ఆరెంజ్ 2010 నవంబరు 26 న విడుదలైన తెలుగు ప్రేమకథా చిత్రము. ఇందులో రామ్ చరణ్ తేజ, జెనీలియా, షాజన్ పదంసీ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, చిత్రానువాదం, దర్శకత్వం భాస్కర్. నిర్మాత కే నాగేంద్ర బాబు. హ్యారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చాడు.

ఆరెంజ్
దర్శకత్వంభాస్కర్
రచనభాస్కర్
నిర్మాతకొణిదల నాగేంద్రబాబు
తారాగణంరామ్ చరణ్ తేజ
వెన్నెల కిశోర్
జెనీలియా
షాజాన్ పదమ్సీ
సంచిత శెట్టి
ప్రభు
ఛాయాగ్రహణంకిరణ్ రెడ్డి
బి. రాజశేఖర్
కూర్పుమార్తాండ్.కె.వెంకటేశ్
సంగీతంహేరిస్ జయరాజ్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుగీతా ఆర్ట్స్
విడుదల తేదీ
26 నవంబరు 2010 (2010-11-26)
సినిమా నిడివి
160 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు
బడ్జెట్40 crore (US$5.0 million)[1]

ప్రేమికుల్లో ఒకరు ..అవతలి వారిపై తమ ఇష్టా ఇష్టాలు రుద్దేయటం కామన్ గా అందరి జీవితాల్లో జరిగే అంశమే.అయిగే మన జీవిత ఆనందాలని త్యాగం చేసి వారి ఇష్టాలని మన ఇష్టాలుగా మార్చుకోవటమా లేక అలాగే నీ ఇష్టమే నా ఇష్టం అని అబద్దమాడి రోజులు నెట్టడమా అనే పాయింట్ ఆధారం చేసుకునే దర్శకుడు ఆరెంజ్ కథ మొదలెట్టాడు.

ఆస్ట్రేలియా సిడ్నీలో ఉండే రామ్ (రాంచరణ్).. గోడలపై రకరకాల బొమ్మలు వేస్తుంటాడు (గ్రాఫిటీ ఆర్టిస్ట్). ఇది అతని హ్యాబీ. అసలు పని ఛాయాగ్రహణం పేరుతో వయొలెంట్ ఛాయాగ్రహణం నేర్చుకోవడం అంటే జియోగ్రఫీ ఛానల్‌లో మాదిరి వాటిని ఫోటోలు తీయడం, స్కైడైవింగ్ చేయడం చేస్తుంటాడు. రామ్ జీవితంలో భార్యాభర్తలైన కృష్ణ కుమార్తె మంజుల, సంజయ్‌‌లు అక్క బావలు. ఇంకా తన చుట్టూ ఇద్దరు స్నేహితులు.

ఇక రామ్‌ అందరూ ప్రేమలో పడటాన్ని చూసి మీది నిజమైన ప్రేమ కాదని వాదిస్తాడు. ప్రేమంటే నిజం చెప్పడం. అబద్ధంతో ప్రేమించినా అది జీవితాంతం ఉండదనే పాలసీ చెబుతాడు. ఎంతకాలం నిలబడితే అదే చాలు అంటాడు. అలా తొమ్మిది మంది రామ్‌ను ప్రేమించి విసిగి వదిలేస్తారు.

పదవ అమ్మాయిగా జాను (జెనీలియా) కెమెస్ట్రీ మూడో సంవత్సరం చదివేందుకు కో ఎడ్యుకేట్ కాలేజీలో చేరుతుంది. అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ప్రేమించుకోవడం జానుకు చాలా థ్రిల్ కలిగిస్తుంది. తను అలా ఎవరినైనా ప్రేమించాలనుకుని ముగ్గురిని ప్రపోజ్ చేస్తుంది.

కానీ మొదటిచూపులో జానును ప్రేమించిన రామ్ తను ప్రేమిస్తున్నానని చెబుతాడు. అయితే కొద్దికాలమేనని మతలబు పెడతాడు. అలా ఎందుకన్నానో కొన్ని ఉదాహరణలు చూపిస్తాడు. ఆఖరికి ప్రేమించి పెళ్ళిచేసుకున్న మీ తల్లిందండ్రులు కూడా ప్రస్తుతానికి ప్రేమించుకోవడం లేదని నిరూపిస్తాడు. తను ప్రేమించలేదని తెలిసినా జానును రామ్ ప్రేమిస్తున్నానని రకరకాల ప్రయత్నాలతో తనవైపు తిప్పుకుంటాడు. తీరా జాను ప్రేమించానన్నాక నేను జీవితంలో ప్రేమించలేదంటాడు.

