మంగ్లీ (సత్యవతి)

వర్థమాన టీవీ వాఖ్యాత,జానపద, సినీ గాయని, సినీ నటి.

మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2] మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్‌వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటుంది.[3][4]

మంగ్లీ (సత్యవతి చౌహన్ )
Mangli Singer.jpg
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిన్యూస్ ప్రజెంటర్, వ్యాఖ్యాత, నటి
క్రియాశీల సంవత్సరాలు2014 -ప్రస్తుతం
బంధువులుఇంద్రావతి చౌహాన్ (చెల్లెలు) [1]

జననం, బాల్యంసవరించు

మంగ్లీ అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది. తాండలోనే 5వ తరగతి చదివింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది. RDT (Rural Development Trust) సంస్థ ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. ఆదే సంస్థ సలహాతో, ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకుంది. వారి ఆర్థిక సహాయంతోనే పదో తరగతి తర్వాత ఎస్. వి. విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరింది.[5]

జీవిత విశేషాలుసవరించు

RDT చొరవతో సంగీతం పై పట్టు పెంచుకొని తిరుపతి లోని సంగీత విద్యాలయంలో పూర్తి మెళకువలు నేర్చుకుంది. ఆ తరువాత తన కెరియర్ మొదలు పెట్టి తెలంగాణ లో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. మొదట జానపద గీతాలతో కెరియర్ మొదలు పెట్టిన మంగ్లీ.. తీన్మార్ పొగ్రాంతో టీవీ ఛానల్స్ లోకి ఎంటర్ అయి జనాలకు పరిచయమైంది.

మంగ్లీ గాసవరించు

ఒకసారి V6 టీవీ చానెల్ లో 'మాటకారి మంగ్లీ' అనే కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత చేసిన 'తీన్మార్' తీన్మార్ న్యూస్ తో మంగ్లీ పేరు తెలంగాణాలోని గడప గడపకీ చేరింది. అప్పుడే ఎంటర్ టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ టీవీ అవార్డు గెలుచుకుంది. కానీ ఇంత పేరు వచ్చినా తనకు ఇష్టమైన సంగీతానికి దూరమవుతున్నానన్న బాధ వుండేది. అందుకే టివీ నుండి బయటకు వచ్చి 'మైక్' టీవీ యూట్యూబ్ చానల్ లో చేరడం జరిగింది. అప్పుడే తెలంగాణా ఆవిర్భావ సందర్భంగా పాడిన "రేలా......రేలా....రే." పాట మంగ్లీని సెలబ్రటీ సింగర్ ని చేసింది. ఆ తర్వాత సినిమా పాటల రచయిత కాసర్ల శ్యామ్ ద్వారా సినిమా పాటలు కూడా పాడింది. అలా సినిమాలలో పాటలు పాడిన మంగ్లీ 'గోర్ జీవన్' అనే లంబాడీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. లంబాడా ఆడ పిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశమిచ్చే చిత్రం అది.[6]

నటించిన సినిమాలుసవరించు

పాడిన పాటల జాబితాసవరించు

మంగ్లీ పాడిన పాటల జాబితా ఇది:

