పుష్ప
పుష్ప 2021లో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్, రష్మికా మందన్న, ఫహాద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 17న విడుదలైంది. ఈ సినిమా 7 జనవరి 2022న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.[2][3]
పుష్ప : ది రైజ్ – పార్ట్ 1 | |
---|---|
దర్శకత్వం | సుకుమార్ |
రచన | సుకుమార్ |
నిర్మాత | నవీన్ యెర్నేని వై. రవి శంకర్ |
తారాగణం | అల్లు అర్జున్ , రష్మికా మందన్న ఫహాద్ ఫాజిల్ సునీల్ శెట్టి, అర్షద్ ఖాన్ |
ఛాయాగ్రహణం | మీరోస్లా కూబా బ్రోజెక్ |
కూర్పు | కార్తీక శ్రీనివాస్ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థలు | మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా |
విడుదల తేదీ | డిసెంబరు 17, 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 250 కోట్లు [1] |
69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో పుష్ప: ది రైజ్ సినిమాకు ఉత్తమ నటుడు (అర్జున్), ఉత్తమ సంగీత దర్శకత్వం (ప్రసాద్) విభాగాల్లో 2 అవార్డులను గెలుచుకుంది.[4] 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో, ఈ చిత్రం ఉత్తమ నటి – తెలుగు (మందన్న)తో సహా 8 నామినేషన్లను అందుకుంది.ఉత్తమ చిత్రం – తెలుగు, ఉత్తమ దర్శకుడు – తెలుగు (సుకుమార్), ఉత్తమ నటుడు – తెలుగు (అర్జున్) సహా 7 అవార్డులను గెలుచుకుంది.[5]
చిత్ర నిర్మాణం
మార్చుఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2019న ప్రారంభమైంది.[6] ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా 2020 మార్చి లో పడిన తరువాత ఏడు నెలల అనంతరం తిరిగి 2020 అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా 2020 మార్చి లో పడిన తరువాత ఏడు నెలల అనంతరం తిరిగి 2020 నవంబర్ లో రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ ప్రారంభించారు.[7] ఈ సినిమా టీజర్ ను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా 7 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.[8]‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా రానున్నట్టు ‘‘పుష్ప పార్ట్ 1’ ను 2020 డిసెంబరు 17వ తారీఖున విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.[9]
నటీనటులు
మార్చు- అల్లు అర్జున్[10]
- రష్మికా మందన్న
- ఫహాద్ ఫాజిల్[11]
- జగదీష్ ప్రతాప్ బండారి
- సునీల్
- అనసూయ భరధ్వాజ్[12]
- అజయ్ ఘోష్
- సమంత - ‘ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా’ అనే ప్రత్యేక గీతంలో [13]
- బ్రహ్మాజీ
- రావు రమేష్
- అజయ్
- మైమ్ గోపి
- రాజశేఖర్ అణిగి
- రాజ్ తిరందాస్
- ధనంజయ
- షణ్ముఖ్
- కల్పలత[14]
- అనష్వి రెడ్డి[15]
- దయానంద్ రెడ్డి
- అజయ్ మంకెనపల్లి
- అంబానీ శంకర్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా
- నిర్మాత: నవీన్ యెర్నేని
వై. రవి శంకర్ - కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్
- సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
- సినిమాటోగ్రఫీ: మీరోస్లా కూబా బ్రోజెక్సో
- సౌండ్ డిజైనర్: రసూల్ పూకుట్టీ [16]
- కొరియోగ్రఫీ: విజయ్ పొలంకి [17]
పాటలు
మార్చుఈ చిత్రం లోని అన్ని పాటలు రచించింది, కూర్చింది చంద్రబోస్.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "దాక్కో దాక్కో మేక" | శివమ్ | 4:55 | ||||||
2. | "శ్రీవల్లి" | సిద్ శ్రీరామ్ | 3:41 | ||||||
3. | "ఊ అంటావా ఊ ఊ అంటావా" | ఇంద్రావతి చౌహాన్ | 3:43 | ||||||
4. | "సామి సామి" | మౌనిక యాదవ్ | 3:43 | ||||||
5. | "ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా" | నాకాష్ అజిజ్ | 3:54 | ||||||
19:58 |
పురస్కారాలు
మార్చు2022 ఫిబ్రవరి 20న ముంబైలో నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2022 లో పుష్ప : ది రైజ్ సినిమాకు మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది.[18] బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో భారతీయ సినిమా తరఫున ఈ సినిమాను ప్రదర్శించారు.[19]
ఫిలింఫేర్ అవార్డులు
మార్చుపుష్ప సినిమా 67వ ఫిలింఫేర్ అవార్డుల్లో మొత్తం ఏడు అవార్డులను గెలుచుకుంది.[20]
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ నటుడిగా
- ఉత్తమ దర్శకుడిగా సుకుమార్
- ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్
- ఉత్తమ కెమెరామెన్‌గా కుబా
- ఉత్తమ గాయకుడు సిధ్ శ్రీరామ్ (శ్రీ వల్లి పాట)
- ఉత్తమ గాయని ఇంద్రావతి (ఊ అంటావా పాట)
సైమా అవార్డులు
మార్చు2021 సైమా అవార్డులు (తెలుగు)
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ దర్శకుడు
- ఉత్తమ నటుడు
- ఉత్తమ సహాయనటుడు (జగదీష్ ప్రతాప్ బండారి)
- ఉత్తమ సంగీత దర్శకుడు
- ఉత్తమ గీత రచయిత (చంద్రబోస్ - శ్రీవల్లి)
మూలాలు
మార్చు- ↑ "Allu Arjun's Pushpa Movie: 5 things you need to know about Allu Arjun starrer 'Pushpa'". 12 May 2021.
