్టు భారత జాతీయ కాంగ్రెస్
2014 ప్రేమ్ సింగ్ చందుమజ్రా శిరోమణి అకాలీదళ్
2019 మనీష్ తివారీ భారత జాతీయ కాంగ్రెస్
2024 మల్విందర్ సింగ్ కాంగ్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. Zee News (2019). "Anandpur Sahib Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2022. Retrieved 10 October 2022.
  2. Singh, Prabhjot (16 February 2008). "3 Parliament, 16 assembly seats get new names". The Tribune. Retrieved 2009-04-19.
  3. Hindustan Times (29 April 2014). "Anandpur Sahib: All you should know about your constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2022. Retrieved 10 October 2022.