సంవత్సరం ఛానలు పాట సంగీతం సాహిత్యం సహగాయకులు యూట్యూబ్‌లో వీక్షణలు
2018 మైక్ టీవీ బతుకమ్మ పాట బొబ్బిలి సురేష్ డా. నందిని సిధారెడ్డి 50+ లక్షలు
2018 మైక్ టీవీ గణేశ్ చతుర్థి అమీన్ కాసర్ల శ్యామ్ 20+ లక్షలు
2018 ఆదిత్య మ్యూజిక్ చూడే (శైలజారెడ్డి అల్లుడు సినిమా) కాసర్ల శ్యామ్‌ 16+ లక్షలు
2018 మైక్ టీవీ బోనాలు పాట బొబ్బిలి సురేష్ మట్ల తిరుపతి మట్ల తిరుపతి 100+ లక్షలు
2018 RTV బంజారా బంజారా తీజ్ పాట (గూగర బండలేనా) కళ్యాణ యాకూబ్ నాయక్ 34+ లక్షలు
2018 మైక్ టీవీ తెలంగాణ స్థాపక దినోత్సవం పాట బొబ్బిలి నందన్ డా. కందికొండ జంగిరెడ్డి 97+ లక్షలు
2018 మైక్ టీవీ కెసిఆర్ పాట రవివర్మ పోతేదార్ డా. కందికొండ 10 లక్షలు
2018 మైక్ టీవీ ఉగాది పాట బొబ్బిలి నందన్ డా. కందికొండ 45+ లక్షలు
2018 RTV బంజారా బంజారా పాట (బాపు వీరన్న కురవి వీరన్న) కళ్యాణ యాకూబ్ నాయక్ 42+ లక్షలు
2018 మైక్ టీవీ సమ్మక్క సారక్క మీనాక్షి భుజంగ్ డా. కందికొండ శిశిర 100+ లక్షలు
2018 మైక్ టీవీ సంక్రాంతి పాట బొబ్బిలి నందన్ డా. కందికొండ ర్యాపర్:మేఘ్-అహ్-వాట్(మేఘరాజ్) 22+ లక్షలు
2018 మ్యాంగో మ్యూజిక్ పార్వతి తనయుడవో (నీదీ నాదీ ఒకే కథ సినిమా) బొబ్బిలి సురేష్ డా. కందికొండ రంజని శివకుమార్ సిద్ధారెడ్డి, నరేష్,బొబ్బిలి సురేష్, శంకర్ బాబు 3+ లక్షలు
2017 మైక్ టీవీ తెలుగు మహాసభలు బతుకమ్మ పాట 2.5+ లక్షలు
2017 ఐ డ్రీమ్ బతుకమ్మ పాట పుల్లిగిళ్ళ ప్రమోద్ తైదల బాపు పుల్లిగిళ్ళ ప్రమోద్ 38+ లక్షలు
2017 తెలుగు వన్ ప్రత్యేక బతుకమ్మ పాట పోలం సత్య సాగర్ పోలం సత్య సాగర్ రాహుల్ సిప్లిగంజ్ 35+ లక్షలు
2017 మైక్ టీవీ బతుకమ్మ పాట బొబ్బిలి సురేష్ మిట్టపల్లి సురేందర్ సాకేత్ 300+ లక్షలు
2017 ఫ్యూచర్ ఫిల్స్మ్ అమ్మవా రాతిబొమ్మవా (జానపద గీతం) ముస్తఫా 110+ లక్షలు
2017 మైక్ టీవీ రేలా రే రేలా రే బొబ్బిలి నందన్ డా. కందికొండ లిప్సిక 160+ లక్షలు

పురస్కారాలుసవరించు

  1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[7]

మూలాలుసవరించు

  1. 10TV (10 December 2021). "సమంత ఐటమ్ సాంగ్ పాడిన మంగ్లీ చెల్లెలు.. ఆమె గురించి తెలుసా..? most awaited song of the year pushpa samtha item song sung by folk singer mangli sister indravathi chouhan" (in telugu). Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 March 2020. Retrieved 9 March 2020.
  3. TV9 Telugu (22 November 2022). "సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం.. ఎస్‌వీబీసీ ఛానెల్ సలహాదారుగా నియామకం." Archived from the original on 22 November 2022. Retrieved 22 November 2022.
  4. Zee News Telugu (21 November 2022). "మంగ్లీకి అరుదైన గౌరవం.. దశ మార్చేసిన 'జగనన్న' సాంగ్!". Archived from the original on 22 November 2022. Retrieved 22 November 2022.
  5. ఈనాడు, సినిమా (4 March 2020). "ఆ పాట తర్వాతే తొలి సారి ఫ్లైట్‌ ఎక్కాను." www.eenadu.net. Archived from the original on 9 March 2020. Retrieved 9 March 2020.
  6. "మంగ్లీ". ఈనాడు ఆదివారం 19, జనవరి. 2020.
  7. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 March 2020. Retrieved 9 March 2020.