ఉమా నెహ్రూ

భారతీయ రాజకీయనేత

ఉమా నెహ్రూ ( 1884 మార్చి 8 - 1963 ఆగస్టు 28) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు.[1]

ఉమా నెహ్రూ
జననం(1884-03-08)1884 మార్చి 8
మరణం1963 ఆగస్టు 28(1963-08-28) (వయసు 79)
జాతీయతభారతదేశం
వృత్తిస్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిశ్యామ్‌లాల్‌ నెహ్రూ
పిల్లలుశ్యామ్ కుమారి
ఆనంద్ కుమార్
బంధువులునెహ్రూ-గాంధీ కుటుంబం

జననం, విద్యాభ్యాసం

మార్చు

ఉమా 1884, మార్చి 8న ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో జన్మించింది. హుబ్లీలోని సెయింట్ మేరీస్ కాన్వెంట్‌లో చదువుకున్నది.[2]

వ్యక్తిగత జీవితం

మార్చు

1901లో ఉమా నెహ్రూకు జవహర్‌లాల్ నెహ్రూ బంధువు శ్యామ్‌లాల్‌ నెహ్రూతో వివాహం జరిగింది. వారికి శ్యామ్ కుమారి అనే కుమార్తె, ఆనంద్ కుమార్ అనే కుమారుడు ఉన్నారు.[3] ఆనంద్ కుమార్ నెహ్రూ కుమారుడు అరుణ్ నెహ్రూ 1980లలో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

పత్రికారంగం

మార్చు

20వ శతాబ్దం ప్రారంభంలో 1909లో రామేశ్వరి నెహ్రూ స్థాపించిన స్త్రీ దర్పన్‌ అనే మహిళా మాస పత్రికలో రచయితగా గుర్తింపు పొందింది. తన రచనల్లో స్త్రీవాద అభిప్రాయాలను వ్యక్తం చేసింది.[4]

ఉద్యమం, రాజకీయరంగం

మార్చు

ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలలో పాల్గొని, జైలుకు కూడా వెళ్ళింది.[5] స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయింది.[2] 1962 నుండి ఆమె మరణించే వరకు, రాజ్యసభ సభ్యురాలిగా కూడాపనిచేసింది.[6]

ఉమా నెహ్రూ 1963, ఆగస్టు 28న లక్నోలో మరణించింది.[7]

మూలాలు

మార్చు
  1. "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2022-10-08.
  2. 2.0 2.1 "Members Bioprofile". 164.100.47.132. Archived from the original on 2014-07-14. Retrieved 2014-06-15.
  3. Nehru-Gandhi family tree.
  4. Anup Taneja (2005). Gandhi, Women, and the National Movement, 1920–47. Har-Anand Publications. pp. 46–47.
  5. R. S. Tripathi, R. P. Tiwari (1999). Perspectives on Indian Women. APH Publishing. p. 143. ISBN 81-7648-025-8.
  6. http://rajyasabha.nic.in/rsnew/pre_member/1952_2003/n.pdf
  7. "Homage to Uma Nehru". 30 August 1963. p. 5.

గ్రంథ పట్టిక

మార్చు
  • «ఐ ప్రిమి పాసి డెల్ ఫెమ్మినిస్మో ఇండియానో: రామేశ్వరి ఇ ఉమా నెహ్రూ నెల్లీ'ఇండియా డి ఇనిజియో నోవెసెంటో | Storia delle Donne », 10 luglio 2020. https://oaj.fupress.net/index.php/sdd/article/view/2520/2520 .