ఉప్పల్ స్కైవాక్

తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ జంక్షన్‌లోని పాదచారుల వంతెన

ఉప్పల్ స్కైవాక్‌, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ జంక్షన్‌లో పాదచారుల భద్రతకోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన పాదచారుల వంతెన.[1][2] 25 కోట్ల రూపాయలతో 660.0 మీటర్లు పొడవు, 6 మీటర్ల ఎత్తులో లూప్‌ ఆకారంలో నిర్మించిన ఈ స్కైవాక్‌ దేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా రికార్డుల్లోకి ఎక్కింది.[3]

ఉప్పల్ స్కైవాక్
ఉప్పల్ స్కైవాక్
ప్రదేశం
ఉప్పల్, హైదరాబాదు, తెలంగాణ
జంక్షన్ వద్ద
రహదార్లు
రామంతాపూర్‌-బోడుప్పల్‌
హబ్సిగూడ-ఎల్బీనగర్
నిర్మాణం
రకంఫ్లైఓవర్
లైన్స్1
నిర్మాణం చేసినవారువాడుకలో ఉంది by హైదరాబాదు మహానగర పాలక సంస్థ
ప్రారంభం2023, జూన్ 26
గరిష్ట
ఎత్తు
6 మీటర్లు
గరిష్ట
వెడల్పు
660.0 మీటర్లు పొడవు

ప్రతిపాదన

మార్చు

ఉప్పల్ చౌరస్తాలో నిత్యం 20వేల నుండి 30వేల మంది రోడ్డు దాటుతుంటారు. ఆ సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ప్రమాదాలలో ఎక్కువశాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రామంతాపూర్‌-బోడుప్పల్‌ రోడ్డుకు, హబ్సిగూడ-ఎల్బీనగర్ వైపు మార్గాలను అనుసంధానం చేస్తూ పాదచారులు అన్ని వైపులా వెళ్ళేందుకు వీలుగా ఈ స్కైవాక్‌ అందుబాటులోకి వచ్చింది. ఎలివేటెడ్‌ కారిడార్‌తోపాటు ఎండ, వర్షం పడకుండా నిర్మిస్తున్న ఈ స్కైవాక్ ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌కు అనుసంధానం చేశారు.[4]

నిర్మాణం

మార్చు

2020 సంవత్సరం చివర్లో దీని నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్టులో 90 శాతం వరకు స్ట్రక్చరల్ స్టీల్ (1000 టన్నులు) ఉపయోగించబడింది. వెల్డింగ్ పనులకోసం ఆక్సిజన్ సిలిండర్ లు అవసరమయ్యాయి. అయితే, వరుసగా రెండు సంవత్సరాలు కరోనా పరిస్థితుల కారణంగా నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి.

ప్రారంభం

మార్చు

2023, జూన్ 26న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఉప్పల్ స్కైవాక్ ను ప్రారంభించాడు.[5] ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖామంత్రి సి.హెచ్. మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి శుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్, నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6]

విశేషాలు

మార్చు

స్కైవాక్‌ మొత్తం పొడవు 660.0 మీటర్లు, వెడల్పు (వర్టికల్‌ వెడల్పు) 3, 4, 6 మీటర్లు, ఎత్తు 6 మీటర్లుగా ఉంది. దీనికి మొత్తం 37 పిల్లర్లు, 8 లిఫ్టులు, 4 ఎస్కలేటర్స్‌, 6 మెట్ల సౌకర్యం కూడా ఉంటుంది. నాగోల్‌ రోడ్‌ మెట్రోస్టేషన్‌, రామంతాపూర్‌ రోడ్‌, జీహెచ్‌ఎంసీ థీమ్‌ పార్కు, వరంగల్‌ బస్టాప్‌ (జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద), ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ (ఎమ్మార్వో కార్యాలయం), ఉప్పల్‌ ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌ వంటి ప్రాంతాలలో ఆరు చోట్ల ఎగ్జిట్‌/ఎంట్రీ పాయింట్స్‌ ఉన్నాయి. బ్యూటీఫికేషన్ లుక్ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు.[7]

సదుపాయాలు

మార్చు

స్కై వాక్ మీద నియంత్రణ నిఘా కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేయబడ్డాయి. స్కై వాక్‌ బ్రిడ్జి మీదే పాదచారుల కోసం మరుగుదొడ్ల సౌకర్యంతోపాటు ఇరువైపులా రక్షణ కోసం రెయిలింగ్ సెట్ చేశారు.[8]

మూలాలు

మార్చు
  1. India, The Hans (2022-10-28). "Hyderabad: Skywalk to adorn Uppal junction soon". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-10-28. Retrieved 2023-01-23.
  2. "uppal skywalk: కొత్త ఏడాదిలో ఉప్పల్‌ స్కైవాక్‌". EENADU. Archived from the original on 2023-01-23. Retrieved 2023-01-23.
  3. Chary, Maheshwaram Mahendra. "Uppal skywalk : 26న 'ఉప్పల్‌ స్కైవాక్‌' ప్రారంభం - ఈ సరికొత్త వంతెన ప్రత్యేకతలివే". Hindustantimes Telugu. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.
  4. Today, Telangana (2022-02-18). "Hyderabad: 660-metre skywalk to ease traffic congestion at Uppal". Telangana Today. Archived from the original on 2022-02-18. Retrieved 2023-01-23.
  5. "Uppal Skywalk: 'ఉప్పల్‌ స్కైవాక్‌'ను ప్రారంభించిన కేటీఆర్‌.. ప్రత్యేకతలివీ." EENADU. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.
  6. telugu, NT News (2023-06-26). "Minister KTR | ఉప్పల్‌లో స్కైవాక్‌ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.
  7. telugu, NT News (2022-10-28). "ఉప్పల్‌ జంక్షన్‌లో..స్కై వాక్‌ రెడీ!". www.ntnews.com. Archived from the original on 2022-11-14. Retrieved 2023-01-23.
  8. Telugu, TV9 (2023-06-24). "Hyderabad: ప్రారంభానికి సిద్ధమైన ఉప్పల్‌ స్కైవాక్‌.. ప్రత్యేకతలు తెలిస్తే వారెవ్వా అనాల్సిందే". TV9 Telugu. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)