ఉధంపూర్ జిల్లా

జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా

జమ్ము , కాశ్మీర్ రాష్ట్రం లోని 20 జిల్లాలలో ఉధంపూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రగా ఉధంపూర్ పట్టణం ఉంది. కత్రా వద్ద ఉన్న వైష్ణవీ దేవి ఆలయం, పత్నితప్ , సుధ్ మహాదేవ్ హిందూ పుణ్యక్షేత్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఉధంపూర్ జిల్లాలో అదనంగా గోల్ మార్కెట్, దేవికా ఘాట్, జాఖని పార్క్, రామ్నగర్ చోక్ (పాండవ్ మందిర్ , కచలు) సలియన్ తలాబ్ , మైన్ బజార్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. జిల్లాలో వాడుకలో ఉన్న భాషలలో ప్రధానమైనవి డోంగి, హింది, ఉర్దు , గిజ్రి.

ఉధంపూర్
జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా స్థానం
జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా స్థానం
Coordinates (ఉధంపూర్): 33°00′N 75°10′E / 33.000°N 75.167°E / 33.000; 75.167
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
విభాగంజమ్మూ విభాగం
ప్రధాన కార్యాలయంఉధంపూర్
తహసీల్సు1.ఉధంపూర్

2.చెనాని 3.బసంత్‌గఢ్ 4.రామ్‌నగర్ 5.లట్టి 6.మౌంగ్రీ 7.పాంచరి

8.మజల్తా
విస్తీర్ణం
 • మొత్తం2,380 కి.మీ2 (920 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం5,54,985
 • జనసాంద్రత230/కి.మీ2 (600/చ. మై.)
 • Urban
35.2%
జనాభా
 • అక్షరాస్యత73.49%
 • లింగ నిష్పత్తి870
Time zoneUTC+05:30
Vehicle registrationJK-14
జాతీయ రహదార్లుఎన్ఎచ్-1A
Websitehttp://udhampur.nic.in/

వాతావరణం

మార్చు

ఉధంపూర్ జిల్లాలో వాతావరణంలో వైవిధ్యం ఉంటుంది. ఎత్తు సముద్రమట్టం నుండి 600-3,000 మీ వరకు ఉంటుంది. చెనాబ్, అంస్, తవి , ఉఝ్ మొదలైన నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తున్నాయి. జిల్లాలో బొగ్గు, బాక్సైట్, జిప్సం , లైం - స్టోన్ వంటి ఖనిజాలు లభిస్తున్నాయి.

నిర్వహణ

మార్చు

ఉధంపూర్ జిల్లాలో 7 తెహసిల్స్ చెనాని, రాంనగర్, ఉధంపూర్, మజల్త , 7 బ్లాకులు (డుడు బసంత్గర్, గోర్ది, చెనాని, మజల్త, పంచారి, రాంనగర్ , ఉధంపూర్) ఉన్నాయి. [2] ఒక్కో బ్లాకులో పలు పంచాయితీలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 555,357, [3]
ఇది దాదాపు సోలోమన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో 538 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత 211.[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 20.86%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి 863 : 1000.[3]
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 69.9%.[3]
పురుషుల అక్షరాస్యత 66.43%
స్త్రీల అక్షరాస్యత 39.89%
జాతియ సరాసరి (72%) కంటే

ప్రజలు

మార్చు

ఉధంపూర్ జిల్లాలో అత్యధికంగా డోగ్రాలు ఉన్నారు. తరువాత నోమాడిక్ గుజ్జర్లు , బకర్లు ఉన్నారు. హిందువుల సంఖ్య 5,42,593, ముస్లిముల సంఖ్య 1,90,112 (26.56%) ఉన్నారు.

అక్షరాస్యత

మార్చు


అక్షరాస్యులు 343,429
పురుషులు 225,888
స్త్రీలు 117,541

అక్షరాస్యత వివరణ
ప్రాథమిక 90,460
మొత్తం ప్రజల సంఖ్య 55.21
పురుషులు 67.07
స్త్రీలు 41.20

పర్యాటక ఆకర్షణలు

మార్చు

ఉధంపూర్ జిల్లాలో చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో బాబోర్ ఆలయాలు, కిరంచి ఆలయాలు, షీష్ మహల్ (రాన్నగర్), రాంనగర్ కోట, శకరీదేవతా మందిర్ (పంచేరి), చౌంత్రా , పింగళీ దేవి గుడులు ప్రధాన మైనవి. పర్యాటక ప్రదేశాలలో పత్ని టాప్, సంసార్ , లట్టి ముఖ్యమైనవి.

