ఇన్శాట్-3A ఉపగ్రహం

ఇన్శాట్-3A భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (indian space research organisation) (ఇస్రో) వాళ్ళు రూపకల్పన చేసి, తయారు చేసిన ఉపగ్రహం.ఈ ఉపగ్రహం ఇన్శాట్ -3శ్రేణికి చెందిన మూడవ ఉపగ్రహం అంతకుముందు ఈ శ్రేణికి చెందిన ఇన్శాట్-3B, ఇన్శాట్-3C ఉపగ్రహాలను అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశపెట్టారు.ఈ ఉపగ్రహం బహుళ ప్రయోజన ఉపగ్రహం.ఈ ఉపగ్రహం ద్వారా సమాచారం, వాతావరణం ఇంకా అన్వేషణ, సంరక్షించు సేవలను అందించడం ఈ ఉపగ్రహ ప్రయోగ ప్రధానమైన లక్ష్యం. ఈ ప్రయోగార్థం 53 మిలియను డాలర్లు ఖర్చు అయ్యింది.ఈ ఉపగ్రహాన్ని దక్షిణ అమెరికాకు చెందిన ఏరియన్ (Ariane 5G V160) ) అను ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక ద్వారా, ఫ్రెంచి గయానా లోని కౌరౌ (Kourou ELA-3) రాకెట్ ప్రయోగవేదిక నుండి 9వతేదీ, ఏప్రిల్ నెల 2003న, 22;52 (UTC) గంటలకు అంతరిక్షములోకి పంపారు.[1]

ఇన్శాట్-3A ఉపగ్రహం
మిషన్ రకంCommunications
Weather
ఆపరేటర్ISRO
COSPAR ID2003-013A Edit this at Wikidata
SATCAT no.27714Edit this on Wikidata
వెబ్ సైట్INSAT 3A
అంతరిక్ష నౌక లక్షణాలు
లాంచ్ ద్రవ్యరాశి2,950 కిలోగ్రాములు (6,500 పౌ.)
కొలతలు2.8 x 1.7 x 2.0 metres
శక్తి3.1 kilowatts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ9 April 2003, 22:52 (2003-04-09UTC22:52Z) UTC
రాకెట్Ariane 5G V160
లాంచ్ సైట్Kourou ELA-3
కాంట్రాక్టర్Arianespace
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం93.5° East (0°00′N 93°30′E / 0°N +93.5°E / 0; +93.5)
వాలు74 degrees
వ్యవధి24 hrs
 

ఉపగ్రహ ప్రయోగం

మార్చు

ఇన్శాట్-3A ఉపగ్రహాన్ని అంతరిక్షములో ప్రవేశపెట్టిన గుత్తేదారు ఏరియన్ స్పేస్ (Arianespace ) సంస్థ వాళ్ళు.తాము నిర్మించిన ఏరియన్-5G (V160) (Ariane 5GV160) అనే ఉపగ్రహ వాహక నౌకద్వారా ఫ్రెంచి గయానా లోని కౌరౌ (Kourou ELA-3) రాకెట్ ప్రయోగవేదిక నుండి 9వ తేదీ, ఏప్రిల్ నెల 2003న,22;52 (UTC) గంటలకు అంతరిక్షములోకి పంపారు[2].ఉపగ్రహ వాహకనౌక ప్రయోగ వేదికనుంది బయలు దేరిన 30 నిమిషాల తరువాత భూసమస్థితి బదిలీకక్ష్యలో (GTO, ఉపగ్రహాన్ని భూ మధ్య రేఖకు 1.99 డిగ్రీల ఏటవాలుగా, త్రిఅక్ష స్థిరీకరణ స్థితిలో,859 కిలోమీటర్ల పెరిజీ (భూమికి కనిష్ఠదూరం), 36,055 కిలోమోటర్ల అపోజీ (భూమికి గరిష్ఠ దూరం) దూరంలో, ప్రదక్షిణలుచేసేలా కక్ష్యలో ఉంచారు.ఈ ఉపగ్రహంతో పాటు అదేసమయంలో PanAmSat వాళ్ళ గాలక్షి-XIIఅనే ఉపగ్రహం కూడా ఏరియన్-5G (V160) (Ariane 5GV160) ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టబడింది. ఈ ఉపగ్రహ పనితీరును పర్యవేక్షించు ప్రధాననియంత్రణ సౌకర్యకేంద్రం (Master Control Facility (MCF, కర్నాటక రాష్ట్రంలోని హాసన్లో ఉంది. మూమెంటమ్ అండ్ రియక్షన్ వీల్స్, సోలార్ ఫ్లాప్స్, మాగ్నెటిక్ టార్కర్స్, ఎనిమిది 10N, ఎనిమిది 22N రియాక్షన్ కంట్రోల్ థ్రస్టరులను ఉపయోగించి ఉపగ్రహం యొక్క త్రి అక్షనిర్మాణాన్ని (3 – axis body) స్థిరీకరించారు. ఉపగ్రహాన్ని కక్ష్యలో పునఃస్థిరికరణకై అవసరానికి ఉపయోగించుటకు ఉన్న చోదక వ్యవస్థలో 440 N ద్రవఅపోజీ మోటరు MON-3 (నైట్రోజన్ యొక్క మిశ్రమఆక్సైడులు), మొనోమిథైల్ హైడ్రాజీన్ ఉన్నాయి.

