ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం 2022లో విడుదలైన యాక్ష‌న్ సినిమా. జీ స్టూడియోస్‌ సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యాన‌ర్‌పై రాజేష్‌ దండు నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఆర్‌.మోహన్‌ దర్శకత్వం వహించాడు. అల్లరి నరేష్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మే 10న విడుదల చేసి[1][2], ట్రైలర్‌ను నవంబర్ 12న[3], సినిమా నవంబర్ 25న విడుదలవ్వగా[4],డిసెంబరు 23న జీ5 ఓటీటీలో విడుదలైంది.[5]

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
ItluMaredumilliPrajaneekam.jpg
దర్శకత్వంఎ.ఆర్‌.మోహన్‌
రచనఎ.ఆర్‌.మోహన్‌
నిర్మాతరాజేష్‌ దండు
నటవర్గంఅల్లరి నరేష్
ఆనంది
ఛాయాగ్రహణంచోటా కె. ప్రసాద్
కూర్పురామ్ రెడ్డి
సంగీతంసాయి చరణ్ పాకాల
నిర్మాణ
సంస్థ
హాస్య మూవీస్‌
విడుదల తేదీలు
2022 నవంబరు 25 (2022-11-25)(థియేటర్)
2022 డిసెంబరు 23 (2022-12-23)(జీ5 ఓటీటీలో)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

శ్రీపాద శ్రీనివాస్ (అల్లరి నరేష్) తెలుగు టీచ‌ర్‌గా ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. నలుగురికి సాయం చేసే గుణం ఉన్న మనిషి. ఎన్నికల విధుల్లో భాగంగా మారేడుమిల్లి గిరిజ‌న‌ ప్రాంతానికి వెళతాడు. గిరిజన గ్రామాల ప్రజలు తమ కష్టాలను ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందుకని ఓటింగ్‌లో పాల్గొన‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంటారు. దింతో శ్రీనివాస్ వారికీ సర్ది చెప్పడంతో వాళ్ళు ఎన్నికల్లో ఓటు వేస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న అధికారులను కండా (శ్రీతేజ) కిడ్నాప్ చేస్తాడు. అధికారుల‌ను కండా కిడ్నాప్ చేయ‌డానికి కార‌ణం ఏమిటి? ఆ కిడ్నాప్ వెనుక ఎవ‌రున్నారు? కిడ్నాప్ అయిన అధికారులను విడిపించడానికి ప్రభుత్వం ఏం చేసింది? చివరకు ఏం అయ్యింది? అనేదే మిగతా సినిమా సినిమా.[6]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

మూలాలుసవరించు

  1. 10TV (10 April 2022). "అల్లు నరేష్ కొత్త సినిమా.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'!" (in telugu). Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. Sakshi (10 May 2022). "'ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం'.. ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  3. Namasthe Telangana (13 November 2022). "ఆసక్తి రేకెత్తిస్తున్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ట్రైలర్‌..!". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
  4. Namasthe Telangana (20 November 2022). "రెండు డబ్బింగ్‌ సినిమాలతో పోటీ పడనున్న అల్లరినరేష్‌.. గెలుపెవరిది?". Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Eenadu (19 December 2022). "ఓటీటీలో 'మారేడుమిల్లి ప్రజానీకం'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 20 December 2022. Retrieved 20 December 2022.
  6. Eenadu (25 November 2022). "రివ్యూ: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం". Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.