ఋణానుబంధం (ఇంగ్లీష్: డెట్ రిలేషన్) 1960 నాటి తెలుగు చలనచిత్రం.[2] ఇది పి. ఆదినారాయణరావుచే అంజలి పిక్చర్స్ బ్యానరుపై (స్వంత బ్యానరు) నిర్మించబడింది. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, అంజలి దేవి ప్రధాన పాత్రలలో నటించారు.[3] పి. ఆదినారాయణ రావు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ప్రారంభ సన్నివేశాన్ని గేవాకలర్‌లో కలిగి ఉంది.

ఋణానుబంధం
Theatrical release poster
దర్శకత్వంవేదాంతం రాఘవయ్య
రచనఆచార్య ఆత్రేయ
స్క్రీన్ ప్లేవేదాంతం రాఘవయ్య
నిర్మాతపి. ఆదినారాయణరావు
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు
అంజలీదేవి
ఛాయాగ్రహణంసి.నాగేశ్వరరావు
కూర్పుఎన్.ఎస్.ప్రకాశం
సంగీతంపి. ఆదినారాయణరావు
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఈష్టు ఇండియా
విడుదల తేదీ
7 డిసెంబరు 1960 (1960-12-07)
సినిమా నిడివి
163 ని.లు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఒక గ్రామంలో లక్ష్మి (అంజలి దేవి) ఒక అనాథగా నివస్తుంటుంది. సుబ్బన్న (గుమ్మడి) అనే స్థానిక గూండా ఆమెను తన సొంత సోదరిలా చూసుకుంటుంటాడు. ఆ గ్రామంలోనే నివసిస్తున్న ప్రతాప్ రావు (సి.యస్.ఆర్. ఆంజనేయులు) ఒక జమీందార్, ల్యాండ్ సీలింగ్ చట్టానికి భయపడి,పట్టణంలో నివసించాలని నిర్ణయించుకుని,తన ఆస్తినంతటిని బంగారం రూపంలో మార్చుకుంటాడు.దురదృష్టవశాత్తు ఒక రోజు రాత్రి జమీందార్  ఇంటిలో మంటలు చెలరేగుతాయి. అ మంటలలో జమీందార్ మరణిస్తాడు. ప్రమాదంలో ఉన్న అతని భార్య కాంతం (నిర్మలమ్మ) , కుమారుడు రఘు (మాస్టర్ గోపి) లను లక్ష్మిని రక్షించింది.జమీందార్ తన చివరి శ్వాస తీసుకునే ముందు భార్య కాంతంతో  కుమారుడు రఘును డాక్టర్గా చూడాలనుకున్నానని లక్ష్మి సమక్షంలో తన ఆశయాన్ని వెల్లడిస్తాడు.జమీందార్ కలను నెరవేరుస్తానని లక్ష్మి వాగ్దానం చేసింది.

ఆ తరువాత రఘును పాఠశాలలో చేర్పించటానికి లక్ష్మి నగరానికి మకాం మార్చి, రఘను చేర్పించిన స్కూలు ప్రధానోపాధ్యాయుడు నరసింహం (రేలంగి వెంకట్రామయ్య) ఇంట్లో సేవకురాలుగా పనిచేయటానికి చేరింది.ఇక్కడ ప్రధానోపాధ్యాయుడి మేనల్లుడు సూర్యం (అక్కినేని నాగేశ్వర రావు) ఆమెపై ప్రేమను పెంచుకుని, అతను కూడా లక్ష్మి బాధ్యతలో పాల్గొనాలని నిర్ణయించుకుంటాడు.ఇంతలో  సుబ్బన్న దహనం అయిన జమీందార్ ఇంటిలో దాచిన నిధిని తవ్వి, దానిని ప్రభుత్వానికి అప్పగించి, లక్ష్మి, రఘులను వెతకటానికి బయలుదేరతాడు.

ఈ లోగా ప్రతాప్ రావు బంధువు వీరభద్రయ్య (రాజనాల) ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుంటాడు.ఆ స్థలాన్ని  లక్ష్మి, రఘుతో విడిచిపెట్టినప్పటి సంగతినిగురించి సుబ్బన్న అధికారులకు చెప్పిననూ, అతని మాటలను పట్టించుకోరు.అనేక అడ్డంకులను దాటిన తరువాత లక్ష్మి ఆచూకీని సుబ్బన్న కనుగొంటాడు.

అదే సమయంలో నరసింహం, భార్య గజలక్ష్మి (సూర్యకాంతం) ఇద్దరూ, లక్ష్మీ, సూర్యంల ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకుంటారు. నరసింహం భార్య గజలక్ష్మి  లక్ష్మీ , సుబ్బన్నల మధ్య అక్రమ సంబందాన్ని ఆపాదించడం ద్వారా తన కుమార్తె పద్మ (గిరిజ) తో సూర్యం వివాహం జరిగింది.

