ఇంద్రజిత్‌సిన్హ్‌జీ

కుమార్ శ్రీ ఇంద్రజిత్‌సిన్హ్‌జీ మాధవసింగ్‌జీ (1937 జూన్ 15 - 2011 మార్చి 12) వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా 1964 నుండి 1969 వరకు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో ఆడిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.

ఇంద్రజిత్‌సిన్హ్‌జీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కుమార్ శ్రీ మాధవ్‌సింహ్‌జీ జడేజా ఇంద్రజిత్‌సిన్హ్‌జీ
పుట్టిన తేదీ(1937-06-15)1937 జూన్ 15
జామ్‌నగర్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2011 మార్చి 12(2011-03-12) (వయసు 73)
ముంబై
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపరు
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 109)1964 అక్టోబరు 2 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1969 అక్టోబరు 15 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 4 90
చేసిన పరుగులు 51 3694
బ్యాటింగు సగటు 8.50 26.76
100లు/50లు 0/0 5/16
అత్యధిక స్కోరు 23 124
క్యాచ్‌లు/స్టంపింగులు 6/3 133/80
మూలం: Cricinfo, 2011 మార్చి 17

తొలి జీవితం మార్చు

ఇంద్రజిత్‌సిన్హ్జీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జన్మించారు. అతను రాజ్‌కుమార్ కాలేజీ, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకున్నాడు.

కెరీర్ మార్చు

అతను ఢిల్లీ, సౌరాష్ట్రల తరపున 1954 నుండి 1973 వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. అతను రంజీ ట్రోఫీలో 100 అవుట్‌లను (క్యాచ్ లేదా స్టంప్డ్) దాటిన మొదటి వికెట్ కీపర్‌లలో ఒకడు. 1960-61 సీజన్‌లో ఒక సంవత్సరంలో పోటీలో 23 అవుట్‌లు చేసి రికార్డు సృష్టించాడు.

భారత దేశవాళీ క్రికెట్‌లో అతను నిష్ణాతుడైన వికెట్ కీపరే ఐనప్పటికీ, ఫరోఖ్ ఇంజనీర్, బుద్ధి కుందరన్‌లతో పోటీలో అతను వెనకబడి పోయాడు. భారత జట్టుకు పెద్దగా ఆడలేకపోయాడు. 1964-65లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు-మ్యాచ్‌ల సిరీస్,[1] ఇంజనీర్ గాయపడినప్పుడు 1969-70లో హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఒక టెస్టు[2] - ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

అతని తాత, మోహన్‌సిన్హ్‌జీ రంజిత్‌సిన్హ్‌జీకి సోదరుడు, దులీప్‌సిన్హ్‌జీకి మామ వాళ్ళిద్దరూ కూడా టెస్ట్ క్రికెట్ ఆడారు. అతని బంధువులలో సూర్యవీర్ సింగ్, హనుమంత్ సింగ్ ఉన్నారు. అతను రాజ్‌కోట్‌లోని రాజ్‌కుమార్ కాలేజీలో చదువుకున్నాడు.

మూస:Descendants of Jivansinhji

మూలాలు మార్చు

  1. ESPNcricinfo. "1st Test, Australia tour of India at Chennai, Oct 2-7 1964 | Match Summary | ESPNCricinfo". Retrieved 15 June 2018.
  2. ESPNCricinfo. "3rd Test, New Zealand tour of India at Hyderabad, Oct 15-20 1969 | Match Summary | ESPNCricinfo". Retrieved 15 June 2018.