రవ్‌నీత్ సింగ్ బిట్టు
రవ్‌నీత్ సింగ్ బిట్టు, భారతదేశానికి రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఒకసారి, లూథియానా లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రవ్‌నీత్ సింగ్ బిట్టు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు.
రవ్‌నీత్ సింగ్ బిట్టు | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 9 జూన్ 2024 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు
| |||
పదవీ కాలం 11 మార్చి 2021[1] – 18 జులై 2021 | |||
అధ్యక్షుడు | రామ్‌నాథ్ కోవింద్ | ||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
డిప్యూటీ | గౌరవ్ గొగోయ్ | ||
ముందు | అధీర్ రంజన్ చౌదరి | ||
తరువాత | అధీర్ రంజన్ చౌదరి | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | మనీష్ తివారీ | ||
నియోజకవర్గం | లూథియానా | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | నూతన నియోజకవర్గం | ||
తరువాత | ప్రేమ్ సింగ్ చందుమజ్రా | ||
నియోజకవర్గం | ఆనంద్‌పూర్ సాహిబ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లూథియానా, పంజాబ్, భారతదేశం | 1975 సెప్టెంబరు 10||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (2007 - 2024) | ||
జీవిత భాగస్వామి | అనుపమ | ||
బంధువులు | బియాంత్ సింగ్ (తాత) | ||
నివాసం | చండీగఢ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చురవ్నీత్ సింగ్ బిట్టు రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుండి 2007లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2008లో 33 ఏళ్ల వయసులో పంజాబ్ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడిగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తరువాత 2014లో లూథియానా లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.
రవ్‌నీత్ సింగ్ బిట్టు 2017లో జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో జలాలాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఆయన 2019లో జరిగిన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లూథియానా లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.
రవ్‌నీత్ సింగ్ 2021లో ప్రస్తుత కాంగ్రెస్ లోక్‌సభ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బిజీగా ఉన్నప్పుడు మార్చి నుండి జూలై 2021 వరకు లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడిగా పని చేశాడు.[2][3] అతను 2024 మార్చి 27న న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4][5][6]
రవ్‌నీత్ సింగ్ బిట్టు 2024 లోక్‌సభ ఎన్నికల్లో లూథియానా నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ చేతిలో ఓడిపోయాడు. అతను ఆ తరువాత 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[7][8][9][10]
మూలాలు
మార్చు- ↑ Dutta Roy, Divyanshu (11 March 2021). "Punjab Congress MP Ravneet Singh Bittu To Be Party's Lok Sabha Leader". NDTV. Retrieved 12 March 2021.
- ↑ ETV Bharat News (11 March 2021). "లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రవ్‌నీత్ సింగ్". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
{{cite news}}
: zero width space character in|title=
at position 5 (help) - ↑ Firstpost (18 July 2021). "Sonia Gandhi reconstitutes Congress' parliamentary groups ahead of Monsoon Session" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
- ↑ Eenadu (26 March 2024). "భాజపాలో చేరిన కాంగ్రెస్ ఎంపీ రవ్‌నీత్ సింగ్ బిట్టూ". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
- ↑ The Indian Express (26 March 2024). "Slain CM Beant Singh scion, Rahul Gandhi loyalist: Three-time Congress MP Ravneet Bittu joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
- ↑ Andhrajyothy (26 March 2024). "కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన పంజాబ్ ఎంపీ". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
- ↑ India Today (9 June 2024). "Why Ravneet Singh Bittu, who lost from Ludhiana, is in Modi 3.0" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ Andhrajyothy (9 June 2024). "ముచ్చటగా మూడోసారి కొలువైన మోదీ ప్రభుత్వం.. మంత్రులుగా 72 మంది". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ The Hindu (9 June 2024). "BJP's Punjab foray now includes Ravneet Bittu's induction into Union Cabinet" (in Indian English). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ EENADU (10 June 2024). "ఎన్నికల్లో ఓడినా.. పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా.. కేంద్రమంత్రిగా". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.