- ↑ Sakshi (6 January 2022). "'పుష్ప' ఓటీటీ రిలీజ్‌కు అమెజాన్ ఒప్పందం ఎంతో తెలుసా? షాకవ్వాల్సిందే." Archived from the original on 6 జనవరి 2022. Retrieved 6 January 2022.
- ↑ Sakshi (7 January 2022). "ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.
- ↑ "69th National Film Awards 2023 complete winners list: Rocketry, Alia Bhatt, Kriti Sanon, Allu Arjun win big". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-24. Retrieved 2023-08-24.
- ↑ "67th Parle Filmfare Awards South 2022: Complete winners list". The Times of India. 2022-10-10. ISSN 0971-8257. Retrieved 2023-08-24.
- ↑ The Times of India (30 October 2019). "#AA20 Pooja Ceremony: Allu Arjun will romance Rashmika Mandanna in this Sukumar directorial - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
- ↑ Sakshi (12 November 2020). "కూలీ టు స్మగ్లర్". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
- ↑ Namasthe Telangana (7 April 2021). "పుష్పరాజ్ వచ్చేశాడు..టీజర్" (in telugu). Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ EENADU (3 August 2021). "Pushpa: 'పుష్ప' పార్ట్ 1 విడుదల తేదీ ఖరారు". Archived from the original on 3 August 2021. Retrieved 4 August 2021.
- ↑ Eenadu (16 January 2022). "'పుష్ప' తెచ్చిన క్రేజ్.. ఇన్‌స్టాలో అల్లు అర్జున్ రికార్డు". Retrieved 17 January 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (15 July 2021). "లక్కీగా వారిద్దరితో నటించే చాన్స్ వచ్చింది, హ్యాపీ: ఫాహద్ ఫాజిల్". Sakshi. Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
- ↑ Namasthe Telangana (3 December 2021). "పుష్ప సినిమాలో అనసూయ సంచలన పాత్ర.. దాక్షాయణి ఎలా ఉండబోతుందంటే..?". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
- ↑ Andhrajyothy (12 January 2022). "బన్నీ వల్లే నేను ఊ.. అన్నాను : సమంత". chitrajyothy. Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ TV5 News (22 December 2021). "'పుష్ప'లో అల్లు అర్జున్ కి మదర్ గా నటించింది ఈమె.. ఎంత స్టైలిష్ గా ఉందో చూడండి" (in ఇంగ్లీష్). Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV5 News (14 March 2022). "'అన్నో.. నేనొచ్చి ఇచ్చేదా ముద్దు'.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు?" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Academy Award winning Sound designer for Allu Arjun's Pushpa". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-04-07. Retrieved 2021-12-21.
- ↑ Sakshi (10 January 2022). "'ఊ అంటావా మావ, ఉ ఊ అంటావా మావ' కొరియోగ్రాఫర్‌కు ఆఫర్స్". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
- ↑ Eenadu (21 February 2022). "అట్టహాసంగా 'దాదా ఫాల్కే' అవార్డుల వేడుక.. మూవీ ఆఫ్ ది ఇయర్‌గా 'పుష్ప'". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
- ↑ "Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం". EENADU. Retrieved 2024-02-15.
- ↑ "తగ్గేదేలే.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో 'పుష్ప' క్లీన్‌స్వీప్." 10 October 2022. Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.