ఇదేం పెళ్లాం బాబోయ్

కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం

ఇదేం పెళ్లాం బాబోయ్ 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజా ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై బి.హెచ్. రాజన్న నిర్మాణ సారథ్యంలో కాట్రగడ్డ రవితేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రాధిక నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[2] 1988లో తమిళంలో వచ్చిన మనమాగలే వా చిత్ర రిమేక్ చిత్రమిది. బాక్సాఫీన్ వద్ద పరాజయం పొందింది.[3]

ఇదేం పెళ్లాం బాబోయ్
ఇదేం పెళ్లాం బాబోయ్ విహెచ్ఎస్ కవర్
దర్శకత్వంకాట్రగడ్డ రవితేజ
రచనచిలుకోటి కాశీ విశ్వనాథ్ (మాటలు)
స్క్రీన్ ప్లేపంచు అరుణాచలం
కథపంచు అరుణాచలం
దీనిపై ఆధారితంమనమాగలే వా (1988)
నిర్మాతబి.హెచ్. రాజన్న
తారాగణంరాజేంద్ర ప్రసాద్
రాధిక
ఛాయాగ్రహణంకె. గోపి
కూర్పుఎన్. చందన్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
రాజా ఎంటర్‌ప్రైజెస్[1]
విడుదల తేదీ
1990 (1990)
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

మార్చు

శోభాదేవి (పి. ఆర్. వరలక్ష్మి) చాలా అహంకారంతో ఉంటూ తన కోడలు అరుణ (రాజ్యలక్ష్మి)ను బానిసలా చూస్తూ, తన మాటలను లెక్కచేయనందుకు ఆమెను ఇంటి నుండి బయటకు పంపుతుంది. అరుణ చెల్లెలు ఝాన్సీ (రాధిక) తన అక్కకి జరిగిన దానిగురించి తెలుసుకొని చదువు పూర్తిచేసి ఇంటికి తిరిగివస్తుంది. తన అక్క జీవితాన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్న ఝాన్సీ, శోభాదేవి చిన్న కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి (రాజేంద్ర ప్రసాద్) ను వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. తన వేషధారణ మార్చుకుని, వారి ఊరికి వెళ్ళి, కల్యాణ్‌ను వివాహం చేసుకొని శోభాదేవికి గుణపాఠం ఎలా నేర్పిందనేది మిగతా కథ.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: కాట్రగడ్డ రవితేజ
  • నిర్మాత: బి.హెచ్. రాజన్న
  • మాటలు: చిలుకోటి కాశీ విశ్వనాథ్
  • కథ, చిత్రానువాదం: పంచు అరుణాచలం
  • ఆధారం: మనమాగలే వా (1988)
  • సంగీతం: ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: కె. గోపి
  • కూర్పు: ఎన్. చందన్
  • నిర్మాణ సంస్థ: రాజా ఎంటర్‌ప్రైజెస్

పాటలు

మార్చు
ఇదేం పెళ్లాం బాబోయ్
సినిమా by
Released1989
Genreపాటలు
Length21:25
Labelఎకో ఆడియో
Producerఇళయరాజా
ఇళయరాజా chronology
అంజలి
(1990)
ఇదేం పెళ్లాం బాబోయ్
(1989)
కోకిల
(1990)

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు. ఎకో ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4]

క్రమసంఖ్య పాట సంఖ్య రచన గాయకులు నిడివి
1 "డార్లింగ్ డార్లింగ్" భువనచంద్ర మనో 4:07
2 "చామంతి పువ్వులు కట్టి" ఆత్రేయ కె.ఎస్. చిత్ర 4:15
3 "గోదావరి పొంగల్లే" భువనచంద్ర మనో, చిత్ర 4:21
4 "మనసుకెటో" ఆచార్య ఆత్రేయ చిత్ర 4:22
5 "రమ్మంటే రాదయే" భువనచంద్ర మనో, చిత్ర 4:20

ఇతర వివరాలు

మార్చు

విసిడి, డివిడిలు హైదరాబాదు హైదరాబాదులోని వీడియో కంపెనీలో లభిస్తాయి.

మూలాలు

మార్చు
  1. "Idem Pellam Baboi (overview)". youtube.
  2. "Idem Pellam Baboi (Cast & Crew)". Tollywood Times.com. Archived from the original on 2018-09-28. Retrieved 2020-08-14.
  3. "Idem Pellam Baboi (Review)". The Cine Bay. Archived from the original on 2018-06-18. Retrieved 2020-08-14.
  4. "Idem Pellam Baboi (Songs)". Cineradham. Archived from the original on 2017-08-18. Retrieved 2020-08-14.

ఇతర లంకెలు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇదేం పెళ్లాం బాబోయ్