ఉప్పలకలువగుంట
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
ఉప్పలకలువగుంట గ్రామం కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఉప్పలకలువగుంట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | పెడన |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521366 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
మార్చుగ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్ పాఠశాల
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుపెడన,గుడ్లవల్లేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 65 కి.మీ
గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం
మార్చుఈ గ్రామములో 24 ఎకరాల (38,880 చదరపు మీటర్లు) లో విస్తరించుకున్నఒక భారీ చెరువును, ఐదు సంవత్సరాల క్రితం, గ్రామీణ నీటి సరఫరా సంస్థ (R.W.S) కు అప్పగించినారు. ఈ చెరువు దాదాపు 250 క్యు.సెక్. ల నీటిని నిల్వ చేసే సామర్ధ్యం ఉన్నది. అప్పటి నుండి ఈ చెరువు, ఈ గ్రామములోని జలసంరక్షణతోపాటు, మండలంలోని 28 గ్రామాలలోని 13,000 మంది ప్రజల దాహార్తిని తీర్చుచున్నది. ప్రస్తుతం ఈ నీటి పథకం అభివృద్ధికి రు. 5 కోట్ల నిధులు మంజూరవగా, వీటిలో ఒకటిన్నర కోట్ల రూపాయలతో, చెరువు పూడికతీత మరియూ రీటైనింగ్ వాల్ నిరంఆణ పనులు చేపట్టబోవుచున్నారు.[1]
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం కమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామ దేవత శ్రీ అంకమ్మ తల్లి ఆలయం
మార్చుఈ ఆలయంలో అమ్మవారి వార్షిక వేడుకలను 2016,మే-15 ఆదివారం నుండి 19వతేదీ గురువారం వరకు, ఐదురోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించెదరు. 15వతేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు అమ్మవారు, చేవేండ్రపాలెంలోని, పుట్టింటికి చెందిన, కూనపరెడ్డి వంశీయుల ఇంటికి వెళ్ళి, అక్కడ పూజలు అందుకుంటారు. తిరిగి అదే రోజు సాయంత్రం ఊరేగింపుగా గ్రామంలోని ఆలయంలోనికి ప్రవేశించెదరు. ఇక అక్కడ నుండి ఉత్సవాలు ప్రారంభమగుతవి.[2]