ఇంటెల్లిగ్రూప్, ఇంక్, ఇంఫర్మేషన్ టెక్నాలజీ సేవలని, సొల్యూషన్లని అందించే ఒక సంప్రదింపు సంస్థ. అక్టోబరు 1987 లో ఇంటెల్లికార్ప్ పేరుతో సిస్టంస్ ఇంటెగ్రేషన్, కస్టం సాఫ్ట్ వేర్ సేవలని అందించే సంస్థగా నెలకొల్పబడ్డది. జూలై 1992 లో సంస్థ పేరు ఇంటెల్లిగ్రూప్ గా మార్చ బడ్డది.

ఇంటెల్ ప్రధాన కార్యాలయం

జూన్ 2010 లో ఇంటెల్లిగ్రూప్ ని జపాన్కి చెందిన ఎన్ టి టి డాటా సొంతం చేసుకొన్నది. అమెరికా, ఐరోపా, ఇండియా, మధ్య ప్రాచ్యం, ఏషియా పసిఫిక్, జపాన్ లలో కార్యకలాపాలు గల ఇంటెల్లిగ్రూప్, 2,500 మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఇండియాలో హైదరాబాదు, బెంగళూరు కేంద్రాలుగా పనిచేస్తున్నది.

మర్జర్లు

మార్చు
2007 ఫిబ్రవరి 7 న క్యారిటర్ కీన్ని సొంతం చేసుకొన్నది. కానీ అప్పటి నుండి క్యారిటర్ కూడా కీన్ పేరుతో నే చలామణి అయినది.
2010 జూన్ 14 న ఎన్ టీ టీ డాటా, ఇంటెల్లిగ్రూప్ ని కొన్నది.
2011 జనవరి 3 న ఎన్ టీ టీ డాటా, కీన్ ని సొంతం చేసుకొన్నది.

బాహ్య లంకెలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు