ఇన్శాట్-3డీఆర్
ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపకల్పన చేసి తయారు చేసింది.ఇన్శాట్ శ్రేనికి చెందిన ఉపగ్రహాలను వాతావరణ అద్యాయనం చెయ్యుటకై అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టారు.వాతావరణ పరిసశోధన, అద్యాయనానికై ఇంతకు ముందు కల్పన-1, ఇన్శాట్-3A, ఇన్శాట్-3D ఉపగ్రహాలను ప్రయోగించారు, అవి 10 సంవస్తరాలుగా అంతరిక్షంలో నిర్దిష్ట అక్షాంశంలో నిర్దిష్ట కక్ష్యలో ప్రదక్షిణలు చేస్తూ సేవలందిస్తున్నాయి.[2] 2013 జూలై 26 న ఫ్రాన్సులోని ఫ్రెంచిగయనా అంతరిక్ష కేంద్రంనుండి, ఫ్రన్సు అంతరిక్ష సంస్థ సహకారంతో అంతరిక్ష కక్ష్యలో ఇన్శాట్-3డీఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు.అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ఉపగ్ర్హం సేవలు నిలచి పోవడం వలన, ఆ లోటును భర్తీ చేయుటకు ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టుచున్నారు.[3]
పేర్లు | ఇండియన్ నేషనల్ శాటిలైట్ 3డీ రిపీట్ |
---|---|
మిషన్ రకం | వాతావరణ అధ్యయన ఉపగ్రహం |
ఆపరేటర్ | ఈండియన్ నేషనల్ శాటిలైట్(INSAT) |
COSPAR ID | 2016-054A |
SATCAT no. | 41752 |
మిషన్ వ్యవధి | జీవితకాలం:10సంవత్సరాలు Elapsed: 8 సంవత్సరాలు, 1 నెల, 29 రోజులు |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | I-2K |
తయారీదారుడు | ఇస్రో శాటిలైట్ సెంటరు Space Applications Centre |
లాంచ్ ద్రవ్యరాశి | 2,211 కి.గ్రా. (4,874 పౌ.)[1] |
డ్రై ద్రవ్యారాశి | 956 కి.గ్రా. (2,108 పౌ.)[1] |
శక్తి | 1,700 W[1] |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 8,సెప్టెంబరు2016,సాయంత్రం4:50(ఐ.ఎస్.టి) |
రాకెట్ | GSLV (Mk II)F05 |
లాంచ్ సైట్ | సతిష్ థవన్ అంతరిక్ష ప్రయోగ సంస్థ,రెండవ ప్రయోగ వేదిక |
కాంట్రాక్టర్ | ఇస్రో |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | భూస్థిరకక్ష్య |
రేఖాంశం | 74° E[1] |
ఎపోచ్ | Planned |
మూస:Infobox spaceflight/Instruments | |
ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహ వివరాలు
మార్చుఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహన్ని కేవలంభూమి మీది వాతావరణ సమాచారాన్నే కాకుండ సముద్రం మీదివాతావరణాన్ని అధ్యాయనం చెయ్యటానికి, భూమి ఉపరితలం పై, సముద్రజలాలవాతావరణంలో ఏర్పడె విప్పతులను గుర్తించి ముందుగానే సమాచారం అందించుటకై తయారు చేసారు.ఈ ఉపగ్రహంలో 6-ఛానల్ ఇమేజరు,9-ఛానల్ సౌండరు అనే శాస్త్రీయ పరికరాలను, మెట్రోలాజికల్ డాటారిలే ట్రాన్స్‌ఫాండర్సు (డీఆర్‌టీ) శాటిలైట్ ఏయిడెద్ సెర్చ్ అండ్ రిసోర్స్ (ఎస్‌ఏఏస్ అండ్ ఏర్) అనే శాస్త్రియ పరికరాలను కూడా ఉపగ్రహంలో అదనంగా అమర్చారు.ఈ ఉపగ్రహంలో అమర్చిన 6 ఛానల్ ఇమేజరు ద్వారా భూమిపైన, సముద్రజలాలపైన జరిగే మార్పులను పొటోతీసి పంపెటందుకు ఉపయోగిస్తారు.ఈ ఉపగ్రహం కూడా భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ప్రదక్షణలు చేస్తూ సేవలందిస్తుంది.[3]
ఉపగ్రహం బరువు:2211 కిలోలు.ఉపగ్రహంసేవలు అందించు జీవితకాలం 10సంవత్సరాలు.ఉపగ్రహకొలతలు 2.4X1.6X1.5 మీటర్లు, విద్యుత్తు ఉత్పత్తికై రెండు సౌరఫలకాలు కల్గిఉన్నది.సౌరఫలకలు 1700వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయు సామర్ధ్యం కల్గి ఉన్నాయి.90ఏచ్ కెపాసిటీ లిథియం అయాన్ బ్యాటరీ ఉపగ్రహంలో అమర్చారు.ఉపగ్రహం కై అయినఖర్చు 50కోట్లు.ఈఉపగ్రహన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టూ వాహకనౌకకు అయిన ఖర్చు 160 కోట్లు.
ఉపగ్రహ ప్రయోగం
మార్చుఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వి-F05 ఉపహ్రగ వాహకనౌకసాయంతో 2016, సెప్టెంబరు 8 వతేది, గురువారము సాయంత్రం 4:50గంటలకు నింగిలోకి విజయవంతంగా ప్రయోగించారు.అనుకున్న విధంగా 1,023 సెకన్లకు భూసమాంతర బదిలీ క్షక్యలో,170 కిలోమీటర్ల పెరోజి,35,975 కి.మీ అపోజీలో,20.61 డీగ్రీల కోణంలో ప్రవేశపెట్టారు.[4]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు/ఆధారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 Radhakrishan, Vignesh (8 September 2016). "Isro's advanced weather satellite launched: Here are 8 things to know". Hindustan Times. Retrieved 8 September 2016.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-29. Retrieved 2016-09-08.
- ↑ 3.0 3.1 "నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌ఎఫ్-ఎఫ్05". sakshi.com. 2016-08-09. Archived from the original on 2016-09-08. Retrieved 2016-09-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "నింగిలోకి ఇన్‌శాట్-3డీఅర్". sakshi.com. Sakshi. 2016-09-09. Archived from the original on 2016-09-09. Retrieved 2016-09-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)