ఓకే బంగారం మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ నటించగా 2015 ఏప్రిల్ 17న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. తమిళ చిత్రం ఓ కథల్ కణ్మణి చిత్రం దీనికి మాతృక. తెలుగులో ఇది డబ్బింగ్ చిత్రం.

ఓకే బంగారం
OkBangaramPoster.jpg
చిత్ర గోడ ప్రచార చిత్రం
దర్శకత్వంమణిరత్నం
రచనమణిరత్నం
నిర్మాతమణిరత్నం
తారాగణందుల్కర్ సల్మాన్
నిత్యా మీనన్
ఛాయాగ్రహణంపి.సి. శ్రీరామ్
కూర్పుఎ. శ్రీకర ప్రసాద్
సంగీతంఏ.ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుస్టుడియో గ్రీన్ (తమిళం)
శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ (తెలుగు)
విడుదల తేదీ
2015 ఏప్రిల్ 17 (2015-04-17)
సినిమా నిడివి
138 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు

కథసవరించు

హైదరాబాదు కుర్రాడు ఆదిత్య కంటమనేని అలియాస్ ఆది (దుల్కర్ సల్మాన్) ఉద్యోగ నిమిత్తం ముంబయ్ వెళతాడు. అక్కడ తన అన్నయ్య స్నేహుతులు గణపతి (ప్రకాష్ రాజ్), భవాని (లీలా శాంసన్) ఇంటిలో పేయింగ్ గెస్ట్ గా ఆశ్రయం పొందుతాడు. రైల్వే స్టేషన్లోళ్ చూసిన తారా (నిత్యా మీనన్) అనే అమ్మాయితో పరిచయం పెంచుకుని స్నేహితులుగా మారుతారు. ఇద్దరూ కలిసి సహజీవనం చేయాలని నిర్ణయించుకుంటారు. తమ తమ కెరీర్ లో ఉన్నత స్థితులను చేరడానికి ఆది అమెరికాకి, తారా ఫ్రాన్స్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. సహజీవనంతో మొదలైన వీరి ప్రయాణం పెళ్ళి వరకు వెళ్ళిందా లేదా అనేది మిగిలిన కథ.[1]

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

సమీక్ష-ప్రేక్షకాదరణసవరించు

సినిమా సానుకూల సమీక్షల నడుమ విడుదలైంది. గ్రేట్ ఆంధ్రా పత్రికలో సూపర్‌ బంగారం! అన్న బోటంలైనుతో సినిమాకు 3.25/5 రేటింగ్‌ ఇస్తూ సమీక్షించారు. లవ్‌ స్టోరీస్‌ చూడ్డం ఇష్టమైతే కనుక దీనిని అస్సలు మిస్‌ కాకండి. మణిరత్నం తీసిన అద్భుతాల అంతటి స్థాయిలో లేకపోవచ్చు కానీ ఈమధ్య వస్తున్న ప్రేమకథల మధ్య ఇది ఖచ్చితంగా టాప్‌ క్లాస్‌ అనిపించుకుంటుంది. అంటూ ఆ సమీక్ష ముగించారు.[2] పల్లీబటానీ వెబ్సైట్ వారు 3.25 స్టార్ల రేటింగు ఇచ్చారు. ప్రేమ కథా చిత్రాలు ఇష్టపడటానికి వయసుకి సంబంధం లేదు. అందుకే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని చెప్పలేం. అయితే ప్రేమికులు... తమను తాము చూసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి బాగా కనెక్ట్ అవుతారు. మణి కూడా వారినే టార్గెట్ చేశాడు మరి. సో.. ప్రేమికులారా... గో అండ్ వాచ్ విత్ యువర్ బంగారం అంటూ వారు ముక్తాయించారు.[3]

మూలాలుసవరించు

  1. "Ok Bangaram Movie Review - Enduring vs fleeting". indiaglitz. 17 April 2015. Retrieved 18 April 2015.
  2. రావూరి, గణేష్. "సినిమా రివ్యూ: ఓకే బంగారం". గ్రేట్ ఆంధ్రా.కాం. Retrieved 19 April 2015.
  3. విజయ్. "రివ్యూ : ఓకే బంగారం సమీక్ష". పల్లీబటానీ.కాం. Archived from the original on 21 ఏప్రిల్ 2015. Retrieved 19 April 2015.

బయటి లంకెలుసవరించు