ఉపగ్రహ వివరాల పట్టిక

లక్ష్యం దూర సమాచార ప్రసారం/ప్రసారణం
వాతావరణ/అంతరిక్షశాస్త్ర సంబంధిత సమాచార అధ్యాయనం
అన్వేషణ, సంరక్షణ సేవలు (
ఉపగ్రహం బరువు 2,950కిలోలు (ప్రయోగ సమయంలో
1,348లకిలోలు (ఖాళి ఉపగ్రహం)
ఉపగ్రహంలో విద్యుతు 3,100 W
స్థిరికరణ మూమెంటం అండ్ యక్షన్ వీల్స్, సోలార్ ఫ్లాప్స్, మాగ్నెటిక్ టార్కర్స్,
ఎనిమిది 10 N, ఎనిమిది 22N రియాక్షన్ కంట్రోల్ థ్రస్టరుల సహాయం
ప్రయోగ తేది 2003 ఏప్రిల్ 10
ప్రయోగించిన స్థలం గయానా

ఉపగ్రహంలోని పేలోడులు

మార్చు

సమాచార ప్రసారం

మార్చు
  • 12 సాధారణ C-band ట్రాన్స్‌పాండరులు (ఇందులో 9 చానల్లు తూర్పు మధ్యఆసియా నుండి ఆగ్నేయాసియావరకు 38 dBW ఉన్న EIRPద్వారా, మిగిలిన 3 చానల్ల 36 dBW కలిగిన EIRP ద్వారా భారతదేశాన్నిఆవరించి (cover) / వ్యాపించి/ విస్తరించి ఉండును. 6 ఎక్సుటెండేడ్ C-band ట్రాన్స్‌పాండరులు 36 dBW కలిగిన EIRP ద్వారా ఇండియా అంతా విస్తరించి, పర్యవేక్షణ సమాచార సేకరణ చెయ్యును.[3] [2]
  • 6 అప్పర్ ఎక్సుటెండేడ్ 37dBWక లిగిన EoC-EIRPద్వారా భారతదేశాన్ని కవరు/ పర్యవేక్షణము చేస్తుంది.[2][3]
  • 6 6 Ku-band ట్రాన్స్ పాండరులు 48 dBW.కలిగిన EIRPద్వారా భారతదేశాన్ని పర్యవేక్షణము (cover) చేస్తుంది.[2][3]

వాతావరణ/అంతరిక్షశాస్త్ర సంబంధితం

మార్చు
  • చాలాఎక్కువ రెసోల్యుసన్ కలిగిన రేడియోమీటరు (VHRR) అమర్చబడిఉన్నది.దీనిద్వారా కనిపించే దృశ్యాన్ని ( (0.55-0.75 µm) 2X2కి.మీ, తాపక ఇఫ్రారేడ్ (10.5-12.5 µm) 8x8 కి.మీమేర, నీటి ఆవిరి (5.7-7.1 µm) తో 8x8 కి.మీ మేర భూరెసొల్యుసన్ చిత్రీకరణ చెయ్యగలదు.
  • ఒక కెమరా 1X1 కి.మీ దృశ్య భూ రెసొల్యుసన్ (0.63-0.69 µm, ఇంఫ్రారెడ్ ( (0.77-0.86 µm) రెసొల్యుసన్ తో చిత్రికరించును
  • ఒకడేటారిలే ట్రాన్స్ పాండరు (DRT) 400 MHz అప్ లింకు, 4500 MHz డౌన్ లింకు ద్వారా ప్రపంచవ్యాప్తంగావాతావరణ/అంతరిక్షశాస్త్ర సంబంధిత, జలసంబంధ, hydrological andసముద్రవిజ్ఞానం/సాగరశాస్త్ర డేటాను పర్యవేక్షణ రహితభూమి, సముద్రప్రాంతాలలోని ఆటోమాటిక్ డేటా కలెక్షను/ట్రాన్స్‌మిసన్ ప్లాట్ ఫారంల నుండి అందుకోగలదు.
  • ఒక SARP (Satellite Aided Search and Rescue) పేలోడ్ ప్రపంచ వ్యాప్తంగా 406 MHz అప్ లింకు, 4500 డౌన్ లింకు ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇండియాను కవర్ చేస్తూ సిగ్నల్స్ ను భూమి, సముద్రం, ఆకాశం నుండి అందుకోగలదు.

ఉపగ్రహం అందించు సేవలు

మార్చు
  • దూర సమాచార ప్రసారం/ప్రసారణం (Telecommunications)
  • దూరదర్శిని కార్యక్రమాల ప్రసారం (Television broadcasting)
  • వాతావరణ/అంతరిక్షశాస్త్ర సంబంధిత సమాచార అధ్యాయనం (Meteorological)
  • అన్వేషణ, సంరక్షణ సేవలు (Search and Rescue services)

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "Flawless return for Ariane 5 rocket". newscientist.com. Retrieved 2015-09-09.
  2. 2.0 2.1 2.2 2.3 "INSAT-3A Launched". spaceref.com. Retrieved 2015-09-09.[permanent dead link]
  3. 3.0 3.1 3.2 "INSAT-3A". isro.gov.in. Archived from the original on 2017-07-31. Retrieved 2015-09-09.