ఎనికేపాడు, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామం పిన్ కోడ్ నం. 521 108., ఎస్.టి.డి.కోడ్ = 0866.

ఎనికెపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ వరికూటి కోటేశ్వరరావు
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 5,715
 - స్త్రీల సంఖ్య 5,324
 - గృహాల సంఖ్య 3,097
పిన్ కోడ్ 521 108
ఎస్.టి.డి కోడ్ 0866

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలంసవరించు

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 21 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో నిడమానూరు, ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

పెనమలూరు, విజయవాడ గ్రామీణ, గన్నవరం, కంకిపాడు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

రామవరప్పాడు, పోరంకి, ఎపిఎస్ ఆర్టీసి బస్ స్టేషన్ విజయవాడ. రైల్వేస్టేషన్: మేజర్ రైల్వేజంక్షన్, విజయవాడ.

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో గూడా విద్యా బోధన చేస్తున్నారు.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వరికూటి కోటేశ్వరరావు సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉతవాలు వైభవంగా నిర్వహించెదరు. [4]

శ్రీ సాయి గీతామందిరంసవరించు

ఈ గ్రామంలోని కె.వి.ఆర్ కాలనీలోని ఈ ఆలయ 11వ వార్షిక మహోత్సవాలు, 2015,ఆగష్ట్-21వ తేదీ శుక్రవారం నుండి 23వ తేదీ ఆదివారం వరకు వైభవంగా నిర్వహించెదరు. [3]

పర్యాటక ప్రదేశాలుసవరించు

ఎనికెపాడు సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కనకదుర్గ ఆలయం-ఇంద్రకీలాద్రి, మంగళగిరి, బీసెంట్ రోడ్, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి గుహలు, భవానీ ద్వీపం, రాజీవ్ గాంధీ పార్క్, కొండపల్లి కోట, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, గుణదల మేరీ మాతా పుణ్యక్షేత్రం, హజరత్‌బల్ మసీదు, లెనిన్ విగ్రహం, గుణదల (హిల్) కొండ, విక్టోరియా మ్యూజియం, రాధా కృష్ణ టెంపుల్, పాపీ హిల్స్, అక్కన్న, మాదన్న గుహలు, మహాత్మా గాంధీ హిల్స్ ఈ గ్రామానికి సమీపంలో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణలు.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

ఈ గ్రామంలో పొగాకు, వరి, చెరకు, వేరుశెనగ ఎక్కువగా సాగు చేసే ప్రధానమైన పంటలు.

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం.

ఎనికెపాడు వంటకాలుసవరించు

ఆవకాయ, అరిసెలు, గోంగూర పచ్చడి, కాకినాడ ఖాజ, మసాలా దోశ, పాలతాళికలు, అప్పడములు, పూర్ణాలు, పూతరేకులు, పులిహోర, రసం, సాంబార్, సున్నిండలు, ఉలవచారు, రాగి సంగటి, గోంగూర మటన్, చేపల పులుసు, వడ, పాయసం, చక్కెర పొంగల్, బొబ్బట్లు, పెసరట్టు ఉప్మా, జంతికలు మొదలైన అనేక రకాలు వంటకాలలో కొన్ని దోనె ఆత్కూరు వంటకాలులో ఉన్నాయి.

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8797.[3] ఇందులో పురుషుల సంఖ్య 4481, స్త్రీల సంఖ్య 4316, గ్రామంలో నివాసగృహాలు 2205 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 487 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 11,039 - పురుషుల సంఖ్య 5,715 - స్త్రీల సంఖ్య 5,324 - గృహాల సంఖ్య 3,097
 
ఎనికేపాడు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Vijayawada-Rural/Enikepadu". Retrieved 17 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-02.

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు విజయవాడ/గన్నవరం; 2013,ఆగష్టు-4; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-22; 4వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2017,ఫిబ్రవరి-25; 7వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఎనికెపాడు&oldid=2861068" నుండి వెలికితీశారు