 
కిరంచీలోని చారిత్రాత్మక దేవాలయాలు ఉధంపూర్-జమ్మూ రహదారికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, తరువాత నదీతీరంలో పది నిమిషాల నడక సాగించాలి

ఆలయాలు

మార్చు

దేవిక, బాబోర్ ఆలయాలు కెంసర్ దేవత గుడి, షంకరి దేవతా మందిర్, శివ్ ఖోరి గుహాలయం, భైరవ్ ఘతి, క్రించి ఆలయం, శ్రీ మాతా వైష్ణవదేవీ ఆలయం, దేవ మాయీ మా ఆలయం, షెషాంగ్ గుడి ఉన్నాయి. ఉధంపూర్ " దేవికా నగరి " అని పిలువబడుతుంది.

నివాసగృహాలు

మార్చు

1828లో ఈ ప్రాంతానికి విచ్చేసిన బ్రిటిష్ రచయిత ఫ్రెడ్రిక్ డ్ర్యూ " ఈ ప్రాంతంలో చైతన్యవంతమైన జివనవిధానం ఉందని. ప్రజలు ఉత్సవసమయాలలోదేవికా నదిలో స్నానంచేసి పక్కనేఉన్న అంగళ్ళలో కొనుగోలు చేస్తుంటారు. ఇసుకరాళ్ళతో చేసిన సుందర నివాసగృహాలు నివసిస్తున్నారు. వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రజలు గుమిగూడి ముచ్చట్లాడుతూ ఉత్సాహభరితంగా జీవిస్తున్నారని " వర్ణించాడు. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు లేనప్పటికీ నివాసగృహాలు మానవుల నిర్లక్ష్యం కారణంగా నిర్లక్ష్యానికి గురైఉన్నప్పటికీ వాటి సౌందర్యం ఇంకా అలాగే ఉంది. ప్రస్తుతం పర్యాటకులు అధికం ఔతున్న కారణంగా పాత భవనాల స్థానంలో సరికొత్త భవనాలు తెలెత్తుతున్నాయి. ప్రస్తుతం భూకబ్జా దారులు 200 సంవత్సరాల కాలంనాటి భవనాలను పడగొట్టి ప్రద్తుతం కొత్త భవనాల నిర్మాణం ఊపందుకుంటున్నాయి.

పురమండల్

మార్చు

1836 ఏప్రిల్‌లో మహారాజా రంజిత్ సింఘ్ పురమండలం ‌కు యాత్రార్ధమై వచ్చి యాత్రికులకు సౌకర్యవంతమైన సత్రాలు నిర్మించడం కొరకు తగినంత బంగారం దానంగా ఇచ్చాడు. తరువాత అసలైన హిందూ సంప్రదాయం ప్రతిబింబిస్తున్న ధర్మసత్రాలు నిర్మించబడ్డాయి. ఆయన వెంట వచ్చిన గులాబ్ సింఘ్ తరువాత రాజై జమ్ము , కాశ్మీర్ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన " ఓం పతి శివుడు " కొరకు ఆలయనిర్మాణం కొరకు పుష్కలంగా ఖర్చుచేసాడు. పురమండలం ‌ ప్రధాన భవనాన్ని కాశ్మీర్ రాజు వాణిదత్ నిర్మించాడని ప్రబల పురాణ కథనం వివరిస్తుంది. సా.శ. 853 కల్తాంస్ రాజు " రాజతరంగ్నీ" ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఈ ప్రాంతానికి చెందిన చరిత్ర 12వ శతాబ్దం నుండి లభిస్తుంది. ఆయన ఈ ఆలయసముదాయాన్ని వసంతోత్సవాల సమయంలో ఆయనకున్న శివభక్తికి నిదర్శనంగా దీనిని నిర్మించాడు. వాణిదత్త కుమార్తె శిరోసంబంధిత వ్యాధితో బాధపడుతున్న సమయంలో కొందరు సన్యాదులు ఆయనకు ఇలాంటి శివాలయాన్ని నిర్మించమని సలహా ఇచ్చారు. అలాగే కుమార్తె వ్యాధి నిర్మూలమైన తరువాత మొక్కుతీర్చుకోవడానికి రాజావాణిదత్తు ఈ ఆలయనిర్మాణం చేసాడు.

