ఈటీ (ఆంగ్ల చిత్రం ఈటీ- ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ కాదు ) 2022లో విడుదలైన యాక్షన్ సెంటిమెంట్ డ్రామా సినిమా. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తమిళంలో ‘ఎతర్కుమ్ తునింధవం’ పేరుతో నిర్మించిన ఈ సినిమాను ఈటీ పేరుతొ తెలుగులో విడుదల కానుంది. సూర్య, ప్రియాంకా అరుళ్ మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు టీజర్‌ను 2022 ఫిబ్రవరి 18న విడుదల చేసి[2], తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను 2022 మార్చి 10న విడుదలైంది.[3]

ఈటీ
ఈటీ.jpg
దర్శకత్వంపాండిరాజ్
రచనపాండిరాజ్
నిర్మాతకళానిధి మారన్‌
నటవర్గం
ఛాయాగ్రహణంఆర్. రత్నవేలు
కూర్పురూబెన్
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదారులుసన్ పిక్చర్స్
విడుదల తేదీలు
2022 మార్చి 10 (2022-03-10)
నిడివి
151 నిముషాలు[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

కృష్ణమోహన్ (సూర్య) చిన్నప్పుడే తన చెల్లెలిని కోల్పోతాడు. అప్పటినుండి ప్రతీ ఒక్క అమ్మాయిని తన చెల్లిలిగా భావించి వారిని కాపాడుతూ ఉంటాడు. అదే సమయంలో తన ఊరిలో చాలామంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు. అసలు వీరందరు ఎందుకు ఇలా చనిపోతున్నారు ? ఆ ఊర్లో అమ్మాయిల విష‌యంలో ఏం జ‌రుగుతుంది? అమ్మాయిల మరణాలతో కామేష్ (విన‌య్ రాయ్‌)కి ఏమి సంబంధం? ఈ మిస్టరీని కృష్ణమోహన్ ఎలా చేధించాడు? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: సన్ పిక్చర్స్
 • నిర్మాత: కళానిధి మారన్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాండిరాజ్
 • సంగీతం: డి. ఇమ్మాన్
 • సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు
 • ఎడిటర్: రూబెన్

మూలాలుసవరించు

 1. "Suriya's Etharkkum Thunindhavan Release To Be Postponed, Makers Indicate". News18. 24 January 2022. Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
 2. NTV (16 February 2022). ""ఈటీ" టీజర్ కు ముహూర్తం ఫిక్స్". Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
 3. Andhra Jyothy. "సినిమా రివ్యూ : ఈటి". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
 4. TV9 Telugu, TV9 (10 March 2022). "నారీలోకానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఈటీ!." Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
 5. V6 Velugu (20 February 2022). "సూర్య యాక్షన్ మోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌" (in ఇంగ్లీష్). Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
 6. Sakshi (22 January 2021). "సూర్యతో క్రేజీ ఛాన్స్‌ కొట్టేసిన శ్రీకారం నటి!". Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈటీ&oldid=3704496" నుండి వెలికితీశారు