అది తెలుసుకున్న కోపంతో సుబ్బన్న గజలక్ష్మిని చంపడానికి ప్రయత్నిస్తాడు. తద్వారా జైలులో అడుగుపెడతాడు. అప్పుడు లక్ష్మి ఒంటరిదైంది.కానీ ఆమె లక్ష్యాన్ని నెరవేర్చడానికి ధైర్యం, శ్రమలతో నిలుస్తుంది.

సంవత్సరాలు గడిచేకొద్దీ, రఘు (హరనాథ్) ను డాక్టర్‌గా చేయడంలో లక్ష్మి విజయవంతమవుతుంది. రఘు డాక్టరుగా నిరాశ్రయులకు సేవ చేయడానికి ఆసుపత్రిని నిర్మించాలనుకుంటాడు. ఆ సమయంలో, లక్ష్మి తన తండ్రి నిధి గురించి గుర్తు చేసింది.

మరొక వైపు  వీరభద్రయ్య రఘు సజీవంగా ఉన్నాడని తెలుసుకుని, అతన్ని అంతం చేయాలని కుట్ర చేస్తాడు. అదే సమయంలో  సుబ్బన్న గజలక్ష్మి నుండి సత్యాన్ని గ్రహించి బయటపెడ్తాడు.ఆ విషయం తెలిసిన వెంటనే సూర్యం, లక్ష్మి కోసం పరుగెత్తుతాడు. ఆ సమయానికి వీరభద్రయ్య లక్ష్మిని, రఘును కిడ్నాప్ చేస్తాడు. వారిద్దరిని సూర్యం,సుబ్బన్న రక్షింస్తారు.ఇంతలో రఘుకు హాని జరగకుండా కాపలా కాస్తున్నప్పుడు లక్ష్మి చనిపోతుంది. చివరగా, లక్ష్మి పేరిట రఘు ఒక స్మారక ఆసుపత్రిని నిర్మించడంతో చిత్రం  ముగుస్తుంది.

తారాగణం

మార్చు

ఇతర సాంకేతిక వర్గం

మార్చు
 • కళ: వాలి, శేఖర్
 • నృత్యాలు: వెంపటి
 • కథ - సంభాషణలు: ఆచార్య ఆత్రేయ
 • సాహిత్యం: సముద్రాల జూనియర్, కొసరాజు
 • నేపథ్య గానం: ఘంటసాల, పి. సుశీల, ఎస్. జానకి, పి. బి. శ్రీనివాస్
 • కూర్పు: ఎన్.ఎస్.ప్రకాశం
 • ఛాయాగ్రహణం: సి.నాగేశ్వరరావు
 • సంగీతం - నిర్మాత: పి. ఆదినారాయణరావు
 • చిత్రానువాదం - దర్శకుడు: వేదాంతం రాఘవయ్య
 • బ్యానర్: అంజలి పిక్చర్స్
 • విడుదల తేదీ: 1960 డిశెంబరు 07
 • సౌండ్ట్రాక్:పి. ఆదినారాయణరావు సంగీతం సమకూర్చారు. ఇ.ఎం.ఐ, కొలంబియా ఆడియో కంపెనీద్వారా సంగీతం విడుదల చేయబడింది.

పాటలు

మార్చు
వ.సంఖ్య పాట పేరు సంగీతం గాయకులు పాట నిడివి
1 "అందాలు చిందగాను" సముద్రాల జూనియర్ పి. సుశీల 4:49
2 "ఓ అందమైనా బావా" కొసరాజు పి. బి. శ్రీనివాస్, ఎస్. జానకి 2:35
3 "యే యెహే" కొసరాజు పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 3:47
4 "లోకాలనేలే చల్లనయ్య" సముద్రాల జూనియర్ పి. సుశీల 2:53
5 "మాటే జీవిత లక్ష్యం" సముద్రాల జూనియర్ ఘంటసాల 2:49
6 "నిండు పున్నమి ఇలా" సముద్రాల జూనియర్ పి. సుశీల, ఎస్. జానకి 5:01
7 "ఓహో ఓయారీ లాహిరీ" సముద్రాల జూనియర్ ఘంటసాల, పి. సుశీల 3:05
8 "రావేల అందాల బాలా" సముద్రాల జూనియర్ ఘంటసాల, పి. సుశీల 8:00
9 "ఏనాటిదో ఈ బంధం" సముద్రాల జూనియర్ ఘంటసాల 3:07

10.లోకాలనేలే చల్లనయ్య మాపాలి రామయ్యా, రచన:సముద్రాల జూనియర్, గానం.పి.సుశీల,సరోజిని

11.లక్ష్మీమ్ క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం,(సాంప్రదాయ శ్లోకం), గానం ఘంటసాల వెంకటేశ్వరరావు.

మూలాలు

మార్చు
 1. "ఋణానుబంధం (Overview)". IMDb.
 2. 2.0 2.1 https://www.imdb.com/title/tt0257070/
 3. "Runanubandham". KnowYourFilms (in ఇంగ్లీష్). Retrieved 2020-07-26.

వెలుపలి లంకెలు

మార్చు