నీల్మఠ్ పురాణ్

మార్చు

7వ శతాబ్దంలో నీలముని నీల్మఠ్ పురాణంలో దేవికా నది గురించిన ప్రాస్తావిస్తూ పార్వతీదేవి ప్రత్యక్షం అయిందని వర్ణించాడు. దేవికా నది శివరాత్రి రోజు ఆవిర్భవించింది. పార్వతీ దేవి మద్రదేశ ప్రజల క్షేమం కొరకు స్వయంగా వెలసింది. పరమశివుడు కూడా పార్వతీ దేవి సమీపంలో లింగరూపంలో ఆవిర్భవించాడు. దేవికానదీ తీరంలో దాదాపు 8 ప్రదేశాలలో పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించాడు. దేవికా నదిలో స్నానం చేసినవారికి జపతపాలు అవసరం లేదని, ఇక్కడ శ్రాధకర్మలు ఆచరిస్తే పితరులకు మోక్షం సులువుగా లభిస్తుందని దేవీపురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.

సంస్కృతి

మార్చు

ఉధంపూర్ వేగవంతమైన గాలులకు, వందలాది నీటి మడుగులకు , పలువిధమైన పుకార్లకు నిలయమని ఉధంపుర్ డోగ్రా ఆహారనిపుణుడు వీను ఒక " ఫుడ్ ఫెస్టివల్ " సందర్భంలో పేర్కొన్నాడు. దేవికా నది కారణంగా ఊధంపూర్ జిల్లా ప్రఖ్యాతి చెందింది. దేవికా నదిని గంగానది చిన్న చెల్లెలని భావిస్తున్నారు. ఉధంపూర్ జిల్లాలో మాంసర్ సరసు ఉంది. కాలేజి విద్యార్థులకు మంసర్ సరసు విహారప్రదేశంగా ఉంది. శ్రీమాత వైష్ణవీ దీవి భక్తులు కూడా ఉధంపూర్‌లో బస చేస్తున్నారు. ఇది ఉధంపూర్ జిల్లాకు ప్రాముఖ్యత సంతరించిపెట్టింది.

నగరాలు , పట్టణాలు

మార్చు

బట్లె, మంసర్, తబు, చెనాని, నర్సు, తలోరా, డోమైల్, రాంకోట్, జిబ్, ఉధంపూర్, జఘను, రాంనగర్, పత్నిటాప్, మంవాల్, కిషంపూర్, రియాసి, కత్రా, తంగర్, సంసూ, బల్వల్త, పాల్తియార్.

సైన్యం

మార్చు

ఉధంపూర్ జిల్లా " ది నార్తెన్ కమాండ్ హెడ్క్వార్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ "లో ఉంది. 39వ ఇంఫాంటరీ డివిషన్, 2వ,3వ , 16వ ఇండిపెండెంట్ బ్రిగేడరీ కాక మిగిలిన అన్ని యూనిట్లు కాశ్మీర్లో ఉన్నాయి. స్వతంత్రానికి ముందు నార్తెన్ కమాండ్ హెడ్క్వార్టర్లు రావల్పిండిలో ఉండేవి. ఇవి నైరుతీ భారతదేశ స్వతంత్రానికి బాధ్యత తీసుకున్నాయి. తరువాత కమాండ్ ప్రధానకార్యాలయం పాకిస్థాన్కు ఇవ్వబడింది. భారతదేశంలో " వెస్టర్న్ కమాండ్ " పేరిట మరొక కమాండ్ రూపొందించి చేసి దాని ప్రధానకార్యాలయం సిమ్లాలో ఏర్పాటు చేయబడింది. ఇది ఉత్తరభాతదేశంలోని పాకిస్థాన్ , టిబెట్ రక్షణబాధ్యత వహిస్తుంది.