ఇలా రామ్‌ను పిచ్చోడని డిసైడ్ అవుతారు. కానీ తను చెప్పినదాంట్లో న్యాయముందని జాను తండ్రి (ప్రభు) ఫైనల్‌గా అంచనాకు వస్తాడు. ఎవరైనా ప్రేమించిన కొత్తలో బాగానే ప్రేమించుకుంటారు. ఆ తర్వాత పిల్లలను ప్రేమిస్తారు. కానీ నిజమైన ప్రేమ తర్వాత ఉండదు. ప్రేమిస్తున్నట్లు ఒకరికొకరు అబద్ధాలు ఆడుకుంటారు.? దానికి ఏం చేయాలి? అనేది ముగింపు.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "సిడ్ని నగరం"  కారుణ్య 5:38
2. "చిలిపిగా"  కార్తిక్ 5:30
3. "నెను నువ్వంటు"  నరేష్ అయ్యారు 4:51
4. "హలో రమ్మంటే"  విజయ్ ప్రకాష్ 4:45
5. "ఓ'రేంజ్"  బెన్నీ దయాల్ 4:16
6. "రూబా రూబ"  శైల్ హద 5:18
18:52

ప్రీ -రిలీజ్ వ్యాపారం

మార్చు
''ఆరెంజ్ ప్రీ -రిలీజ్ వ్యాపారం[4]
రెవెన్యూ (ప్రాంతాలు) ధర
సాటిలైట్ హక్కులు (మాటీవీ) 7 కోట్లు
నిజాం హక్కులు 12 కోట్లు
సీడెడ్ హక్కులు 7.2 కోట్లు
నెల్లూరు హక్కులు 1.5 కోట్లు
గుంటూరు హక్కులు 2.75 కోట్లు
కృష్ణా జిల్లా హక్కులు 5 కోట్లు
ఉత్తరాంధ్ర హక్కులు 3.3 కోట్లు
తూర్పు గోదావరి హక్కులు 2.6 కోట్లు
పశ్చిమ గోదావరి హక్కులు 2.5 కోట్లు
కర్నాటక హక్కులు 4.5 కోట్లు
ఓవర్సీస్ హక్కులు 2.5 కోట్లు
ఆడియో హక్కులు 1 కోటి
మొత్తం 50 కోట్లు
  • ప్రింట్ మీడియా, టీ.వీ ప్రకటన ఖర్చులు మినహాయించి

పురస్కారాలు

మార్చు
అవార్డు వర్గం నామినేషన్ ఫలితం
ఫిలింఫేర్ అవార్ద్శ్ సౌత్ ఉత్తమ సంగీత దర్శకుడు హేరిస్ జయరాజ్ ప్రతిపాదించబడింది
మిర్చి మ్యుజిక్ అవార్ద్శ్ సౌత్ బెస్ట్ ఆల్బం ఆఫ్ ది ఈయర్ హేరిస్ జయరాజ్ గెలుపు
మిర్చి మ్యుజిక్ అవార్ద్శ్ సౌత్ మిర్చి ప్రేక్షకుల ఎంపిక (బెస్ట్ ఆల్బం) హేరిస్ జయరాజ్ గెలుపు
బిగ్ ఎఫ్.ఎం.అవార్ద్శ్ ఉత్తమ సంగీత దర్శకుడు హేరిస్ జయరాజ్ గెలుపు
బిగ్ ఎఫ్.ఎం.అవార్ద్శ్ ఉత్తమ ప్లేబాక్ సింగర్ కారుణ్య గెలుపు

మూలాలు

మార్చు
  1. Ram Charan Teja's Orange movie budget is about 40 crore rupees- Megastar, Prajarajyam Party President Chiranjeevi, Powerstar pawan Kalyan, Ram Charan Teja's aka Cherry complete details. a telugu film mega heroes mega portal Archived 2014-02-22 at the Wayback Machine. Cherryfans.com. Retrieved on 27 January 2016.
  2. The Times of India, Entertainment (15 June 2019). "Kalpika Ganesh of 'Sita on the Road' fame looks fabulous and droolworthy in her latest photo-shoot" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2020. Retrieved 21 May 2020.
  3. The Hindu, Entertainment (28 December 2018). "Driven by the love of cinema: Kalpika Ganesh". Y. Sunita Chowdhary. Archived from the original on 28 డిసెంబరు 2018. Retrieved 21 May 2020.
  4. 'Orange' pre release business Archived 2016-03-20 at the Wayback Machine. Nagfans.com (18 October 2010). Retrieved on 2016-01-27.