ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్

పశ్చిమ బెంగాల్‌లోని రాజకీయ పార్టీ

ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అనేది పశ్చిమ బెంగాల్‌లోని రాజకీయ పార్టీ. హుగ్లీ జిల్లాలోని ఫుర్ఫురా షరీఫ్ పుణ్యక్షేత్ర మతాధికారి అబ్బాస్ సిద్ధిఖీ ఈ పార్టీని స్థాపించాడు.[1]

ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్
Chairpersonనౌసాద్ సిద్ధిక్
స్థాపకులుఅబ్బాస్ సిద్ధిఖీ
స్థాపన తేదీ21 జనవరి 2021 (3 సంవత్సరాల క్రితం) (2021-01-21)
రాజకీయ విధానంమైనారిటీ హక్కులు
ECI Statusగుర్తించబడలేదు
కూటమిసంజుక్త మోర్చా (2021-2024)
లోక్‌సభ స్థానాలు
0 / 543
రాజ్యసభ స్థానాలు
0 / 245
శాసన సభలో స్థానాలు
1 / 294
Election symbol
Party flag

చరిత్ర మార్చు

2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పార్టీ స్థాపించబడింది.[2] తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్ ఫ్రంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్[3] నేతృత్వంలోని సంజుక్త మోర్చా[3] లో చేరింది.[4] పార్టీ 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో 38 స్థానాల్లో పోటీ చేసి 1 స్థానంలో గెలిచింది.[5] బీహార్ ఆధారిత రాజకీయ పార్టీ అయిన రాష్ట్రీయ సెక్యులర్ మజ్లిస్ పార్టీ అరువు తెచ్చుకున్న గుర్తుపై పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎన్నికల తర్వాత, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధినేత అధిర్ రంజన్ చౌదరి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తో పొత్తుకు ముగింపు పలికారు.[6]

భావజాలం మార్చు

'సెక్యులర్' అని చెప్పుకుంటున్నప్పటికీ, రాజకీయ విశ్లేషకుడు ప్రసేన్‌జిత్ బోస్ పార్టీని 'కమ్యూనల్'గా అభివర్ణించారు.[7]

ఎన్నికల్లో పోటీ మార్చు

2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల కోసం, ఈ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో సంజుక్త మోర్చా అనే కూటమిలో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ నుంచి నౌసాద్ సిద్ధిఖ్ ఒక్కరే ఎమ్మెల్యే.

ఎన్నికల సంవత్సరం పార్టీ నాయకుడు పోటీచేసిన సీట్లు గెలుచిన సీట్లు సీట్లలో మార్పు ఓట్ల శాతం ఓట్ల మార్పు జనాదరణ పొందిన ఓటు
2021 నౌసాద్ సిద్ధిక్ [8] 32 [9] 1   1 1.35% N/A 813,489

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Want To Be Kingmaker": Muslim Preacher Announces Party For Bengal Polls". 21 January 2021.
  2. Wire.in, The (28 Feb 2021). "Bengal: As Left and Congress Ally With Muslim Cleric's Party, Will BJP Be the Winner?".
  3. 3.0 3.1 India, Outlook (February 28, 2021). "With Brigade Rally, Left-Congress-ISF's 'Sanyukta Morcha' Kicks Of Bengal Poll Campaign". Outlook.India.
  4. "West Bengal: In Left-Congress Brigade Ground Rally, ISF Emerged as the Biggest Mobiliser". The Wire. Retrieved 2021-03-02.
  5. "30-seat deal with Left: ISF cleric Abbas Siddiqui". www.telegraphindia.com. Retrieved 2021-03-02.
  6. "Bengal Congress chief Adhir Chowdhury does not want ISF as an ally in future - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 10 May 2021. Retrieved 2021-05-17.
  7. George, Varghese K. (2021-03-27). "Abbas Siddiqui | Perilous pursuits". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-09-09.
  8. "ISF to fight polls on borrowed symbol". Millennium Post. 18 March 2021. Retrieved 29 March 2021.
  9. "West Bengal General Legislative Election 2021". Election Commission of India. 21 June 2021. Retrieved 8 January 2022.