అంజలీదేవి

సినీ నటి, నిర్మాత
(అంజలి దేవి నుండి దారిమార్పు చెందింది)

అభినవ సీతమ్మగా పేరొందిన అంజలీదేవి (ఆగష్టు 24, 1927 - జనవరి 13, 2014) 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి, నిర్మాత.[1] ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము,[2] 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది.

అంజలీదేవి

జన్మ నామంఅంజనీ కుమారి
జననం (1927-08-24)1927 ఆగస్టు 24 ఆగష్టు 24, 1927
పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా
మరణం 13 జనవరి 2014(2014-01-13) (aged 86)
చెన్నై, తమిళనాడు
భార్య/భర్త పి.ఆదినారాయణరావు
ప్రముఖ పాత్రలు లవకుశ
చెంచులక్ష్మి
శ్రీ లక్ష్మమ్మ కథ
అంజలీదేవి చిత్రపటం

బాల్యం

మార్చు

అంజలీదేవి 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించింది.[3] ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.[4]

చిత్ర సమాహారం

మార్చు

నటిగా

మార్చు

1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు.[5] సువర్ణసుందరి, అనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. బృందావనం (1992), అన్న వదిన (1993), పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.

నిర్మాతగా

మార్చు

అనార్కలి (1955) లో అంజలీదేవి నాయికగా అక్కినేని నాగేశ్వరరావు జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత భక్త తుకారాం (1973), చండీప్రియ (1980) నిర్మించింది. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్ బాబు, చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది.

కుటుంబం

మార్చు

ఆమె భర్త సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు. ఆమెకు ఇద్దరు కుమారులు.

కొన్ని ముఖ్యమైన చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు భాష పోషించిన పాత్ర విశేషాలు
1936 రాజా హరిశ్చంద్ర తెలుగు లోహితాస్యుడు అంజలీదేవి నటించిన మొదటి సినిమా
1949 కీలుగుర్రం తెలుగు మోహిని (రాక్షసి) అక్కినేని మొదటి సినిమా.
1950 శ్రీ లక్ష్మమ్మ కథ తెలుగు లక్ష్మమ్మ
1950 పల్లెటూరి పిల్ల తెలుగు శాంత అక్కినేని; ఎన్టీయార్ కలిసి నటించిన తొలి సినిమా
1953 పక్కయింటి అమ్మాయి తెలుగు లీలాదేవి, పక్కింటమ్మాయి రేలంగి నటించిన ప్రముఖ హాస్యచిత్రం.
1954 పెన్ తమిళం
1955 అనార్కలి తెలుగు అనార్కలి
1957 సువర్ణ సుందరి తెలుగు దేవకన్య సువర్ణసుందరి
1958 చెంచులక్ష్మి తెలుగు చెంచులక్ష్మి/లక్ష్మీదేవి
1959 జయభేరి తెలుగు మంజువాణి మంచి సంగీతభరిత చిత్రం.
1962 భీష్మ తెలుగు అంబ ఎన్టీయార్ భీష్మునిగా నటించిన భారతకథ.
1963 లవకుశ తెలుగు సీతాదేవి ఘనవిజయం సాధించిన చిత్రం.
1967 భక్త ప్రహ్లాద తెలుగు లీలావతి రోజారమణి ప్రహ్లాదునిగా నటించిన చిత్రం భక్తి చిత్రం
1972 బడిపంతులు తెలుగు ఎన్టీయార్ భార్య ఎన్టీయార్ బడిపంతులుగా నటించిన సందేశాత్మక చిత్రం
1973 తాతా మనవడు తెలుగు సీత, రంగయ్య భార్య దాసరి దర్శకత్వంలోని సందేశాత్మక చిత్రం.
1975 సోగ్గాడు తెలుగు శోభన్‌బాబు తల్లి
1976 మహాకవి క్షేత్రయ్య తెలుగు
1978 అన్నాదమ్ముల సవాల్ తెలుగు అన్నదమ్ముల తల్లి కృష్ణ, రజనీకాంత్ నటించిన ఏక్షన్ సినిమా.
1980 చండీప్రియ తెలుగు శోభన్ బాబు, చిరంజీవి నటించిన హిట్ చిత్రం.
1985 శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం తెలుగు బాయీజా బాయ్ విజయచందర్ నటించిన షిర్డీ సాయి జీవితచరిత్ర.
1992 బృందావనం తెలుగు రాజేంద్రప్రసాద్ తల్లి మంచి కుటుంబ కథాచిత్రం

పురస్కారాలు

మార్చు
ఫిలింఫేర్ అవార్డ్

అంజలీ దేవి చెన్నైలో జనవరి 13, 2014 న, 86 సంవత్సరాలు వయస్సులో మృతి చెందారు.[6]

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Anjalidevi (ఐడిల్ బ్రెయిన్)
  2. "Anjali Devi to be honoured (Ramineni Foundation)". Archived from the original on 2008-01-06. Retrieved 2007-04-03.
  3. "Anjali Devi". IMDB. Retrieved 8 December 2012.
  4. http://www.dnaindia.com/entertainment/report-i-feel-i-ve-lost-my-mother-chandramohan-on-anjali-devi-1950943
  5. http://www.thehindu.com/news/cities/chennai/veteran-actor-anjali-devi-dead/article5574548.ece
  6. "వెండితెర సీత అంజలి దేవి కన్నుమూత". వన్ ఇండియా. Retrieved 13 జనవరి 2014.

బయటి లింకులు

మార్చు