ఆపరేషన్ దుర్యోధన

పోసాని కృష్ణ మురళి దర్శకత్వంలో 2007లో విడుదలైన తెలుగు చలనచిత్రం

ఆపరేషన్ దుర్యోధన 2007, మే 31న విడుదలైన తెలుగు చలనచిత్రం. అమన్ ఇంటర్నేషనల్ మూవీస్ పతాకంపై పోసాని కృష్ణ మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, కళ్యాణి జంటగా నటించగా, ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. రాజకీయ నేపథ్యంతో తీసిన ఈ చిత్రం 2005లో స్టింగ్ ఆపరేషన్ నుండి ప్రేరణ పొందింది.[1] ఈ చిత్రంలో నటించినందుకు శ్రీకాంత్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డుకు నామినేట్ చేయబడ్డాడు. ఈ చిత్రాన్ని తమిళంలో థీ పేరుతో, హిందీలో ఆపరేషన్ ధుర్యోధన పేరుతో రీమేక్ చేశారు.[2]

ఆపరేషన్ దుర్యోధన
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం పోసాని కృష్ణ మురళి
నిర్మాణం పోసాని కృష్ణ మురళి
ఎ. మల్లికార్జున రావు
కథ పోసాని కృష్ణ మురళి
చిత్రానువాదం పోసాని కృష్ణ మురళి
తారాగణం శ్రీకాంత్, కళ్యాణి
సంగీతం ఎం. ఎం. శ్రీలేఖ
సంభాషణలు పోసాని కృష్ణ మురళి
ఛాయాగ్రహణం రాజా
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ అమన్ ఇంటర్నేషనల్ మూవీస్
విడుదల తేదీ 31 మే 2007
నిడివి 156 నిముషాలు
భాష తెలుగు
పెట్టుబడి 1.5 crores
వసూళ్లు 13.5 crores
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథా నేపథ్యం మార్చు

మహేష్ (శ్రీకాంత్) నిజాయితీగల, నిజాయితీగల పోలీసు అధికారి. అతని నిజాయితీ వల్ల నష్టపోతున్న కొద్దిమంది రాజకీయ నాయకుల వల్ల అతను తన భార్యను,పిల్లలను కోల్పోతాడు. దాంతో మహేష్ రాజకీయాల్లో చేరడానికి తన వేషాన్ని, పేరును మార్చుకుంటాడు. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ప్రజలను ఎలా తెలియజేశాడన్నది మిగతా కథ.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

స్పందన మార్చు

ఈ చిత్రానికి విమర్శకుల, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాల గురించి వ్యంగ్యగా రాసిన సంభాషణలు ఆదరణ పొందాయి. కఠినమైన, కోపంగా ఉన్న యువకుడి పాత్రలో శ్రీకాంత్ నటను మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా కథకి సంబంధం లేని సీక్వెల్ 2013లో నందం హరిశ్చంద్రరావు దర్శకత్వంలో జగపతి బాబు ప్రధానపాత్రలో ఆపరేషన్ దుర్యోధన 2 సినిమా విడుదలైంది.

మూలాలు మార్చు

  1. staff (22 July 2007). "'Success' story". The Hindu. Archived from the original on 20 డిసెంబరు 2007. Retrieved 4 August 2020.
  2. "Operation Dhuryodhana (Hindi) full movie". YouTube.

ఇతర లంకెలు మార్చు