ఇన్శాట్-4B ఉపగ్రహం
ఇన్శాట్-4B ఒక భారతీయ ఉపగ్రహం.ఇది ఒక సమాచార ప్రసార ఉపగ్రహం. దీనిని భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్థలో (INSS) భాగంగా, భారతీయ అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) రూపకల్పన చేసి, తయారు చేసిన ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని 2007 న అంతరిక్షములో భూస్థిర కక్ష్యలో, 93.48° డిగ్రీల తూర్పు రేఖాంశములోని కక్ష్యలో స్థిరపరచారు.[3]
మిషన్ రకం | Communications |
---|---|
ఆపరేటర్ | ISRO |
COSPAR ID | 2007-007A |
SATCAT no. | 30793 |
మిషన్ వ్యవధి | 12 years |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | I-3K |
తయారీదారుడు | ISRO |
లాంచ్ ద్రవ్యరాశి | 3,028 కిలోగ్రాములు (6,676 పౌ.) |
డ్రై ద్రవ్యారాశి | 1,335 కిలోగ్రాములు (2,943 పౌ.) |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 11 March 2007, 22:03[1] | UTC
రాకెట్ | Ariane 5ECA |
లాంచ్ సైట్ | Kourou ELA-3 |
కాంట్రాక్టర్ | Arianespace |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | Geostationary |
రేఖాంశం | 93.48° east |
సెమీ మేజర్ ఆక్సిస్ | 42,163.57 కిలోమీటర్లు (26,199.23 మై.) |
విపరీతత్వం | 0.0003909 |
Perigee altitude | 35,776 కిలోమీటర్లు (22,230 మై.) |
Apogee altitude | 35,809 కిలోమీటర్లు (22,251 మై.) |
వాలు | 0.07 degrees |
వ్యవధి | 23.93 hours |
ఎపోచ్ | 11 November 2013, 22:16:22 UTC[2] |
ఉపగ్రహ సమాచారం
మార్చు1-3K శాటిలైట్ బస్ ఆధారంగా ఇన్శాట్-4B ఉపగ్రహాన్ని రూపొందించారు.ఉపగ్రహం పూర్తి బరువు, ఇంధన సహితంగా 3,025 కిలోగ్రాములు (6,676 పౌండ్లు, ఖాళి ఉపగ్రహంబరువు 1,335 కిలోగ్రాములు (2,943 పౌండ్లు).ఈ ఉపగ్రహం పనిచేయు జీవితకాలం 12 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఉపగ్రహానికి అవసరమైన విద్యుతు ఉత్పత్తికి రెండు సౌరపలకను అమర్చారు. ఉపగ్రహంలో సమాచార వ్యవస్థకి 12 C-band, 12-Ku band ట్రాన్స్పాండరులను పొందుపరచారు.[4] ఉపగ్రహం యొక్క విద్యుతు క్షమత 5859 W.
ఉపగ్రహ ప్రయోగం
మార్చుఇన్శాట్-4B ఉపగ్రహాన్నిదక్షిణ అమెరికా, ఫ్రెంచి గయానాలోని కౌరౌ (kourou) అంతరిక్షప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించారు. అంతరిక్షములోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టు కార్యాన్ని ఏరియన్స్పేస్ వారు గుత్తేదారు పద్ధతి (contract) లో నిర్వహించారు. ఏరియన్స్పేస్ వారు తయారుచేసిన ఏరియన్ 5ECA అనే ఉపగ్రహ వాహక రాకెట్ ద్వారా 2007 మార్చి 11 న ప్రయోగ కేంద్రంలోని ELA-3 ప్రయోగవేదిక నుండి ఉపగ్రహాన్ని అంతరిక్షములోకి పంపి భూసమస్థితి బదిలీకక్ష్యలో (GTO) ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఉపగ్రహంలోని మోటారును మండించి కక్ష్యను పెంచి భూస్తిర కక్ష్యకు చేర్చారు. అంతిమంగా, ఉపగ్రహకక్ష్య పెరిజీ 35,776కి.మీ, అపోజీ 35,809 కిలోమీటర్లు, వాలు 0.07 డిగ్రీలు. కక్ష్య భ్రమణసమయం 23.93 గంటలు.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 12 November 2013.
- ↑ "INSAT 4B Satellite details 2007-007A NORAD 30793". N2YO. 11 November 2013. Retrieved 12 November 2013.
- ↑ "UCS Satellite Database". Union of Concerned Scientists. 1 September 2013. Archived from the original on 4 జనవరి 2014. Retrieved 12 November 2013.
- ↑ Krebs, Gunter. "Insat 4A, 4B". Gunter's Space Page. Retrieved 12 November 2013.