ఇనుగాల పెద్దిరెడ్డి

ఇనుగాల పెద్దిరెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. పెద్దిరెడ్డి 1957లో తెలంగాణ రాష్ట్రం , కరీంనగర్ జిల్లా , భీమదేవరపల్లి , కొప్పూర్ గ్రామంలో జన్మించాడు. అతను కాకతీయ యూనివర్సిటీ నుండి బి.కామ్ పూర్తి చేశాడు.

ఇ. పెద్దిరెడ్డి
పదవీ కాలం
1994 – 2004
ముందు కేతిరి సాయిరెడ్డి
తరువాత వి.ల‌క్ష్మీకాంత రావు
నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గం

కార్మిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి
పదవీ కాలం
అక్టోబర్ 1999 - మే 2004

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు *తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం కొప్పూర్ గ్రామం భీమదేవరపల్లి మండలం , హన్మకొండ జిల్లా, తెలంగాణ
పూర్వ విద్యార్థి బి.కామ్ కాకతీయ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

ఇనుగాల పెద్దిరెడ్డి 1992లో తెలుగుదేశం పార్టీ లో చేరి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొప్పరాజు లక్ష్మీకాంతరావు పై 19291 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను 1999లో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరి సాయిరెడ్డి పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కార్మిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పని చేశాడు.ఇనుగాల పెద్దిరెడ్డి 2004లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కేప్టెన్ వొడితెల లక్ష్మీకాంతరావు చేతిలో ఓటమి పాలయ్యాడు.

పెద్దిరెడ్డి 2004లో ఓటమిపాలయ్యాక 2007లో టి.దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీలో చేరాడు. అతను ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణ నినాదానికి ఆకర్షితులై నవ తెలంగాణ పార్టీని అందులో విలీనం చేయడంతో, ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 లో జరిగిన ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనతో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటి చేసి ఓటమి పాలయ్యాడు. ఆ పార్టీ తీరుపై అసంతృప్తితో తిరిగి తెలుగుదేశం పార్టీ లో చేరి పార్టీ అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యాడు.[1] పెద్దిరెడ్డి 2019 జూన్ లో తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీలో చేరాడు.

అతను బీజేపీ కి 2021, జూలై 26న రాజీనామా చేసి,[2] హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ భవన్‌ లో 2021, జూలై 30న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో చేరాడు.[3]

మూలాలు మార్చు

  1. Sakshi (20 April 2018). "తితిదే బోర్డు మెంబర్ల నియామకం." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  2. NTV (26 July 2021). "బీజేపీకి మరో షాక్‌.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా". Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
  3. Namasthe Telangana (30 July 2021). "టీఆర్‌ఎస్‌లోకి పెద్దిరెడ్డి". Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.