ఆషాఢమాసము

(ఆషాడమాసము నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు.

అధిక ఆషాఢమాసము వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాధ ఆలయంలోని మూలవిరాట్టుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్ని 'నవకళేబర ఉత్సవం' అంటారు.

విశేషాలు

మార్చు

ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు.ఆహారంలో మునగకాయను విరివిగా వాడాలంటారు.శుద్ధ ఏకాదశినే మహా ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే ప్రథమైకాదశి అని కూడా అంటుంటారు. తెలుగునాట ఇది తొలి ఏకాదశి . పేలపిండి తింటారు.ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ జీవితాన్ని గడపటం కోసం పూజలు, వ్రతాలుతో, నవ దంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు.ఆషాఢమాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మనదేశంలోని హైందవేతర మతస్తులు కూడా కొన్నిచోట్ల పాటిస్తుంటారు.

హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో బోనాలు పండుగ జరుపుకోబడుతుంది.

పండుగలు

మార్చు
ఆషాఢ శుద్ధ పాడ్యమి *
ఆషాఢ శుద్ధ విదియ పూరీ జగన్నాధ రథయాత్ర
ఆషాఢ శుద్ధ తదియ *
ఆషాఢ శుద్ధ చతుర్థి *
ఆషాఢ శుద్ధ పంచమి అల్లూరి సీతారామరాజు జననం
ఆషాఢ శుద్ధ షష్ఠి *
ఆషాఢ శుద్ధ సప్తమి *
ఆషాఢ శుద్ధ అష్టమి *
ఆషాఢ శుద్ధ నవమి *
ఆషాఢ శుద్ధ దశమి *
ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలిఏకాదశి
ఆషాఢ శుద్ధ ద్వాదశి *
ఆషాఢ శుద్ధ త్రయోదశి *
ఆషాఢ శుద్ధ చతుర్దశి గోదాదేవి జన్మించింది.
ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి
ఆషాఢ బహుళ పాడ్యమి *
ఆషాఢ బహుళ విదియ *
ఆషాఢ బహుళ తదియ *
ఆషాఢ బహుళ చవితి సంకట హర చతుర్ధి
ఆషాఢ బహుళ పంచమి *
ఆషాఢ బహుళ షష్ఠి *
ఆషాఢ బహుళ సప్తమి *
ఆషాఢ బహుళ అష్టమి *
ఆషాఢ బహుళ నవమి *
ఆషాఢ బహుళ దశమి *
ఆషాఢ బహుళ ఏకాదశి కామఏకాదశి
ఆషాఢ బహుళ ద్వాదశి *
ఆషాఢ బహుళ త్రయోదశి *
ఆషాఢ బహుళ చతుర్దశి మాసశివరాత్రి
ఆషాఢ బహుళ అమావాస్య *

మూలాలు

మార్చు
  1. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 12. Retrieved 26 June 2016.
  2. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 40. Retrieved 27 June 2016.
  3. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 61. Retrieved 27 June 2016.