ఇంధనం
(ఇంధనము నుండి దారిమార్పు చెందింది)
మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం (ఆంగ్లం: Fuel) అని అంటారు. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు.[1][2]
ఇది రెండు రకాలు.
- కర్బన ఇంధనం
- అకర్బన ఇంధనం
కర్బన ఇంధనాలు
మార్చువీటినే ఆర్గానిక్ ఇంధనాలు: (Organic Compounds) అని కూడా అంటారు.ఇందులో కర్బన పదార్ధం (Carbon Compound) ఉండును. వీటిలో చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- రాకాసి బొగ్గు - దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, రైలు నడవడం కోసం వాడతారు.
- కలప - వృక్షం యొక్క కాండపు భాగం.దీనిని వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పిను ఇంధనంగా వాడతారు.
- సాధారణ బొగ్గు - కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
- పెట్రోలు - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
- డీజీల్
- కిరోసిన్
- నాఫ్తా
- ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel) (A.T.F) - విమానాలు, హెలికాప్టర్ లలో వాడతారు.
- వంట గ్యాస్ - దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
- వెల్డింగ్ గ్యాస్ - దీనిలో అసిటలీన్ అనే వాయువు ఉండును. లోహాలు అతికించడానికి వాడతారు.
- జీవ ఇంధనం (బయో డీజీల్) - మొక్కల నుండి తయారుఛేస్తారు.
- ఆల్కహాల్ (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపంలో ఊయోగిస్తారు.
- కర్పూరం - హిందువుల పూజలలో హారతిగా వాడతారు. తిరుపతి లడ్డులో ఇది ఒక ముఖ్యమైన పదార్ధం. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
అకర్బన ఇంధనాలు
మార్చువీటిలో కార్బన పదార్థం (Carbon) ఉండదు.
అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- ఉదజని ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. అంతరిక్ష నౌక (రాకెట్) లో వాడతారు.
- కొన్ని రకాల బ్యాటరీ ( Fuel Cell ) లలో వాడతారు.
బాయిలరులలో నీటిని ఆవిరిగా మార్చుటకు ఇంధనాలను వాడతారు.బాయిలర్లలో పలురకాలు కలవు ఓడల్లో ఎక్కువగా కొక్రేన్ బాయిలరును ఉపయోగిస్తారు.అలాగే లాంకషైర్ బాయిలరులోకూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు.
ఇవి కూడా చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ప్రజాశక్తి, ఎడిఓరియల్ (14 December 2019). "ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ". www.prajasakti.com. జె.వి రత్నం. Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.
- ↑ ఈనాడు, జిల్లాలు (14 December 2019). "పొదుపు చేద్దాం ఇంధనాన్ని". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 14 డిసెంబరు 2019. Retrieved 14 December 2019.