1948లో " మొదటి కాశ్మీర్ యుద్ధం "లో ఉత్తరభారతదేశంలో ప్రత్యేక ప్రధానకార్యాలయం అవసరమని భావించబడింది. 1962 సినో- ఇండియన్ - యుద్ధం, 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం , 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధం తిరిగి ఉత్తరభారతదేశ రక్షణ పట్ల శ్రద్ధ అవసరమని భావించబడింది. 1971 నుండి డూప్లికేట్ సిబ్బందితో డూప్లికేట్ ప్రధానకార్యాలయం సిమ్లాలో ఏర్పాటు చెయ్యబడింది. 1971 " నార్తెన్ కమాండ్ " ప్రధానకార్యాలయం జమ్ము, కాశ్మీర్ , లఢక్ సరిహద్దు బాధ్యతల కొరకు ఉధంపూర్‌లో ఏర్పాటు చేయబడింది.

1972 జూన్‌లో ఈ ప్రాంతపు రక్షణకు 2 కార్ప్స్ తో నార్తెన్ కమాండ్ ఏర్పాటు చేయబడింది. అది ప్రస్తుతం 3 కార్ప్స్‌గా అభివృద్ధి చేయబడింది. నార్తెన్ కమాండ్ ప్రస్తుతం దేశం లోని సున్నిత భూభాగం " జమ్ము , కాశ్మీర్ " , పంజాబ్ , హిమాచల్ ప్రదేశ్ లలోని కొంతభాగం రక్షణ భారాన్ని వహిస్తుంది. ఈ ట్రూపులు ప్రస్తుతం ప్రపంచపు అత్యంత ఎత్తైన భాభాగం సిసిలియన్ గ్లాసియర్‌ను రక్షిస్తుంది. సిసిలియన్ గ్లాసియర్ వద్ద భాభాగం ఎత్తు 1500-2300 మీ ఉంటుంది. ఈ కమాండ్ 1990లో ప్రారంభమైన అంతర్యుద్ధంలో కూడా ప్రధానపాత్ర వహిస్తుంది. ఈ యుద్ధంలో 18,000 ఉగ్రవాదులు మరణించారు. 80 టన్నుల మందుగుండు , 40,000 ఆయుధాలు పట్టుబడ్డాయి. ఈ కమాండ్ సరిహద్దులలో కంచె ఏర్పాటు చేసి దేశంలోకి ప్రవేశించే వారిని వెలుపలికి వెళ్ళేవారిని పరిశీలిస్తూ ఉంటుంది.

14వ కార్ప్స్

మార్చు

14వ కార్ప్స్ లఢక్ , కార్గిల్ భూభాగపు రక్షణబాధ్యత వహిస్తుంది. అలాగే సరిహద్దు వద్ద శత్రువు స్థితి గురించిన రహస్యసమాచారం సేకరించే బాధ్యత వహిస్తుంది. 1999 కార్గిల్ యుద్ధం కొరకు 1999 మే మాసంలో 8వ మౌంటెన్ డివిషన్ రూపొందించబడింది. యుద్ధం తరువాత 15,000-1000 మీ వరకు చొరబాటును గమనించి అడ్డుకునే బాధ్యత అప్పగించబడింది. 5 విభాగాలు కలిగిన 15వ కార్ప్స్ ప్రపంచంలో అతి పెద్దదని భావించబడుతుంది.

రాజకీయాలు

మార్చు

ఉధంపూర్ జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : ఉధంపూర్, చెనాని , రామ్నగర్. నేధనల్ పాంథర్స్ పార్టీకి ఉధంపూర్ జిల్లాలో అనుయాయులు అధికంగా ఉన్నారు. తరువాత స్థానంలో బి.జె.పి పార్టీ , ఐ.ఎన్.సి ఉంది.[6]

సరిహద్దులు

మార్చు

మూలాలు

మార్చు
  1. https://udhampur.nic.in/
  2. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Wyoming 563,626
  6. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.

వెలుపలి లికులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు