ఇచ్చోడ

తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం లోని జనగణన పట్టణం

ఇచ్చోడ, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా, ఇచ్చోడ మండలంలోని గ్రామం.[1]ఇది జనగణన పట్టణం.

వ్యవసాయం, పంటలుసవరించు

ఇచ్చోడ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14464 హెక్టార్లు, రబీలో 452 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు, గోధుమ.[2]

చరిత్రసవరించు

తొలి యాత్రాచరిత్ర కారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి తన కాశీయాత్ర చరిత్రలో భాగంగా వివరాలు నమోదుచేసుకున్నారు. దాని ప్రకారం ఈ ఊరు అప్పట్లో చాలా చిన్నగ్రామం. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ షహర్‌కు వెళ్ళే మార్గంలో కడం అనే నది ఉన్నదని, చిన్న ప్రవాహమే అయినా లోతు ఎక్కువనీ, దారి చాలా అడుసుగలదని వ్రాశారు. దానిని దాటడం కష్టం కావడంతో వాతావరణ అనుకూల్యత కొరకు ప్రజలు అప్పట్లో ఈ గ్రామంలో ఆగేవారని తెలిపారు. కంపెనీ(ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం) వారి టపా కూడా ఇక్కడ రెండు మూడు రోజులు వాతావరణ అనుకూల్యత కోసం ఆగేదని ఆయన వివరించారు.[3]

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 74
  3. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఇచ్చోడ&oldid=3040073" నుండి వెలికితీశారు