రాం చరణ్ తేజ

సినీ నటుడు
(రామ్ చరణ్ తేజ నుండి దారిమార్పు చెందింది)

కొణిదెల రామ్ చరణ్ తేజ భారత(pan india) నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను భారత సినిమా నటుడుగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ఓనరు మరియూ మా టీ.వీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడు[2].

కొణిదెల రామ్ చరణ్ తేజ

మే 2015లో ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో చరణ్
జన్మ నామంకొణిదెల రామ్ చరణ్ తేజ
జననం (1985-03-27) 1985 మార్చి 27 (వయసు 38)
India హైదరాబాదు
ఇతర పేర్లు చెర్రీ
భార్య/భర్త ఉపాసన
పిల్లలు క్లింకారా[1]
వెబ్‌సైటు http://www.cherryfans.com/
ప్రముఖ పాత్రలు చరణ్ (చిరుత)
కాళభైరవ,హర్ష(మగధీర)

రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్.టి.ఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[3]

వ్యక్తిగత జీవితం సవరించు

రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సొదరీమణులు శ్రీజ, సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని పరిణయమాడాడు.[4]

ఉపాస‌న‌ కొణిదెల అపోలో హాస్పిట‌ల్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌తాప్ సి. రెడ్డి మ‌న‌వ‌రాలు. ఆమె అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు కూడా. అపోలో ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాలుపంచుకునే ఉపాస‌న‌ సంపూర్ణ ఆరోగ్యం ప‌ట్ల అవగాహ‌న క‌ల్పిస్తూ ప‌లు వీడియోల‌ను సోషల్ మీడియాలో విడుద‌ల చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. 2022 సంవత్సరానికిగాను నాట్‌హెల్త్ సీఎస్ఆర్ అవార్డు వరించింది.[5]

సినీ జీవితం సవరించు

చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత (సినిమా) చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.

ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడా చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది.ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రేండింగ్ లో ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్ (సినిమా) చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి ఎవడు (సినిమా) చిత్రంలో నటించాడు. తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ (సినిమా) చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమేక్. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే నటించాడు.2015 లో శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ లో నటించాడు అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.2016 లో వచ్చిన ధృవ చిత్రం తో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు.2018 లో వచ్చిన రంగస్థలం చిత్రం లో చెవిటి వాడిగా నటించి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు ఆ చిత్రం విజయం తో పాటు ఎన్నో రికార్డులు తిరగరాసింది.2019 లో జనవరిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలోవినయ విధేయ రామ చిత్రంలో నటించారు.

నటించిన చిత్రాలు సవరించు

సంవత్సరం చిత్రం పాత్ర కథానాయిక ఇతర విశేషాలు
2007 చిరుత చరణ్ నేహా శర్మ విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు

విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం

2009 మగధీర హర్ష

కాళభైరవ

కాజల్ అగర్వాల్ విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు

విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం

2010 ఆరెంజ్ రాం జెనీలియా
2011 రచ్చ "బెట్టింగ్" రాజ్ తమన్నా
2013 నాయక్ చరణ్

సిద్దార్థ్ నాయక్

కాజల్ అగర్వాల్

అమలా పాల్

2013 తుఫాన్ (జంజీర్) విజయ్ ప్రియాంక చోప్రా తొలి హిందీ చిత్రం. తెలుగులో తుఫాన్‌గా అనువదించబడింది
2014 ఎవడు సత్య

చరణ్

శృతి హాసన్
2014 గోవిందుడు అందరివాడేలే అభిరామ్ కాజల్ అగర్వాల్
2015 బ్రూస్ లీ - ది ఫైటర్ కార్తీక్ రకుల్ ప్రీత్ సింగ్
2016 ధృవ ధ్రువ రకుల్ ప్రీత్ సింగ్
2017 ఖైదీ నెంబర్ 150 అతిథి పాత్ర అమ్మడు లెట్స్ డూ కుమ్మూడు పాటలో కనిపిస్తాడు
2018 రంగస్థలం చిట్టిబాబు సమంత అక్కినేని
2019 వినయ విధేయ రామ రామ కైరా అద్వానీ (నటి)
2022 రౌద్రం రణం రుధిరం అల్లూరి సీతారామరాజు ఆలియా భట్
2023 కిసీ కా భాయ్ కిసీ కా జాన్ హిందీ పాట అతిధి పాత్రలో [6]
గేమ్ ఛేంజర్ కే. రామ్ నందన్ తెలుగు నిర్మాణంలో ఉంది


నిర్మాతగా సవరించు

సంవత్సరం చిత్రం తారాగణం బాష దర్శకుడు
2017 ఖైదీ నెంబర్ 150 చిరంజీవి, కాజల్ అగర్వాల్ తెలుగు వి. వి. వినాయక్
2018 Sye Raa Narasimha Reddy చిరంజీవి, నయన తార తెలుగు సురేందర్ రెడ్డి

గాయకునిగా సవరించు

సంవత్సరం పాటలు చిత్రం సంగీత దర్శకుడు బాష Singer(s)
2013 "Mumbai Ke Hero" తుఫాన్ (సినిమా) Chirantan Bhatt తెలుగు రాం చరణ్,

Jaspreet Jasz, Roshni Baptist

పురస్కారాలు సవరించు

సైమా అవార్డులు

వనరులు సవరించు

  1. TV9 Telugu (30 June 2023). "రామ్ చరణ్, ఉపాసన కూతురి పేరు ఇదే.. ట్వీట్ చేసిన చిరంజీవి." Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.
  2. https://web.archive.org/web/20140528005740/http://maatv.com/corporate#tabs-3
  3. https://www.thehansindia.com/cinema/tollywood/ram-charan-and-junior-ntr-are-over-joyed-with-oscars-2023-win-and-shared-their-excitement-with-heartfelt-posts-787585
  4. "Ram Charan marries Upasana Kamineni". The Times of India. Archived from the original on 2013-10-04.
  5. "స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌కి - 'నాట్ హెల్త్ సీఎస్ ఆర్' అవార్డ్". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-30. Retrieved 2022-03-30.
  6. "Salman Khan reveals how Ram Charan convinced him for a cameo in Kisi Ka Bhai Kisi Ji Jaan". Hindustan Times (in ఇంగ్లీష్). 3 October 2022. Retrieved 2023-01-30.

బయటి లింకులు సవరించు