ఇంద్రావతి చౌహాన్

ఇంద్రావతి చౌహాన్ - ఒక భారతీయ నేపథ్య గాయని, ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనాత్మక పాటలకు ప్రసిద్ధి చెందింది. ఆమె పుష్ప: ది రైజ్ (2021) చిత్రం కోసం బ్లాక్‌బస్టర్ ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ పాడిన తర్వాత ఇంటర్నెట్ సంచలనంగా మారింది.[1]

ఇంద్రావతి చౌహాన్‌ మాస్‌ వాయిస్‌తో ఆలపించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చగా చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఇక గతంలో హీరోయిన్ సమంత ఐటెం సాంగ్స్‌ చేయకపోవడం, పైగా అల్లు అర్జున్ తో అనగానే ఆ క్రేజ్‌ రెట్టింపు అయింది.

బాల్యం

మార్చు

ఇంద్రావతి చౌహాన్‌ 1996 మార్చి 5న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోని గుత్తి మండలం బసినేపల్లె తాండలో బల్లు నాయక్, లక్ష్మీ దేవి దంపతులకు జన్మించారు.

వీరికి మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్‌, వెంకటలక్ష్మి .. ముగ్గురు అమ్మాయిలతో పాటు ఒక అబ్బాయి శివ చౌహాన్ సంతానం. ఇంద్రావతి చౌహాన్‌ బంజారా కమ్యూనిటీకి చెందినది. ఆమె మాతృభాష గోర్ బోలి (లంబాడీ). ఇది లిపి లేని కారణంగా ప్రసిద్ధి చెందింది. జిల్లా కేంద్రంలో భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల చదువు, శ్రీ వెంకటేశ్వర కళాశాలలో డిప్లొమా పూర్తిచేసారు.[2]

జీవిత విశేషాలు

మార్చు

ఇంద్రావతి చౌహాన్‌ ఫోక్ సింగర్, సినీ నేపథ్య గాయని మంగ్లీ (సత్యవతి) చెల్లెలు. ఆమె కూడా జానపద పాటలు పాడుతారు. నర్తకి కూడా. సంగీత దర్శకుడు కోటి న్యాయ నిర్ణేతగా ‘బోల్ బేబీ బోల్’ రియాలిటీ షోలో పాడారు. జార్జిరెడ్డి సినిమాలో జాజిమొగులాలి అనే పాట పాడారు.[3]

గుర్తింపు

మార్చు

ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్ ‘బిహైండ్ వుడ్’ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో భాగంగా 2022 మే 22న ఈ ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాలు, సినీకళాకారులకు కు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనుంది. అందులో భాగంగా బెస్ట్ సింగర్ విభాగంలో ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మావా.. ఉఊ.. అంటావా మావా’ పాటను ఆలపించిన ఇంద్రావతి చౌహాన్‌ ఎంపిక అయింది.[4]

మూలాలు

మార్చు
  1. "Pushpa Item song : పుష్ప ఐటెం సాంగ్.. ఎవరీ ఇంద్రావతి చౌహాన్?". web.archive.org. 2022-04-26. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Samantha Item Song: Do You Know About Singer Indravati Chauhan - Sakshi". web.archive.org. 2022-04-26. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Samantha Item Song: Do You Know About Singer Indravati Chauhan - Sakshi". web.archive.org. 2022-04-26. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "'ఊ.. అంటావా..' పాట సింగర్‌కు Goldmedal". web.archive.org. 2022-05-17. Archived from the original on 2022-05-17. Retrieved 2022-05-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)