వి.లక్ష్మీకాంత రావు

(వి.ల‌క్ష్మీకాంత రావు నుండి దారిమార్పు చెందింది)

కెప్టెన్ వొడితల ల‌క్ష్మీకాంత రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2016 నుండి టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]

వొడితల ల‌క్ష్మీకాంత రావు
వి.లక్ష్మీకాంత రావు


రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2016 జూన్ 22 – 2022 జూన్ 22
ముందు గుండు సుధారాణి, టీడీపీ

వ్యక్తిగత వివరాలు

జననం 1938
సింగాపూర్ గ్రామం, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం [1]
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి వొడితల సరోజినీ దేవి
బంధువులు వొడితల రాజేశ్వర్ రావు (సోదరుడు)
సంతానం వొడితల సతీష్ కుమార్
నివాసం వరంగల్

జననం, విద్యాభాస్యం

మార్చు

కెప్టెన్ వి.ల‌క్ష్మీకాంత రావు 1938లో కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలం, సింగాపూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన 1962లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ పూర్తి చేశాడు. లక్ష్మీకాంతరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.

ఉద్యోగ జీవితం

మార్చు

కెప్టెన్ ల‌క్ష్మీకాంత రావు 1963 నుంచి 1968 వరకు భారత సైనిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్‌ (కెప్టెన్) గా పనిచేశాడు. ఆయన 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొని, రక్షా మెడల్ అందుకున్నాడు. 1968 లో సైనిక సేవల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.

రాజకీయ ప్రస్థానం

మార్చు

కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు ఉద్యోగ విరమణ అనంతరం తన స్వగ్రామం సింగాపురానికి 1983 నుంచి 1995 వరకు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై పనిచేశాడు. సింగాపురం గ్రామానికి ఒకసారి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడిగా కొంతకాలం పనిచేశాడు. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో పార్టీలో చేరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2004 కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004 జూన్ నుంచి 14 నెలలపాటు బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశాడు.[4]

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరితో 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలో తిరిగి విజయం సాధించాడు. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నూతనంగా ఏర్పడిన హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2009 నుండి కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్ కన్వీనర్‌గా, ఆ తర్వాత రాష్ట్ర కమిటీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశాడు. 2016లో రాజ్యసభ ఎన్నికల్లో ఆయనను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. రాజ్యసభకు ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు శాసనసభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (5 May 2021). "పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే : కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు". Archived from the original on 5 May 2021. Retrieved 6 May 2021.
  2. The New Indian Express (27 May 2016). "TRS nominates Capt V Lakshmikantha Rao and D Srinivas for Rajya Sabha". Archived from the original on 6 May 2021. Retrieved 6 May 2021.
  3. The New Indian Express (27 May 2016). "TRS nominates D Srinivas, Captain Lakshmikantha Rao for Rajya Sabha seats". Archived from the original on 6 May 2021. Retrieved 6 May 2021.
  4. Sakshi, హోం » జిల్లాలు (27 May 2016). "అండకు దండ". Sakshi. Archived from the original on 6 May 2021. Retrieved 6 May 2021.
  5. Sakshi, హోం » తెలంగాణ »వరంగల్ (27 May 2016). "మన పదవి మనకే". Sakshi. Archived from the original on 6 May 2021. Retrieved 6 May 2021.
  6. "రాజ్యసభకు ఆరుగురి ఎన్నిక ఏకగ్రీవం". www.sakshieducation.com. 4 June 2016. Archived from the original on 6 May 2021. Retrieved 6 May 2021.